4నిమిషాల చార్జింగ్ తో 100కి.మీ మైలేజ్ ఇచ్చే కియా కొత్త కార్ వచ్చేసింది.. కొత్త లోగో, ఫీచర్స్ చూసారా..
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా కార్పొరేషన్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనమైన కియా ఇవి6 ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఈ కారు ఎలా ఉంటుందో, ఫీచర్స్ గురించి సంస్థ గతంలో వెల్లడించింది.
ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను కంపెనీ తెలిపింది. కియా మోటార్స్ నుండి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు టెస్లా కార్లకు పోటీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మీకోసం..
సంస్థ కొత్త ఈవి ప్లాట్‌ఫాం (ఈ-జిఎంపి లేదా ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫాం)పై ఈ కారుని నిర్మించారు. కియా ఇవి 6 కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ఎస్‌యూవీనిఇవి 6 , ఇవి 6 జిటి, ఇవి 6 జిటి లైన్ అనే మూడు ట్రిమ్‌లలో ప్రవేశపెట్టారు.
బ్యాటరీ
కియా ఇవి 6 ఎలక్ట్రిక్ కారుకి రెండు బ్యాటరీలు లభిస్తాయి. 77.4 kWh బ్యాటరీ ప్యాక్ లాంగ్ రేంజ్ వేరియంట్లలో అందించారు. కారు స్టాండర్డ్ వేరియంట్ లో 58.0 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఇవి6 జిటి- లైన్‌లో ఇచ్చారు. కానీ ఇవి6 జిటి లో లాంగ్ రేంజ్ బ్యాటరీ మాత్రమే లభిస్తుంది. 2-వీల్ డ్రైవ్ అండ్ 4-వీల్ డ్రైవ్ ఆప్షన్స్ అందించే సంస్థ మొదటి ఎలక్ట్రిక్ కారు ఇది. ఇవి6 కారు పొడవు 4,680
పవర్ అండ్ స్పీడ్
ఇవి6 లాంగ్ రేంజ్ 2-వీల్ డ్రైవ్ వేరియంట్లలో 77.4 kWh బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది, ఒక పూర్తి ఛార్జింగ్‌లో 510 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేయవచ్చు. దీనిలో 168 కిలోవాట్ల శక్తి గల ఎలక్ట్రిక్ మోటారు ఉంది, ఇది 229 పిఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.ఇంకా 4-వీల్ డ్రైవ్ వేరియంట్లలో 239 కిలోవాట్ల శక్తి గల ఎలక్ట్రిక్ మోటారు ఇచ్చారు. ఈ ఇంజన్ 325 పిఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ఎస్‌యూవీ కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లగలదు.
ఇవి6 స్టాండర్డ్ వేరియంట్ 2-వీల్ డ్రైవ్ లో 125 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. దాని 4-వీల్ డ్రైవ్ వేరియంట్లో 173 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు వస్తుంది. ఈ వేరియంట్ కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు.
జిటి ట్రిమ్ పవర్
ఇవి6 ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ 4-వీల్ డ్రైవ్ జిటి వెర్షన్ 430 కిలోవాట్ల డ్యూయల్ మోటారుతో వస్తుంది. ఇది 740 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగంతో వెల్లగలదని కంపెనీ పేర్కొంది. ఈ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ. ఈ వేరియంట్లో స్పెషల్ లిమిట్ స్పీడ్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉందని తేలింది.
ఛార్జింగ్ అండ్ డ్రైవింగ్ రేంజ్
కియా ఇవి 6 ఎలక్ట్రిక్ కారులో 800 వోల్ట్ ,400 వోల్ట్ ఛార్జింగ్ సిస్టం ఉంది. ఇది కేవలం 18 నిమిషాల్లో ఇవి6 కారును 10 శాతం నుండి 80 శాతం వరకు చార్జ్ చేస్తుంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో కేవలం 4 నిమిషాల 30 సెకన్లలో ఛార్జ్ తో 100 కి.మీ దూరం వరకు సులభంగా ప్రయాణించవచ్చు . కియా ఇవి 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక పూర్తి ఛార్జింగ్‌లో 510 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఇటీవల ప్రారంభించిన ఐయోనిక్ 5 రూపానికి భిన్నంగా కియా ఇవి6 క్రాస్ఓవర్ డిజైన్ పొందింది. కార్ల తయారీ సంస్థ కొత్త లోగో కియా ఇవి6 ముందు భాగంలో కనిపిస్తుంది. కియా డిజిటల్ టైగర్ ఫేస్ అని పిలువబడే ఈ కారు మొత్తం ఫ్రంట్ లుక్‌లో కొత్త ఫ్రంట్ ఎలిమెంట్ కనిపిస్తుంది. అయితే, కియా ఇవి6 ఫ్రంట్ లుక్ కంపెనీ సాధారణ కార్లకి చాలా భిన్నంగా కనిపిస్తుంది.
ఇవి6 ఇంటీరియర్ గురించి మాట్లాడితే కియా ఈ విభాగంలో ఉన్న ఇతర కార్ల కన్నా ఎక్కువ స్థలాన్ని మీకు ఇస్తుందని హామీ ఇచ్చింది. హ్యుందాయ్ ఫ్లాట్ డాష్‌బోర్డ్ డిజైన్‌ను అందిస్తుండగా, ఇవి6 డ్రైవర్ సీటు చుట్టూ కాక్‌పిట్ ఉంటుంది. పెద్ద డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కర్వ్ బ్లాక్ డాష్‌బోర్డ్‌లో కలిపి వస్తుంది. దీనికి రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. ముందు సీట్ల మధ్య ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, స్టార్ట్ బటన్, తిరిగే గేర్ లివర్ వస్తుంది. దీనితో పాటు, విశాలమైన స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా ఉంది.