లాంచ్ ముందే హోండా కొత్త జనరేషన్ మోడల్ కార్ ఫోటోలు లీక్.. ఫీచర్స్, డిజైన్, ఇంటీరియర్ ఎలా ఉందో చూడండి..
కార్ల తయారీ సంస్థ హోండా హెచ్‌ఆర్-వి ఎస్‌యూవీ గత నెలలో జపాన్‌లో లాంచ్ చేశారు. అయితే ఈ ఎస్‌యూవీ కూపే డిజైన్ త్వరలో కొత్త జనరేషన్ లుక్ లో విడుదల చేయనున్నారు. హోండా హెచ్‌ఆర్-వి ఎస్‌యూవీని ఇప్పటికే జపాన్, చైనాలో వీగెల్ పేరుతో విక్రయిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి కొత్త హెచ్‌ఆర్‌విని భారత్‌లో కూడా విడుదల చేయనున్నట్లు ఒక నివేదిక తెలిపింది. తాజాగా ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ కారు గురించి 15 ముఖ్యమైన విషయాలు ఎంటో తెలుసుకోండి..
భారత మార్కెట్లో హోండా హెచ్‌ఆర్-వి ఎస్‌యూవీ కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ తో పోటీ పడుతుంది. కొత్త హోండా హెచ్‌ఆర్‌వి డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ పరంగా చాలా పెద్ద మార్పులను చేసింది. 2021 హోండా హెచ్‌ఆర్-వి ఇంజిన్ సెటప్ గురించి చెప్పాలంటే ఇందులో 1.5-లీటర్ పెట్రోల్, హోండా హైబ్రిడ్ ఇ-హెచ్‌ఇవి యూనిట్ ఉన్నాయి. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ, సింగిల్ గేర్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది.
హోండా హెచ్‌ఆర్-విలో కొత్త హైబ్రిడ్ సిస్టం తీసుకొచ్చారు, ఇది 109 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది అలాగే 9.5 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు.ఇంకా లీటరుకు 27.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని హోండా పేర్కొంది. కొత్త 2021 హోండా హెచ్‌ఆర్-వి ఇంజన్ లో డ్రైవ్, ఎలక్ట్రిక్ డ్రైవ్, హైబ్రిడ్ డ్రైవ్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లను అందించారు.
2021 హోండా హెచ్‌ఆర్-వి లుక్ కూపే కారులాగా ఉంటుంది. దీనికి కొత్త ఫ్రంట్ గ్రిల్, స్టయిలిష్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లతో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌ఎస్, ఫ్రంట్ బంపర్లు, స్పోర్టి ఫాగ్ లాంప్ చాలా విలాసవంతమైనదిగా చేస్తుంది. దీనితో పాటు ఆకర్షణీయమైన వీల్ ఆర్చ్‌లతో డ్యూయల్-టోన్ మెషిన్ కట్ అల్లాయ్ వీల్స్, టర్న్ ఇండికేటర్స్‌తో డ్యూయల్ టోన్ ఓఆర్‌విఎంలు, సైడ్ బాడీ క్లాడింగ్‌తో అలంకరించి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ వెనుక భాగంలో రిడిజైన్ చేసిన ఎల్‌ఈడీ టైలాంప్‌లు, అప్‌డేటెడ్ బంపర్‌లు లభిస్తాయి.
పాత మోడల్‌తో పోలిస్తే కొత్త హోండా హెచ్‌ఆర్-వి 2021 కాస్త పెద్దగా ఉంటుంది ఇంకా దాని క్యాబిన్‌లో ఎక్కువ స్థలాన్ని అందించారు. కొత్త 2021 హోండా హెచ్‌ఆర్‌వి క్యాబిన్ లోపల కూడా గణనీయమైన మార్పులు చేసింది.2021 హోండా హెచ్‌ఆర్-విలో ఎన్నో లేటెస్ట్ ఫీచర్లలను అందించింది. కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ ఇచ్చే పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది.
అంతేకాకుండా 7-అంగుళాల టిఎఫ్‌టి, హోండా కనెక్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ ఎసి వెంట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేషన్ తో లెదర్ సీట్, రిమోట్ బూట్ ఓపెనింగ్, హిల్ డీసెంట్ కంట్రోల్, హోండా సెన్సింగ్ టెక్నాలజీ, యాక్టివ్ కార్నరింగ్ లైట్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.
కొత్త హోండా హెచ్‌ఆర్-వి 6 మోనోటోన్ పెయింట్ స్కీమ్ తో అందించారు. ఇందులో ప్రీమియం సన్‌లైట్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, ప్రీమియం క్రిస్టల్ రెడ్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, మెటోరైడ్ గ్రే ఉన్నాయి. దీనితో పాటు ఈ ఎస్‌యూవీలో 5 డ్యూయల్ టోన్ షేడ్స్ లభిస్తాయి, వీటిలో సిల్వర్ రూఫ్ విత్ మిడ్ నైట్ బ్లూ, ఖాకీ పెర్ల్ విత్ బ్లాక్ రూఫ్, బ్లాక్ విత్ సిల్వర్ రూఫ్, వైట్ అండ్ బ్లాక్ రూఫ్, గ్రే విత్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి.
అయితే కార్ల తయారీ సంస్థ ఈ ఎస్‌యూవి కార్ ఇండియా లాంచ్ పై ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఈ ఏడాది చివరి నాటికి హోండా హెచ్‌ఆర్-వి ఎస్‌యూవీ భారత్‌కు చేరుకోనున్నట్లు ఒక నివేదిక తెలిపింది.