స్టయిలిష్, కూల్ ఫీచర్స్ తో మారుతిసుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్.. దీనిపై ఓ లుక్కెయండి..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కంపెనీ సేల్స్ చార్ట్‌లలో అలాగే మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయ చార్టులలో చాలా సంవత్సరాలుగా భారతీయ ఆటో పరిశ్రమలో మంచి పనితీరును కనబరుస్తోంది. అయితే మీడియా నివేదికల ప్రకారం మారుతి టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ కార్ వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
మారుతి దీనిని కొన్ని ఎక్ష్తెరియర్ అండ్ క్యాబిన్ హైలెట్ తో అందిస్తుంది. దీనితో పాటు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ఆప్షన్స్ కూడా ఉంటాయి. వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ అప్‌డేట్స్ మార్కెట్‌లో దీని ప్రజాదరణను మరింత పెంచవచ్చు. కరోనా కాలంలో ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత మొబిలిటీపైనే ఆసక్తి చూపుతున్నారు.
ఎక్స్‌ట్రా ఎడిషన్ అనేది లిమిటెడ్-రన్ ఎడిషన్ అంటే స్టాండర్డ్ వి వేరియంట్ కంటే 13 అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. వీటిలో ఎక్ష్తెరియర్, ఇంటర్నల్, ఫీచర్స్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. మొత్తం అసెసోరి కిట్ ధర రూ. 22,990.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్‌లో మీరు చాలా మార్పులు చూడవచ్చు. ఎక్ష్తెరియర్ లుక్కింగ్ కోసం ఫాగ్ ల్యాంప్ గార్నిష్, క్రోమ్‌లో అప్పర్ గ్రిల్ గార్నిష్, బ్యాక్ డోర్ గార్నిష్ అలాగే నంబర్ ప్లేట్ గార్నిష్ అప్‌డేట్‌లను పొందుతాయి. కారు ముందు, వెనుక బంపర్ ప్రొటెక్టర్లు, సైడ్ స్కర్ట్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బాడీ సైడ్ మౌల్డింగ్‌లను బ్లాక్ కలర్‌లో లభిస్తాయి.
నివేదిక ప్రకారం యువ కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ లో క్యాబిన్ ఇంటీరియర్ స్టైలింగ్ కిట్‌ను పొందుతుంది. రైడర్ల సౌకర్యార్థం మారుతి కొత్త వ్యాగన్ఆర్‌లో డిజిటల్ ఎయిర్ ఇన్‌ఫ్లేటర్, ట్రంక్ ఆర్గనైజర్, కార్ ఛార్జర్ ఎక్స్‌టెండర్‌ను కూడా అందిస్తోంది.
వ్యాగన్ఆర్ రెండు దశాబ్దాలకు పైగా భారతీయ కార్ మార్కెట్లో కొనసాగుతుంది. దాదాపు 2.5 మిలియన్ యూనిట్ల వాహనాలను విక్రయించారు. రిలయబుల్ డ్రైవ్ పనితీరుతో పాటు దాని స్టైలింగ్, క్యాబిన్, ఇంజిన్, భద్రతాలో తరచుగా అప్‌డేట్‌ల కారణంగా నిరంతరం సకెస్స్ మోడల్ గా నిలుస్తుంది.
త్యేకమైన విషయం ఏమిటంటే మారుతి వాహనాల రీసేల్ విలువ కూడా చాలా బాగుంది. వ్యాగన్ఆర్ సిఎన్‌జి వేరియంట్ కూడా మంచి ఆదరణ పొందడం ప్రారంభించింది. దేశంలో ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.