షాకింగ్ న్యూస్.. ఇండియాలో కియా కార్ల ఉత్పత్తి నిలిపివేత.. కారణం ఏంటంటే ?
సౌత్ కొరియన్ కంపనీ కియా మోటార్స్ పాపులర్ మోడల్ కియా సోనెట్, కియా సెల్టోస్ ఎస్‌యూవీకి చెందిన హెచ్‌టిఎక్స్ ప్లస్ ఎటి 1.5 డీజిల్ వేరియంట్ల హెచ్‌టికె ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్‌లను నిలిపివేయబోతోంది.
ఒక నివేదిక ప్రకారం కియా డీలర్లు ఏప్రిల్ నుండి సోనెట్ హెచ్టికె ప్లస్ 1.0-లీటర్ పెట్రోల్ డిసిటి, హెచ్‌టికె ప్లస్ 1.5-లీటర్ డీజిల్ ఎటి, సెల్టోస్ హెచ్‌టిఎక్స్ ప్లస్ 1.5-లీటర్ ఎటి వేరియంట్ల బుకింగ్‌లను మూసివేసింది.
రెండు కార్లలోని ఈ వేరియంట్ల బుకింగ్ ఏప్రిల్ మధ్య నాటికి పూర్తిగా మూసివేయనుంది. లీకైన సమాచారం ప్రకారం ఈ రెండు ఎస్‌యూవీల ఫీడ్‌బ్యాక్ పరిశీలించిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రెండు ఎస్‌యూవీల కోసం చేసిన బుకింగ్‌లు మార్చి 31 లోగా డెలివరీ చేస్తామని సంస్థ పేర్కొంది. కియా ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది మే 1 నుండి సెల్టోస్, సొనెట్ ఈ వేరియంట్ల తయారీని కూడా ఆపివేయనుంది. అలాగే త్వరలోనే సెల్టోస్, సొనెట్ కొత్త వేరియంట్ల అప్ డేట్ జాబితాను వెల్లడించనుంది.
కియా సోనెట్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌షోరూమ్ ధర రూ .6.79 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ల ధర రూ .13.19 లక్షల వరకు ఉంటుంది. హెచ్‌టికె ప్లస్ పెట్రోల్ డిసిటి వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ .10.49 లక్షలు, హెచ్‌టికె ప్లస్ డీజిల్ ఎటి ధర రూ .10.59 లక్షలు. అలాగే కియా సెల్టోస్ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ .9.89 లక్షలు, దీని టాప్ వేరియంట్ ధర రూ .17.45 లక్షల వరకు ఉంటుంది.
కియా సోనెట్ హెచ్టికె ప్లస్ పెట్రోల్ డిసిటి వేరియంట్‌కు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 118.36 బిహెచ్‌పి శక్తిని, 172 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.5 కె-లీటర్ డీజిల్ ఇంజన్ సోనెట్ హెచ్టికె ప్లస్ డీజిల్ ఎటి వేరియంట్లో లభిస్తుంది. ఈ ఇంజన్ 113 బిహెచ్‌పి శక్తిని, 250 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కియా సొనెట్ ఎస్‌యూవీలో లేటెస్ట్ ఫీచర్లను అందిస్తుంది. ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ అడ్జస్ట్ చేయగల ఓఆర్‌విఎంలు, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ విండోస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
కియా సెల్టోస్ హెచ్‌టిఎక్స్ ప్లస్ ఎటి వేరియంట్‌లకు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 113 బిహెచ్‌పి శక్తిని, 250 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెల్టోస్ వేరియంట్లో చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో బోస్ 8-స్పీకర్ స్టీరియో సిస్టమ్, 8-వే డ్రైవర్ అడ్జస్ట్ సీటు, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇది కాకుండా ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేస్తుంది. భారతీయ మార్కెట్లో ఈ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి ఎస్-క్రాస్, రెనాల్ట్ డస్టర్ వంటి కార్లతో పోటీపడుతుంది.