హ్యుందాయ్ ఐ20 సరికొత్త స్పోర్టియర్ వెర్షన్.. ఇండియాలో దీని ధర ఎంతంటే ?
కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో ఐ20 ఎన్ లైన్ పేరుతో ఒక కొత్త కారును లాంచ్ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు ఒకటి 1.0-లీటర్ జిడిఐ టర్బో ఐఎమ్‌టి అండ్ మరొకటి డిసిటి ఇట్రేషన్‌లో అందిస్తున్నారు. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.84 లక్షల వద్ద మొదలై రూ.11.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
కొత్త హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ మూడు వేరియంట్లలో అందిస్తున్నారు. ఇందులో ఎన్ 6 ఐఎంటి, ఎన్ 8 ఐఎంటి, ఎన్8 డిసిటి ముఖ్యంగా హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కి స్పోర్టియర్ వెర్షన్. ఇంకా భారతదేశంలో హ్యుందాయ్ ఎన్ లైన్ డివిజన్ ఎంట్రీ-పాయింట్‌ని సూచిస్తుంది. దీనిలో 1.0-లీటర్ జిడిఐ టర్బో ఐఎంటి, డిసిటి ఇట్రేషన్‌లో మాత్రమే అందిస్తున్నారు. ఇంకా చాలా స్పోర్టిగా, సెక్సీగా కనిపిస్తుంది.
ఎన్ లైన్‌లోని అప్‌డేట్స్ ఒక రేసీ అండ్ స్పోర్టి లుక్ అందిస్తుంది.కారు ముందు భాగంలో ఫ్రంట్ ఎండ్ మ్యాట్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎన్ లైన్ లోగోతో కొత్త క్యాస్కేడింగ్ గ్రిల్ పొందుతుంది. కొత్త ఫ్రంట్ బంపర్ ద్వారా స్పోర్టి లుక్ ఇస్తుంది. స్పోర్టియర్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ బంపర్‌పై డిఫ్యూజర్ డైమెన్షన్ ఐ20 ఎన్ లైన్ సాధారణ ఐ20 కి సమానంగా ఉంటుంది. ఈ కారు మొత్తం పొడవు 3,995 ఎంఎం, వెడల్పు 1,775 ఎంఎం, ఎత్తు 1,505 ఎంఎం, కారు వీల్‌బేస్ 2,580 ఎంఎం.
అదేవిధంగా కారు లోపలి భాగంలో లేటెస్ట్ అప్‌డేట్‌లు స్పోర్టి ఎక్స్‌టీరియర్‌కి సరిపోతాయి. మీరు సీట్లపై బ్లాక్ అప్‌హోల్‌స్టరీతో ఆల్-బ్లాక్ క్యాబిన్ పొందుతారు. కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా లేధర్ తో చుట్టబడి ఉంటుంది. చివరకు కారు సీట్లపై ఎన్ లైన్ బ్యాడ్జింగ్, గేర్ నాబ్, అల్యూమినియం పెడల్స్ లభిస్తాయి. ఆపిల్ కార్‌ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ కార్ టెక్నాలజీ, ప్రీమియం బోస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో క్లైమేట్ వంటి స్టాండర్డ్ ఐ20 టర్బో రేంజ్-టాప్ అస్టా ట్రిమ్‌తో సమానంగా ఉంటుంది.
భద్రతా ఫీచర్ల విషయానికొస్తే, కొత్త ఐ20 ఎన్ లైన్ నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌తో వస్తుంది. ఇతర ఫీచర్లలో - 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో ఏబిఎస్, అత్యవసర స్టాప్ లైట్, ISOFIX, సెన్సార్‌లతో వెనుక పార్కింగ్ కెమెరా, సీట్ బెల్ట్ రిమైండర్ అందించారు. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ 1.0-లీటర్, మూడు సిలిండర్ల జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 6,000ఆర్‌పిఎం వద్ద 118 బిహెచ్‌పి శక్తిని, 1,500-4,000 ఆర్‌పిఎం వద్ద 172 ఎన్‌ఎంని ట్యూన్ చేస్తుంది. గేర్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (iMT), 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) ఉంటాయి. డిసిటి వెర్షన్ 0-100 kmph స్పీడ్ 9.9 సెకన్లలో అందుకుంటుంది.