క్రాష్ టెస్టులో ఫెయిల్.. మారుతి సుజుకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కి జీరో సేఫ్టీ రేటింగ్..!
న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాంలో మారుతి స్విఫ్ట్ ఘోరంగా విఫలమైంది. లాటిన్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్ట్, దక్షిణ అమెరికా అనుబంధ సంస్థ గ్లోబల్ ఎన్‌సిఎపి రెండు ఈ కార్లు సేఫ్టీలో జీరో-స్టార్ రేటింగ్‌లను పొందాయి. ఈ కార్లు లాటిన్ అమెరికాలో అమ్ముడవుతున్నయి.
లాటిన్ అమెరికా, కరేబియన్ కోసం స్విఫ్ట్, డస్టర్ రెండూ కార్లకు న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ కింద క్రాష్ టెస్ట్ నిర్వహించాయి. ఇక్కడ హైలైట్ ఏమిటంటే, లాటిన్ ఎన్‌సిఏపి ద్వారా క్రాష్-టెస్ట్ చేసిన కారుని జపనీస్ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ భారతదేశంలోని గుజరాత్ తయారీ కర్మాగారంలో తయారు చేసారు.
మేడ్-ఇన్-ఇండియా సుజుకి స్విఫ్ట్ జపాన్‌లో కూడా తయారు చేస్తున్నారు, దీనికి రెండు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ గా పొందుతుంది. ఈ కారు అడల్ట్ ప్రొటెక్షన్ కోసం 15.53 శాతం రేటింగ్ పొందింది, అయితే పిల్లల సేఫ్టీ కోసం 0 శాతం రేటింగ్ లభించింది. పాదచారుల భద్రతలో కారు ఆశ్చర్యకరంగా 66 శాతం స్కోర్ చేసింది. సెక్యూరిటీ సపోర్ట్ సిస్టమ్స్ విషయంలో రేటింగ్ 7 శాతం మాత్రమే.
లాటిన్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కోసం మాత్రమే కాకుండా సెడాన్ వెర్షన్‌కు కూడా వాలిడిటీ అవుతుందని, అంటే దీనిని జీరో సేఫ్టీ రేటింగ్‌గా కూడా పరిగణించాలని అన్నారు. స్విఫ్ట్ కోసం చేసిన క్రాష్ టెస్ట్ ఫలితాలు నిరాశపరిచాయని ఇందుకు బ్యాక్ సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, టెస్ట్ సమయంలో ఓపెన్ డోర్ అండ్ రియర్ ఇంపాక్ట్ టెస్ట్ కోసం యూఎన్32 లేకపోవడం వల్ల తక్కువ విప్లాష్ స్కోర్ కారణం అని ఏజెన్సీ పేర్కొంది. ఏజెన్సీ ప్రకారం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో స్టాండర్డ్ సైడ్ హెడ్ ప్రొటెక్షన్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్టాండర్డ్ ఈఎస్‌సి ఉండవు.
సేఫ్టీ క్రాష్ టెస్ట్ కోసం ఉపయోగించిన రెనాల్ట్ డస్టర్ మోడల్ రెండు ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌సిని స్టాండర్డ్ గా పొందుతుంది. అడల్ట్ ఆక్యుపెంట్ లో 29.47 శాతం, పిల్లల ఆక్యుపెంట్ లో 22.93 శాతం, పాదచారుల భద్రతలో 50.79 శాతం, సేఫ్టీ అసిస్ట్ లో 34.88 శాతం స్కోర్ సాధించింది.
లాటిన్ ఎన్‌సిఎపి సెక్రటరీ జనరల్ అలెజాండ్రో ఫ్యూర్స్ మాట్లాడుతూ, "రెనాల్ట్, సుజుకీ కస్టమర్లపై భద్రతా పనితీరు చాలా నిరాశపరిచింది. ఈ మోడళ్ల స్టాండర్డ్ భద్రతను త్వరగా మెరుగుపరచడానికి లాటిన్ ఎన్‌సిఎపి రెనాల్ట్, సుజుకీలను ప్రోత్సహిస్తుంది." అని అన్నారు.
2018 సంవత్సరంలో భారతదేశంలో కొత్త జనరేషన్ స్విఫ్ట్ మోడల్ ప్రారంభించినప్పుడు కొన్ని నెలల తర్వాత సేఫ్టీ క్రాష్ టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్ లో గ్లోబల్ ఎన్‌సిఏపి స్విఫ్ట్ కు 2-స్టార్ రేటింగ్ ఇచ్చింది. దేశంలో విక్రయించే స్విఫ్ట్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్ గా లభిస్తాయి. అయితే ఐరోపాలో విక్రయించే మోడల్ లో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ని స్టాండర్డ్ గా పొందుతుంది. సుజుకి లాటిన్ అమెరికాలో సైడ్ బాడీ, హెడ్ ఎయిర్‌బ్యాగ్‌లు లేదా ఇఎస్‌సిని స్టాండర్డ్‌గా అందించదు.