లేటెస్ట్ టెక్నాలజితో మహీంద్రా ఎక్స్‌యూవీ 300.. ఆటో షిఫ్ట్ తో పాటు 40కి పైగా కొత్త ఫీచర్లు..
వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా సరికొత్త ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యువి 300 ను పెట్రోల్ ఆటో షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీతో భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని టాప్-ఎండ్ వేరియంట్ డబ్ల్యూ 8 (ఓ) లో కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు, ఆల్-న్యూ బ్లూసెన్స్ ప్లస్ కనెక్ట్ క్నాలజీని కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. లేటెస్ట్ పెట్రోల్ ఆటోషిఫ్ట్ మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి మధ్య నుండి డెలివరీలు అందించనుంది.
ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
ఎక్స్‌యువి 300 లోని ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఇప్పుడు ఎక్స్‌యువి మిడ్-వేరియంట్ (డబ్ల్యూ6) అంతకంటే పై మాన్యువల్ అండ్ ఆటోషిఫ్ట్ మోడళ్లలో కూడా అందిస్తుంది. ఇది కాకుండా కొత్త కలర్ స్కీమ్‌తో ఈ కారును విడుదల చేశారు. డబ్ల్యూ 8 (ఓ) ఆటో షిఫ్ట్ వేరియంట్‌లకు టోన్ రెడ్, డ్యూయల్-టోన్ ఆక్వామారిన్ కలర్ ఆప్షన్ ఉండగా ఇంకా డబ్ల్యూ 6, డబ్ల్యూ 8, డబ్ల్యూ 8(O)మాన్యువల్ వేరియంట్‌లలో సరికొత్త గెలాక్సీ గ్రే కలర్ ఆప్షన్ తీసుకొచ్చారు.
40 కంటే ఎక్కువ కనెక్ట్ ఫీచర్లు
ఎక్స్‌యూవీ 300 లో అందించే ఆల్-న్యూ బ్లూసెన్స్ ప్లస్ కనెక్ట్ టెక్నాలజీ 40కి పైగా ఫీచర్లను అందిస్తుంది. రిమోట్ డోర్ లాక్ / అన్‌లాక్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ (జియో ఫెన్సింగ్, ఎమర్జెన్సీ అసిస్ట్ వంటివి), వాహన సమాచార హెచ్చరిక (ఉదా. పెట్రోల్ మైలేజ్, టైర్ ప్రెజర్) వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్‌లకు సపోర్ట్ చేస్తుంది.
కొత్త ఎక్స్‌యూవీ 300 ధర
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ సిఇఒ విజయ్ నక్రా మాట్లాడుతూ, "భారతదేశంలోని యువ కస్టమర్లు రాజీ పడటానికి ఇష్టపడరు. వారు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సౌలభ్యం, మంచి అనుభవాన్ని కోరుతున్నారు. ఇందుకు మేము మా కొత్త పెట్రోల్-శక్తితో కూడిన ఆటో ట్రాన్స్మిషన్ ఆటోషిఫ్ట్ ను విడుదల చేస్తున్నాము. సిటీ డ్రైవ్‌లతో పాటు హైవేలపై సున్నితమైన డ్రైవ్‌ను అందించే అధునాతన టెక్నాలజి ఇందులో ఉంది. కనెక్ట్ చేసిన ఎస్‌యూవీ టెక్నాలజీ బ్లూసెన్స్ ప్లస్‌ను 40కి పైగా ఫీచర్లతో అందిస్తున్నాము. ఆటో షిఫ్ట్‌తో కూడిన కొత్త ఎక్స్‌యూవీ 300 ఎక్స్‌షోరూమ్ ధర రూ .9.95 లక్షలతో ప్రారంభమవుతుంది.