మహీంద్రా కొత్త థార్ ఎస్‌యూవీలో ఇంజన్ లోపాలు.. 1577 యూనిట్లకు రీకాల్ జారీ..
దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) గురువారం కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ 1,577 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త థార్ ఎస్‌యూవీ ఇంజన్‌లోని కొన్ని లోపాల భాగాలను భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2020 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 25 మధ్య ఉత్పత్తి అయిన 1,577 యూనిట్ల డీజల్ వేరియంట్లకు ఈ రీకాల్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
ఒక చిన్న లోపం కారణంగా థార్ డీజిల్ ఇంజన్ల నాణ్యతను ప్రభావితం చేస్తుందని ఎం అండ్ ఎం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కఠినమైన నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ తనిఖీలు చేస్తుందని కంపెనీ తెలిపింది. థార్ రీకాల్ చేసిన అన్ని యూనిట్లకు ఉచితంగా రీప్లేస్మెంట్ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. మహీంద్ర సంస్థ అధీకృత డీలర్‌షిప్ వద్ద కారును తనిఖీ చేసి లోపాలు ఉంటే దాన్ని పరిష్కరిస్తారు. ప్రభావితమైన్ థార్ కస్టమర్లను సంస్థ వ్యక్తిగతంగా సంప్రదిస్తుందని ఎం అండ్ ఎం తెలిపింది.
మహీంద్రా థార్ ఇంజన్
కొత్త థార్ ఎస్‌యూవీని 2 వేరియంట్స్ ఒకటి ఎఎక్స్, మరొకటి ఎల్‌ఎక్స్‌తో లాంచ్ చేశారు. కస్టమర్లను ఆకర్షించడానికి పవర్ట్రెయిన్ గేర్ బాక్స్ ఆప్షన్స్ కూడా అందించారు. మహీంద్రా థార్‌లో తొలిసారిగా పెట్రోల్ ఇంజన్ ప్రవేశపెట్టారు. దీనిలో 2.0 లీటర్ ఇంజన్ అందించగ, ఇది 152 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 132 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్-రోడింగ్ డ్రైవ్ అవసరాలకు అనుగుణంగా మహీంద్రా 4 × 4 డ్రైవ్‌ట్రెయిన్ అందిస్తోంది.
ఫీచర్స్
కొత్త మహీంద్రా థార్ నాణ్యత, డిజైన్ పాత మోడల్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ అర్బన్ ఎస్‌యూవీలో మీకు కావలసిన ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. దీనిలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే , నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్‌తో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఇతర లేటెస్ట్ ఫీచర్స్ అందించారు.
మహీంద్రా థార్ ధర
మహీంద్రా థార్ ఎస్‌యూవీని రూ .9.80 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించారు.
यूटिलिटी वाहन कंपनी महिंद्रा ने 4 फरवरी को घोषणा करते हुए कहा कि कंपनी थार के डीजल वेरिएंट के 15,77 मॉडल को वापस बुला रही है। इन गाड़ियों को इंजन में समस्या की शिकायत के बाद रिकॉल किया गया है।