MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Royal Enfield EV : రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర, రేంజ్ ఎంతో తెలుసా?

Royal Enfield EV : రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర, రేంజ్ ఎంతో తెలుసా?

 ప్రపంచంలోనే అత్యంత పురాతన మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్  తన తొలి ఈవీని లాంచ్ చేసింది. ధర నుంచి రేంజ్ వరకు ఎన్నో ప్రత్యేకతలున్న ఈ కొత్త మోడల్ విశేషాలు మీకోసం…

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 22 2026, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్
Image Credit : X

రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్

సంప్రదాయ మోటార్‌సైకిళ్లకు పెట్టింది పేరైన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 'ఫ్లయింగ్ ఫ్లీ C6' పేరుతో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. జూన్ 19 నుంచి బెంగళూరులో దీని డెలివరీలు మొదలయ్యాయి. పాతకాలపు డిజైన్‌, ఆధునిక టెక్నాలజీ కలయికతో వస్తున్న ఈ బైక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తక్కువ ధరకే కొత్త బైక్
Image Credit : X

తక్కువ ధరకే కొత్త బైక్

ఫ్లయింగ్ ఫ్లీ C6 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని షోరూమ్ ధర రూ.2.79 లక్షలు. అయితే 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' ప్లాన్ ఎంచుకుంటే ప్రారంభ ధర రూ.1.99 లక్షలకే వస్తుంది. దీంతో బైక్ కొనేటప్పుడు కట్టాల్సిన డబ్బు భారీగా తగ్గుతుంది. ఈ బైక్ స్టార్మ్ బ్లాక్, ఫ్లీ గ్రీన్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.

Related Articles

Related image1
Royal Enfield Bullet 650 : వచ్చేసింది కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650.. ధర, ఫీచర్లు ఇవే..!
Related image2
Royal Enfield: అదే రాజసం.. యూత్ ని అట్రాక్ట్ చేసేలా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్
34
154 కిలోమీటర్ల రేంజ్
Image Credit : X

154 కిలోమీటర్ల రేంజ్

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.91 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 154 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కేవలం 2 గంటల 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. దీని 15.4 kW ఎలక్ట్రిక్ మోటార్ 60 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు 0 నుంచి 60 కి.మీ వేగాన్ని 3.7 సెకన్లలోనే అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. దీని బరువు కేవలం 124 కిలోలు మాత్రమే.
44
సేఫ్టీ, టెక్నాలజీ ఫీచర్లు
Image Credit : X

సేఫ్టీ, టెక్నాలజీ ఫీచర్లు

ఈ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, 3.5-అంగుళాల కలర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్, ఐదు రకాల రైడింగ్ మోడ్‌లు, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే డెలివరీలు ప్రారంభమయ్యాయి. త్వరలో దేశంలోని ఇతర నగరాలకు విస్తరించాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాన్ చేస్తోంది. కస్టమర్లందరికీ 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవను ఉచితంగా అందిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ ఎందుకు అవసరం ఉండదు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా.?
Recommended image2
CNG vs Flex Fuel : తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజ్.. సిఎన్జీ, ప్లెక్స్ ఫ్యూయల్ కార్లలో ఏది బెస్ట్?
Recommended image3
Tata Tiago EV : ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా..? టియాగో ఈవీ మార్కెట్ ని షేక్ చేసేలా ఉందే..!
Related Stories
Recommended image1
Royal Enfield Bullet 650 : వచ్చేసింది కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650.. ధర, ఫీచర్లు ఇవే..!
Recommended image2
Royal Enfield: అదే రాజసం.. యూత్ ని అట్రాక్ట్ చేసేలా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved