Best Mileage Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లు ఇవే.. ఓ లుక్కేయండి..!
పెట్రో ధరలు ఆకాశాన్నంటుతుండడంతో, బాగా మైలేజ్ ఇచ్చే బైక్‌ను సొంతం చేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మనదేశంలో తక్కువ ధర కలిగిన అనేక బైక్‌లు ఉన్నాయి. వీటివల్ల మన జేబుపై ఎక్కువ భారం ఉండదు. ఇలాంటి బైక్‌లలో బజాజ్ CT 100, TVS స్పోర్ట్, హీరో HF డీలక్స్, బజాజ్ ప్లాటినా 100 పాపులర్. ఈ బైక్‌లు ఎంత మైలేజీ ఇస్తాయో, ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బజాజ్ CT 100
CT 100 అనేది ఎలక్ట్రిక్ స్టార్ట్‌తో విక్రయించబడుతున్న చౌకైన బైక్. ముంబైలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 51,800, ఇది టాప్ మోడల్‌కు రూ. 60941 వరకు పెరుగుతుంది. ఈ బైక్‌ను రూ.50,000 లోపు అత్యుత్తమ బడ్జెట్ బైక్‌లలో చేర్చారు. ఇది 102 సిసి ఇంజన్ కలిగి ఉంది. ఒక లీటర్ పెట్రోల్‌లో ఈ బైక్‌ను 70 కి.మీ వరకు నడపవచ్చు. బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్ 10.5 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది.
బజాజ్ ప్లాటినా 100
బజాజ్ ప్లాటినా 100 కూడా అత్యంత సరసమైన బైక్‌లలో ఒకటి, ఇది మొదట 2005లో ప్రారంభించబడింది. కంపెనీ ఇప్పటివరకు ఈ బైక్‌ను 5 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ బైక్ కిక్-స్టార్ట్‌తో పాటు ఎలక్ట్రిక్-స్టార్ట్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 52,861, ఇది టాప్ మోడల్‌కి రూ. 63,541 వరకు పెరుగుతుంది. బైక్‌కి 102 సిసి ఇంజన్ ఇవ్వబడింది. 1 లీటర్ పెట్రోల్‌లో బైక్‌ను 90 కిమీ వరకు నడపవచ్చు.
హీరో HF డీలక్స్
ఈ బైక్ ఇండియన్ మార్కెట్‌లో కూడా బాగా నచ్చింది. ఇది 5 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ 8.36 PS పవర్..8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 97.2 cc ఇంజన్‌తో జత చేయబడింది. ఈ బైక్‌ను 1 లీటర్ పెట్రోల్‌లో 82.9 కి.మీ వరకు నడపవచ్చు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర ముంబైలో రూ.52,040 నుండి మొదలై రూ.62,903 వరకు ఉంది. దీనితో, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్..హెడ్‌లైట్ ఆన్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
TVS స్పోర్ట్
TVS స్పోర్ట్ ఒక స్టైలిష్ బైక్, దీనితో కొన్ని మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 7.8 PS పవర్..7.5 NM గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేసే 99.7 CC ఇంజన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. బైక్ యొక్క ముందు భాగం టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో.. వెనుక భాగం ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది. ఈ బైక్‌ను 1 లీటర్ పెట్రోల్‌లో 73 కి.మీ వరకు నడపవచ్చు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 58,900 నుంచి మొదలై రూ. 63,176 వరకు ఉంది. బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్ 10 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది.