మారుతి సుజుకి సరికొత్త మోడల్.. దీని మైలేజ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే..
దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి (maruti suzuki) సోమవారం కొత్తగా అప్‌డేట్ చేసిన సెలెరియో(celerio) సిఎన్‌జి వెర్షన్‌ను విడుదల చేసింది. అయితే దీనిని మొదట గత సంవత్సరం నవంబర్‌లో లాంచ్ చేశారు.
ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్ కారుగా మారుతి సెలెరియో పేరు పొందింది. ఇంకా సిఎన్‌జి మోడల్ ని ఇప్పుడు సులభంగా అందుబాటులో తీసుకోస్తు వాహనదారులని ఆకర్షించాలని చూస్తోంది.
సిఎన్‌జి మోడల్స్ అమ్మకాలు
గత ఐదేళ్లలో సిఎన్‌జి వాహనాల అమ్మకాల్లో 22 శాతం CAGR వృద్ధిని నమోదు చేసినట్లు మారుతీ పేర్కొంది. మారుతీ సుజుకి దేశంలో ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జి కార్లను అందించడంలో ముందంజలో ఉంది. మారుతీ సుజుకీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “మా వద్ద ఎనిమిది గ్రీన్ మోడల్‌లలో అతిపెద్ద పోర్ట్‌ఫోలియో ఉంది ఇంకా దాదాపు 9,50,000 S-CNG వాహనాలను విక్రయించాము. సరికొత్త సెలెరియో S-CNG భారతదేశంలో గ్రీన్ వాహనాలను పెద్ద ఎత్తున స్వీకరించాలనే మా ఆశయానికి ఒక అడుగు ముందుకు తీసుకువెళుతుంది." అని సంస్థ తెలిపింది
ఇంజిన్ అండ్ మైలేజ్
ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సిఎన్‌జి వెర్షన్ పెట్రోల్ మోడల్‌లోని డిజైన్ అండ్ ఫీచర్లతో వస్తుంది. కంపెనీ కారులో ఒకే ఒక్క మార్పు చేసింది అదేంటంటే సిఎన్‌జి ట్యాంక్‌ను అమర్చడం. ఈ కారు 1.0-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్ VVT K-సిరీస్ ఇంజన్ తో శక్తిని పొందుతుంది, అలాగే 60-లీటర్ కెపాసిటి గల సిఎన్‌జి ట్యాంక్‌తో వస్తుంది. సెలెరియో సిఎన్‌జి మైలేజ్ 35.60 km/kg అని మారుతి తెలిపింది.
ఇంజన్ పవర్ వివరాలు
సెలెరియో సిఎన్‌జి 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అంటే పెట్రోల్ వెర్షన్ 89 Nm కంటే కాస్త తక్కువ. అలాగే, సిఎన్‌జి మోడల్ 56 hpపవర్ ని ఉత్పత్తి చేస్తుంది అంటే పెట్రోల్ వెర్షన్ 64 hp కంటే కొంచెం తక్కువ. మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్-ఓన్లీ ఆప్షన్‌లో రన్ అయినప్పుడు 26.68 kmpl ఆకట్టుకునే మైలేజీని ఇస్తుంది. అయితే సిఎన్‌జి వేరియంట్ ప్రతి కిలోకి 35.60 కి.మీ. ప్రయాణిస్తుంది.
మరింత స్పేస్
కొత్త మారుతి సుజుకి సెలెరియో మాడ్యులర్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది, అలాగే మారుతీ ఇతర హ్యాచ్‌బ్యాక్‌లు వ్యాగన్ఆర్, స్విఫ్ట్ ఇంకా బాలెనోలో కూడా ఉపయోగిస్తుంది. కొత్త సెలెరియో పాత మోడల్ కంటే పెద్దది ఇంకా 3,695 ఎంఎం పొడవు, 1,655 ఎంఎం వెడల్పు, 1,555 ఎంఎం ఎత్తు, 2,435 ఎంఎం వీల్‌బేస్ పొందుతుంది. ఇంకా అవుట్‌గోయింగ్ మోడల్‌కు సమానమైన పొడవు, ఎత్తు ఉంటుంది, అయితే కొత్త మోడల్ 55 ఎంఎం వెడల్పుగా ఉంటుంది, ఇంకా వీల్‌బేస్ 10 ఎంఎం పొడవుగా ఉంటుంది. కొత్త సెలెరియో గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎం, అంటే పాత మోడల్ కంటే 5 ఎంఎం ఎక్కువ.
లుక్ అండ్ డిజైన్
లుక్ ఇంకా డిజైన్ పరంగా కొత్త సెలెరియో పెట్రోల్ అండ్ సిఎన్‌జి మోడల్ మధ్య ఎటువంటి తేడా లేదు. కొత్త సెలెరియో లుక్ పాత మోడల్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. కారు ముందు భాగంలో ఓవల్‌గా కనిపించే హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన గ్రిల్‌లో క్రోమ్ స్ట్రిప్ ఇచ్చారు. ఫ్రంట్ బంపర్, నలుపు రంగు కాంట్రాస్ట్ ట్రిమ్ అండ్ రౌండ్ ఫాగ్ ల్యాంప్‌లు ఇచ్చారు.
కొత్త సెలెరియోలో బాడీ-కలర్ ఇంకా లిఫ్ట్-టైప్ డోర్ హ్యాండిల్స్ అవుట్‌గోయింగ్ మోడల్‌లో కనిపించే పుల్-టైప్ వాటికి భిన్నంగా ఉంటాయి. ఇంకా పెద్ద గ్లాస్ హౌస్ అండ్ స్లిమ్ రూఫ్‌లైన్‌ను కూడా ఉంది. ముఖ్యంగా, కొత్త సెలెరియో హై ఎండ్ వేరియంట్‌లు 15-అంగుళాల డార్క్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతాయి.
కలర్ ఆప్షన్
మారుతి సెలెరియో 6 మోనోటోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్, గ్లిస్టెనింగ్ గ్రే, సాలిడ్ ఫైర్ రెడ్, స్పీడీ బ్లూ మరియు కెఫిన్ బ్రౌన్ ఉన్నాయి.
ఇంటీరియర్ అండ్ ఫీచర్లు
కొత్తగా అప్‌డేట్ చేసిన సెలెరియోలో ఇప్పుడు పాత మోడల్ కంటే ఎక్కువ స్థలాన్ని పొందుతుంది. ఈ కారులో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంజన్ స్టార్ట్-స్టాప్, పెద్ద ట్యాబ్ లాంటి ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి కొత్త ఫీచర్లు ఇచ్చారు. ఈ కారులో షార్ప్ డ్యాష్ బోర్డ్ లైన్‌లు, క్రోమ్ యాక్సెంట్‌లతో కూడిన ట్విన్-స్లాట్ ఏసి వెంట్‌లు, కొత్త గేర్ షిఫ్ట్ డిజైన్ అండ్ అప్హోల్స్టరీ కోసం కొత్త డిజైన్‌తో సెంటర్-ఫోకస్డ్ విజువల్ అప్పీల్‌ను పొందుతుంది. 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో డిస్‌ప్లే ఆపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటొకి సపోర్ట్ చేస్తుంది. అయితే సీటు అండ్ అప్హోల్స్టరీ మెటీరియల్ ప్రాథమికమైనవి.
సేఫ్టీ ఫీచర్లు
కొత్త మారుతి సుజుకి సెలెరియో సేఫ్టీ ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడి అండ్ బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ వేరియంట్ కోసం స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్ ఇంకా హిల్ హోల్డ్ అసిస్ట్ లభిస్తాయి. మొత్తంమీద కొత్త సెలెరియో 12కి పైగా భద్రతా ఫీచర్లతో వస్తుంది. కొత్త సెలెరియో ఫ్రంటల్ ఆఫ్‌సెట్, సైడ్ క్రాష్ ఇంకా పాదచారుల రక్షణ వంటి అన్ని భారతీయ భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉందని మారుతి సుజుకి పేర్కొంది.
ధర ఇంకా కాంపిటీషన్
మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 6.58 లక్షలుగా ఉంది. భారతీయ మార్కెట్లో సెలెరియో సిఎన్‌జి టాటా మోటార్స్ నుండి త్వరలో విడుదల కానున్న టియాగో సిఎన్‌జి ఇంకా సాంట్రో సిఎన్‌జిలకు పోటీగా ఉంటుంది. మారుతి సుజుకి కొత్త సెలెరియోని భారతదేశంలో విడుదల చేసిన రెండు నెలల్లోనే 25,000 బుకింగ్‌లను పొందినట్లు తెలిపింది.