ఎజి సదుపాయంతో భారతదేశపు మొదటి ఎస్‌యూవీ ఆస్టర్‌ని ఆవిష్కరించిన ఎంజి మోటార్ ఇండియా
హైదరాబాద్ , 15 సెప్టెంబర్ 2021: ఎంజి మోటార్ ఇండియా పర్సనల్ ఎఐ అసిస్టెంట్ అండ్ ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ అటానమస్ (లెవల్ 2) టెక్నాలజీతో భారతదేశపు మొదటి ఎస్‌యూవి ఎంజి ఆస్టర్‌ను ఆవిష్కరించింది. ఆస్టర్ ఎంజి సక్సెస్ ఫుల్ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ జెడ్‌ఎస్ పై ఆధారపడుతుంది.
ఎంజి డిజైన్ ఫిలాసఫీ ఎమోషనల్ డైనమిజం ఆధారంగా ఆస్టర్ కాంటెంపరరీ స్టయిల్ వినియోగదారులతో కనెక్ట్ అవుతుంది. దీనికి ఒక ప్రోమినెంట్ బోల్డ్ సెలెస్టియల్ గ్రిల్ ఉంది, అది రోడ్‌పై దృఢమైన ముద్ర వేస్తుంది. ఈ ఎస్‌యూవి చీటా క్లాసిక్ జంప్ షోల్డర్ లైన్‌తో ఒక సొగసైన అలాగే యాక్షన్ కోసం సిద్ధంగా పోజ్ చేస్తున్నట్లు ఉంటుంది. ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లలోని ఆస్టర్ 9 క్రిస్టల్ డైమండ్ ఎలిమెంట్స్ ప్రిసైజ్ డీటైల్స్ హాక్-ఐ ఎక్స్‌ప్రెషన్‌ని చేస్తుంది.
ఈ కారు ఇంటీరియర్ సాఫ్ట్ టచ్ అండ్ ప్రీమియం మెటీరియల్‌తో చక్కగా రూపొందించారు. ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్‌లలో వస్తుంది-ఒకటి బ్రిట్ డైనమిక్ 220 టర్బో పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఎటి 220ఎన్ఎమ్ టార్క్, 140పిఎస్ శక్తిని అందిస్తుంది. మరొకటి-మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఈ కారు 8-స్పీడ్ సివిటి తో కూడిన విటిఐ టెక్ పెట్రోల్ ఇంజన్, ఈ ఇంజన్ 144ఎన్ ఎమ్ టార్క్, 110పిఎస్ శక్తిని అందిస్తుంది.
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మిడ్-సైజ్ ఎంజి ఆస్టర్ ని ఎంజి షోరూమ్‌లలో సెప్టెంబర్ 19 నుండి ప్రదర్శించనున్నారు, బుకింగ్‌లు కూడా త్వరలో ప్రారంభమవుతాయి
ఆస్టర్ లుక్కింగ్ గురించి యుకెలోని లండన్‌లో ఎంజి గ్లోబల్ డిజైన్ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్ డిజైన్ డైరెక్టర్ కార్ల్ గోథమ్ మాట్లాడుతూ, “ఎమోషనల్ డైనమిజం కన్సెప్ట్ ఆస్టర్‌కు ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ రిమార్కబుల్ ఫీచర్లతో చూడటానికి ఆనందం కలిగిస్తుంది. మేము టెక్నాలజిని అందంగా కనిపించేలా కారును రూపొందించడానికి మధ్యలో డిజైన్ ఉంచాము. ఇది అత్యాధునిక టెక్నాలజి, డిజైన్ ఎక్సలెన్స్‌తో ఎంజి బ్రాండ్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతుంది. ఎంజి ఆస్టర్ లోపల పర్శనల్ ఎఐ సహాయంతో అతుకులు లేని డ్రైవింగ్ అనుభవాన్ని పొందడానికి భారతదేశం చూస్తుంది.
ఆస్టర్ ఆవిష్కరణ సమయంలో ఎంజి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ ఎండి రాజీవ్ చాబా మాట్లాడుతూ, “మేము భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌లోకి మా ఎస్‌యూవీలతో కొన్ని పరిశ్రమలను పరిచయం చేశాము. ఈసారి మేము పర్సనల్ ఎఐ ఆసిస్టంట్ తో ఆటోనోమస్ (లెవెల్ 2) ఎంజి ఆస్టర్ కలిగి ఉన్నాము. ఎలిగాంట్ ఎక్స్‌టీరియర్లు, విలాసవంతమైన ఇంటీరియర్‌లు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ఆస్టర్ కస్టమర్‌లను ఆకట్టుకునే ఒక కావాల్సిన ప్యాకేజీ అని మేము నమ్ముతున్నాము,” అని అన్నారు.
ఎంజి ఆస్టర్ పర్సనల్ ఎఐ అసిస్టెంట్ మనిషి లాంటి భావోద్వేగాలు, స్వరాన్ని రిప్రసెంట్ చేస్తుంది. పారాలింపిక్ అథ్లెట్ దీపా మాలిక్ పర్సనల్ ఎఐ అసిస్టెంట్‌కి తన స్వరాన్ని అందించారు. ఆస్టర్‌లోని ఎఐ టెక్నాలజి ఎంజి విజన్ కార్-అజ్-ఏ -ప్లాట్‌ఫారమ్ (సిఎఎపి) అభివృద్ధి చేసింది, ఇది వినియోగదారులకు వారి అవసరాలకు అనుగుణంగా సేవలను వ్యక్తిగతీకరించడానికి వీలు కల్పిస్తుంది.
ఆస్టర్‌లో ఎడిఎఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్) ఎంజి బోష్ (bosch)తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఎఐ టెక్నాలజీ, ఆరు రాడార్లు, ఐదు కెమెరాల ఎక్విప్మెంట్ 14 అడ్వాన్స్డ్ అటానమస్ లెవల్ 2 ఫీచర్లను ఎస్‌యూవి మానేజ్ చేస్తాయి. ఇఎస్‌పి, టిసిఎస్, హెచ్‌డిసి వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కంఫర్ట్, సౌలభ్యం, భద్రతా ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగులు, 6-వే పవర్- అడ్జస్ట్ డ్రైవర్ సీట్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హీటెడ్ ఓఆర్ విఎం, రెయిన్-సెన్సింగ్ వైపర్, పిఎం 2.5 ఫిల్టర్, పనోరమిక్ స్కై రూఫ్, బ్యాక్ ఎసి వెంట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్‌రెస్ట్, మూవీ ఎక్స్పీరియన్స్ కోసం 10.1-అంగుళాల హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల ఎంబెడెడ్ ఎల్ సిడి స్క్రీన్‌తో పూర్తి డిజిటల్ క్లస్టర్ ఇచ్చారు.
ఎంజి ఐ-స్మార్ట్ టెక్నాలజీతో ఆస్టర్ లో 80 పైగా ఇంటర్నెట్ ఫీచర్లు ఉన్నాయి. సిఎఎపి (కారు ప్లాట్‌ఫారమ్‌గా) పై నిర్మించడం ఎంజి ఆస్టర్ మ్యాప్‌మైఇండియా, జియో కనెక్టివిటీ, కోయిన్‌ఆర్థ్ ద్వారా మొట్టమొదటి బ్లాక్‌చెయిన్-ప్రొటెక్టెడ్ వెహికిల్ డిజిటల్ పాస్‌పోర్ట్‌తో మ్యాప్‌లు, నావిగేషన్‌తో సహా సబ్ స్క్రిప్షన్ అండ్ సేవలను నిర్వహిస్తుంది. ఎంజి కార్ యజమానులు జియోసావన్ యాప్‌లో మ్యూజిక్ అక్సెస్ పొందుతారు, అలాగే హెడ్ యూనిట్ ద్వారా పార్కింగ్ స్లాట్‌ను రిజర్వ్ చేసే మొదటి ఫీచర్‌తో పాటు వికీపీడియాతో ఆన్ లిమిటెడ్ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.