కియా నుండి వస్తున్న మొట్టమొదటి ఫిలాసఫీ డిజైన్ ఎలక్ట్రిక్ కారు.. దీనిలోని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోండి..
ఆటోమోబైల్ సంస్థ కియా కార్పొరేషన్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనమైన కియా ఇవి6 ఎలక్ట్రిక్ కార్ ఇంటీరియర్, ఔటర్ డిజైన్ ఫోటోలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారును కంపెనీ మార్చిలో అధికారికంగా ప్రదర్శించనుంది. ఇవి6 బ్రాండ్ న్యూ డిజైన్ ఫిలాసఫీ 'అపోజిట్స్ యునైటెడ్' కింద రూపొందించారు, ఇది ప్రకృతి, హ్యూమనిటీలో కనిపించే వైరుధ్యాల నుండి ప్రేరణ పొందింది. ఈ కారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
కియా ఇవి6 సంస్థ నుండి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. దీనిని కంపెనీ కొత్త ఈవి ప్లాట్‌ఫాం (ఈ-జిఎంపి లేదా ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫాం) పై నిర్మించారు. అంతే కాదు కియా ఇవి6 కంపెనీ కొత్త డిజైన్ ఫీలసఫీకి మొదటి ఉదాహరణ, ఇది సంస్థ నుండి రాబోయే కార్లలో కనిపిస్తుంది.
కార్ల తయారీ సంస్థ కొత్త లోగో కియా ఇవి6 ముందు భాగంలో కనిపిస్తుంది. దీని పైభాగంలో సన్నని గ్రిల్‌తో పెద్ద హెడ్‌లైట్ క్లస్టర్ ఉంటుంది. సీక్వెన్షియల్ యానిమేషన్‌తో డిఆర్‌ఎల్ కూడా ఉంది. కియా డిజిటల్ టైగర్ ఫేస్ అని పిలువబడే ఈ కారు కొత్త ఫ్రంట్ ఎలిమెంట్ మొత్తం ఫ్రంట్ లుక్‌లో కనిపిస్తుంది. అయితే, కియా ఇవి6 ఫ్రంట్ లుక్ సంస్థ యొక్క సాధారణ కార్ల నుండి చాలా భిన్నంగా ఉంటుంది.
కారు సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే డోర్స్ దిగువ భాగంలో క్యారెక్టర్ లైన్ టైల్ లైట్స్ కి వెళుతుంది. ఇది వెనుక గ్లాస్ ఇంకా స్పాయిలర్‌ను జాగ్వార్ ఐ-పేస్ లాగా వేరు చేస్తుంది. ఇవి6 కింద ఉన్న డార్క్ రిమ్ అండ్ వీల్ కారుకు స్పోర్టి లుక్ ఇస్తాయి.
ఇవి6 ఇంటీరియర్ గురించి చెప్పాలంటే కియా ఈ విభాగంలో ఉన్న అన్నీ కార్ల కన్నఎక్కువ స్థలాన్ని ఇస్తున్నట్లు హామీ ఇచ్చింది. ఇంకా హ్యుందాయ్ ఫ్లాట్ డాష్‌బోర్డ్ డిజైన్‌తో డ్రైవర్ సీటు చుట్టూ కాక్‌పిట్ ఉంటుంది. పెద్ద డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కర్వ్ బ్లాక్ డాష్‌బోర్డ్‌లో అందించారు. దీనికి రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. ముందు సీట్ల మధ్య సెంటర్ కన్సోల్, స్టార్ట్ బటన్, రొటేట్ గేర్ లివర్‌తో వస్తుంది. దీనితో పాటు విశాలమైన ఇంటర్నల్ కంపార్ట్మెంట్ కూడా ఉంది.
ఈ కారు పవర్‌ట్రెయిన్, బ్యాటరీ ప్యాక్, మైలేజ్ సంబంధించిన సమాచారాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం కియా ఇవి6 ఫీచర్స్ హ్యుందాయ్ అయోనిక్ 5 లాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో సింగిల్ అండ్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటారును ఇవి6లో చూడవచ్చు.
ఈ మోటారు 300 హెచ్‌పి శక్తిని, 600 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే ఒక సింగిల్ ఫుల్ ఛార్జితో ఈ కారు సుమారు 480 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ నెలాఖరులో ఈ కారు ప్రపంచ వ్యాప్త లాంచ్ సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడించనున్నారు.