- Home
- Automobile
- Maruti EV: టాటాకు మారుతి టెన్షన్... మార్కెట్లోకి సుజికి బుజ్జి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే మైలేజ్ మీ ఇష్టం
Maruti EV: టాటాకు మారుతి టెన్షన్... మార్కెట్లోకి సుజికి బుజ్జి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే మైలేజ్ మీ ఇష్టం
Maruti EV: మారుతి సుజుకి కొత్త 'విజన్ ఇ-స్కై' ఎలక్ట్రిక్ కారు తీసుకురానుంది. టాటా టియాగో EVకి పోటీగా రానున్న ఈ బడ్జెట్ EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 270 కి.మీ. మైలేజ్ ఇస్తుందని అంచనా. ముందు గ్లోబల్ మార్కెట్లో విడుదల చేశాక బారత్‍లో లాంచ్ చేయనున్నారు.

మారుతి సుజుకి బుజ్జి ఎలక్ట్రిక్ కార్
మారుతి సుజుకి కొత్త 'విజన్ ఇ-స్కై' ఎలక్ట్రిక్ కారు తీసుకురానుంది. టాటా టియాగో EVకి పోటీగా రానున్న ఈ బడ్జెట్ EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 270 కి.మీ. మైలేజ్ ఇస్తుందని అంచనా. ముందు గ్లోబల్ మార్కెట్లో విడుదల చేశాక బారత్‍లో లాంచ్ చేయనున్నారు. భారత మార్కెట్లో మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'ఇ-విటారా' (e-Vitara) మిడ్‌సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. కానీ, దీని అమ్మకాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ ఎస్‌యూవీ ధర మధ్యతరగతి కస్టమర్ల బడ్జెట్‌కు కొంచెం ఎక్కువ. అందుకే సుజుకి కంపెనీ ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలో, ఎంట్రీ లెవల్ చిన్న ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి రెడీ అవుతోంది.
టియాగో EVకి పోటీగా 'విజన్ ఇ-స్కై'
మారుతి ఎస్-ప్రెస్సో కన్నా చిన్న సైజు
ఏకంగా 270 కి.మీ. మైలేజ్ రేంజ్!
ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు సైజులో చిన్నదే అయినా మైలేజ్ విషయంలో మాత్రం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 270 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుందని రిపోర్టులు చెబుతున్నాయి. కంపెనీ మొదట ఈ కారును యూరప్ మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. అక్కడ ఇది హోండా సూపర్-ఎన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.
గ్లోబల్ మార్కెట్లో లాంచ్ ఎప్పుడంటే?
సుజుకి కంపెనీ ఈ కారును గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సుజుకి బ్రాండ్ ఈ కారును ఇదే ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.
భారత్‌కు కూడా ఈ చవకైన EV వస్తుందా?
ప్రస్తుతానికి సుజుకి ఈ కారును గ్లోబల్ మార్కెట్ కోసమే డిజైన్ చేస్తోంది. కానీ, భారతదేశంలో బడ్జెట్ ధరలో ఉండే EV కార్లకు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మారుతి సుజుకి ఈ కారు ఇండియన్ వెర్షన్‌ను ఇక్కడ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, దీనిపై మారుతి సుజుకి నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కస్టమర్లు ప్రస్తుతానికి వేచి చూడక తప్పదు.

