MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Automobile
  • Car Offers : మీ చేతిలో చిల్లిగవ్వ లేకున్నా సరే... రూ.12 లక్షల కారు ఇంటికి పట్టుకెళ్ళండి

Car Offers : మీ చేతిలో చిల్లిగవ్వ లేకున్నా సరే... రూ.12 లక్షల కారు ఇంటికి పట్టుకెళ్ళండి

ఎంజీ హెక్టర్ తన 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది… ఈ సందర్భంగా ఆగస్టు నెలలో కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో రూ.60,000 వరకు ప్రయోజనాలతో పాటు 100% ఆన్-రోడ్ ఫైనాన్స్ సౌకర్యం ఉన్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 13 2026, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎంజి హెక్టర్ కారుపై సూపర్ ఆఫర్
Image Credit : MG website

ఎంజి హెక్టర్ కారుపై సూపర్ ఆఫర్

MG Hector Offer : ఇండియాలో పాపులర్ అయిన ఎస్‌యూవీలలో ఎంజీ హెక్టర్ ఒకటి. ఇది భారత మార్కెట్లోకి వచ్చి 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ ఆగస్టు నెలలో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. హెక్టర్ కారు కొనే కస్టమర్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇందులో పాత కారు ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఇప్పటికే ఎంజీ కారు వాడుతున్న వారికి లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి గరిష్ఠంగా రూ.60,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే ఈ ఆఫర్ మొత్తం అనేది మీరు ఎంచుకునే వేరియంట్, కస్టమర్ అర్హత, డీలర్‌షిప్ నిబంధనలను బట్టి మారొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూపాయి కట్టాల్సిన అవపరం లేదు... 100 శాతం లోన్
Image Credit : mgmotor.co.in

రూపాయి కట్టాల్సిన అవపరం లేదు... 100 శాతం లోన్

హెక్టర్ కొనాలనుకునే వారి కోసం కంపెనీ లోన్ విషయంలోనూ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కారు ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ లోన్‌ను గరిష్ఠంగా 84 నెలలు, అంటే 7 ఏళ్ల వరకు తిరిగి చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. కారుతో పాటు కొనే యాక్సెసరీస్‌కు కూడా పూర్తి ఫైనాన్స్ లభించవచ్చని కంపెనీ అంటోంది. అయితే 100 శాతం లోన్ అందరికీ ఆటోమేటిక్‌గా వస్తుందని కాదు. కస్టమర్ ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం, ఫైనాన్స్ సంస్థ నిబంధనల ఆధారంగానే ఫైనల్ అప్రూవల్ ఉంటుంది.

Related Articles

Related image1
MG hector facelift: మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ల‌గ్జ‌రీ కారు.. అందుబాటు ధ‌ర‌లో MG హెక్ట‌ర్ కొత్త కారు
Related image2
MG Comet EV : షాకిచ్చిన దేశంలోని అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు !
35
ఎంజి హెక్టర్ లో సూపర్ ఫీచర్లు
Image Credit : cardekho

ఎంజి హెక్టర్ లో సూపర్ ఫీచర్లు

ఎంజీ హెక్టర్ మొదటిసారిగా 2019లో ఇండియాలో లాంచ్ అయింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చిన 'కనెక్టెడ్ ఎస్‌యూవీ'గా ఇది మార్కెట్లో అడుగుపెట్టింది. అప్పట్లోనే ఎన్నో టెక్నాలజీ ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా కొత్త హెక్టర్‌లో లుక్, టెక్నాలజీ పరంగా చాలా మార్పులు చేశారు. ముందువైపు కొత్త డిజైన్‌తో ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. సెలడాన్ బ్లూ, పెర్ల్ వైట్ వంటి కొత్త కలర్ ఆప్షన్స్ కూడా ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి.

45
ఎంజి హెక్టర్ లో ఇంటీరియర్
Image Credit : cardekho

ఎంజి హెక్టర్ లో ఇంటీరియర్

హెక్టర్ కారు లోపల కూడా చాలా ఫీచర్లు ఉన్నాయి. లెదర్ లాంటి ఫినిషింగ్‌తో డాష్‌బోర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఆరు విధాలుగా ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకునే డ్రైవర్ సీటు వంటివి ఉన్నాయి. ఇక టెక్నాలజీ విషయానికొస్తే 14 అంగుళాల భారీ HD వర్టికల్ టచ్‌స్క్రీన్ దీనికి ప్రధాన ఆకర్షణ. దీని ద్వారా ఏసీ, మ్యూజిక్, నావిగేషన్ వంటి వాటిని సులభంగా కంట్రోల్ చేయొచ్చు. డిజిటల్ కీ, రిమోట్‌గా ఏసీ ఆన్ చేయడం, వెహికల్ నోటిఫికేషన్స్ వంటి కనెక్టెడ్ ఫీచర్లు కూడా ఇచ్చారు.

55
ఎంజి హెక్టర్ ధర ఎంతో తెలుసా?
Image Credit : X

ఎంజి హెక్టర్ ధర ఎంతో తెలుసా?

సేఫ్టీ, కనెక్టివిటీ ఫీచర్లపైనా హెక్టర్ బాగా ఫోకస్ చేసింది. డ్రైవర్ కోసం 17.78 సెం.మీ సైజులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అంతేకాదు 70కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. కొత్త ఎంజీ హెక్టర్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా ఉంది. దీనికి తోడు రూ.60,000 వరకు లభించే ఆఫర్లు, 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్స్ అవకాశం కూడా ఉండటంతో, కొత్త ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేసేవారికి ఇది మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఏదేమైనా బుక్ చేసే ముందు మీ దగ్గర్లోని ఎంజీ డీలర్‌షిప్‌కు వెళ్లి క్యాష్ ఆఫర్లు, పాత కారు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, లోన్ నిబంధనలు, ఫైనల్ ఆన్-రోడ్ ధర వంటి పూర్తి వివరాలతో కూడిన కొటేషన్ తీసుకోవడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ola Scooter Offers : కేవలం రూ.59,999 కే ఓలా స్కూటర్, నెలనెలా అతి తక్కువ EMI.. ఈ ఆఫర్ మిస్ అవ్వొద్దు
Recommended image2
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image3
BMW Full Form : లగ్జరీ కార్ల కంపెనీ బిఎండబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
MG hector facelift: మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ల‌గ్జ‌రీ కారు.. అందుబాటు ధ‌ర‌లో MG హెక్ట‌ర్ కొత్త కారు
Recommended image2
MG Comet EV : షాకిచ్చిన దేశంలోని అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved