ఫిబ్రవరి 15న భారత మార్కెట్లోకి రెనాల్ట్ కైగర్.. ఈ చౌకైన ఎస్‌యూవి ఫీచర్డ్స్, ధర తెలుసుకోండి
కార్ల తయారీ సంస్థ, ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్ వచ్చే వారం భారత్‌లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి 15న భారత మార్కెట్లో చౌకైన ఎస్‌యూవీని వస్తున్నట్లు ప్రకటించింది. చెన్నై ప్లాంట్‌లో కిగర్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభించినట్లు మంగళవారం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 500కి పైగా డీలర్‌షిప్‌లకు కార్లను పంపిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది.
చౌకైన ఎస్‌యూవీ!
జనవరి 28న ఢీల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కైగర్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్‌ను రెనాల్ట్ ప్రదర్శించింది. భారతదేశంలో ఇప్పటికే అత్యంత పోటీతత్వ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి కిగర్ ప్రవేశిస్తుందని తెలిపింది. ప్రస్తుతం చిన్న ఎస్‌యూవీల విభాగంలో చౌకైనా నిస్సాన్ మాగ్నెట్ ఎస్‌యూవీ ఇటీవల లాంచ్ అయిన తర్వాత, కైగర్ ఎస్‌యూవీతో వస్తున్నట్లు రెనాల్ట్ వెల్లడించింది.
కారు డిజైన్ దాని కాన్సెప్ట్ మోడల్‌కు చాలా పోలి ఉంటుంది. హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లను కారు ముందు బంపర్‌లో ఇచ్చారు, ఇది చాలా ఆకర్షణీయమైన, అధిక బోనెట్ రూపాన్ని ఇస్తుంది. సిగ్నేచర్ ఫ్రంట్ మెయిన్ గ్రిల్ స్టయిల్ కొత్త లుక్ ఇస్తుంది.రెనాల్ట్ కిగర్ కార్ డోర్లు, వీల్స్ పై బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను ఉపయోగించింది. ఈ కారుకి డ్యూయల్ టోన్ ఎఫెక్ట్‌తో పైకప్పు ఉంది. ఇది హై-ఎండ్ వేరియంట్‌లకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కారు వెనుక భాగంలో సి-ఆకారంలో ఎల్‌ఈడి టైల్ లైట్స్ ఇచ్చారు, ఇవి చాలా లేటెస్ట్ గా కనిపిస్తాయి.
ఇంజన్
రెనాల్ట్ కిగర్ రెండు ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది. మొదటిది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది 72 పిఎస్ శక్తి, 96 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. రెండవది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది 100 పిఎస్ శక్తిని, 160 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే సివిటి ఆప్షన్ తో 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌లో మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ల ఆప్షన్ కూడా ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కారుకి స్టాండర్డ్ 1.0-లీటర్ పెట్రోల్‌తో 5-స్పీడ్ ఈజీ-ఆర్ ఎఎమ్‌టి గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది. 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో 5-స్పీడ్ ఎక్స్-ట్రోనిక్ సివిటి గేర్‌బాక్స్ ఉంది. మల్టీసెన్స్ డ్రైవ్ మోడ్ ఫీచర్ రెనాల్ట్ కిగర్ లో ఇచ్చారు. ఈ కారును ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్‌లలో నడపవచ్చు.
రెనాల్ట్ కిగర్ ఎస్‌యూవీ మాడ్యులర్ CMF-A + ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో సంస్థ ఇప్పటికే రెనాల్ట్ ట్రైబర్‌ను నిర్మించింది. కార్ సైజ్ పరంగా రెనాల్ట్ కిగర్ ఎస్‌యూవీ రెనాల్ట్ మాగ్నైట్ లాగానే ఉంటుంది. మాగ్నైట్ ఎస్‌యూవీ పొడవు 3994 ఎంఎం, వెడల్పు 1758 ఎంఎం, ఎత్తు 1572 ఎంఎం. ఈ కారు దాని విభాగంలో అత్యధికంగా 205 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, దాని వీల్‌బేస్ 2500 ఎంఎం పొడవు ఉంటుంది.
ఇంటీరియర్ అండ్ ఫీచర్స్
రెనాల్ట్ కిగర్ ఇంటీరియర్ గురించి చెప్పాలంటే కారు క్యాబిన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కారు లోపల వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ రెప్లికేషన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, పిఎమ్ 2.5 క్లీన్ ఎయిర్ ఫిల్టర్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 20.32 సెంటీమీటర్ల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లోటింగ్ రూఫ్‌టాప్, ఆర్కామిస్ 3డి సౌండ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ బటన్ అంటే కీలెస్ యాక్సెస్, వాయిస్ రికగ్నిషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు
సేఫ్టీ ఫీచర్ల గురించి మాట్లాడితే కొత్త ఎస్‌యూవీ కిగర్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ఎబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ సప్లయి), రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సరౌండ్ వ్యూ మిర్రర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి, చైల్డ్ సీట్ యాంకర్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఐసోఫిక్స్ ఫీచర్లు కూడా అందించారు.
రెనాల్ట్ కిగర్ భారతదేశంలో తయారయ్యే ప్రపంచ ఉత్పత్తి అవుతుందని సంస్థ తెలిపింది. కొత్త రెనాల్ట్ ఎస్‌యూవీ లాంచ్ సమయంలోనే కంపెనీ ధరలను ప్రకటించనుంది. అయితే, నివేదిక ప్రకారం ఢీల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ .6 లక్షల నుండి రూ .8 లక్షల వరకు భారత మార్కెట్లో లాంచ్ చేయవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విభాగంలో కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా కెయువి 300 ఇతర ఎస్‌యూవీలతో కొత్త రెనాల్ట్ కిగర్ భారత మార్కెట్లో పోటీ పడనుంది.