హై-సేఫ్టీ ప్యాకేజీతో కియా లేటెస్ట్ కార్.. 66 కనెక్ట్ ఫీచర్లతో మొదటిసారిగా అందుబాటులోకి..
సౌత్ కొరియన్ మల్టీనేషనల్ ఆటోమోబైల్ తయారీ సంస్థ కియా మోటార్స్ ఎస్‌యూవి అండ్ ఎంపివి కలయికతో కియా కారెన్స్ (Kia Carens)ని పరిచయం చేసింది. తాజాగా ఈ 6-7 సీటర్ కియా కార్ల పూర్తి ఫీచర్లు వెల్లడయ్యాయి కానీ ధరలు ఇంకా ప్రకటించలేదు. కియా కారెన్స్ లాంచ్ ముందు కంపెనీ ట్రిమ్ వివరాలను, టెక్నాలజి వివరాలను కూడా వెల్లడించింది.
కియా కార్ల బుకింగ్‌లు 14 జనవరి 2022 నుండి ప్రారంభమవుతాయి. మూడు వరుసల వినోద వాహనం కియా కార్స్ ఐదు ట్రిమ్ లెవెల్స్ అందించనుంది వీటిలో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ అండ్ లగ్జరీ ప్లస్ ఉన్నాయి. మొత్తం ఐదు ట్రిమ్ లెవెల్స్ స్టాండర్డ్ గా 10 హై-సేఫ్టీ ప్యాకేజీలను పొందుతాయి. కొత్త కియా కేరెన్స్‌లో ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం...
ఫీచర్స్
కియా కారెన్స్ నెక్స్ట్ జనరేషన్ కియా కనెక్ట్‌తో 10.25 అంగుళాల హెచ్‌డి టచ్‌స్క్రీన్ నావిగేషన్, 8-స్పీకర్‌తో కూడిన బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైరస్ అండ్ బ్యాక్టీరియా ప్రొటెక్షన్ కోసం స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, రెండవ వరుస సీటు వన్ టచ్ ఈజీ ఎలక్ట్రిక్ టంబుల్‌తో అలాగే స్కైలైట్ సన్‌రూఫ్ వంటి ఇన్-క్లాస్ ఫీచర్‌లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా కస్టమర్లు కియా కనెక్ట్‌లో నావిగేషన్, రిమోట్ కంట్రోల్, వెహికల్ మేనేజ్‌మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీతో పాటు 66 కనెక్ట్ చేసిన ఫీచర్లను పొందుతారు. ఈ ఫీచర్లలో ఫైనల్ డెస్టినేషన్ గైడెన్స్, సర్వర్ బేస్డ్ రూటింగ్ గైడెన్స్, రిమోట్ సీట్ వెంటిలేషన్ కంట్రోల్, ప్రో-యాక్టివ్ వెహికల్ స్టేటస్ అలర్ట్ మొదలైనవి ఉన్నాయి. ఓవర్ ది ఎయిర్ మ్యాప్ అప్‌డేట్‌లతో పాటు కియా కారెన్స్ కస్టమర్‌లు ఓవర్ ది ఎయిర్ (OTA) సిస్టమ్ అప్‌డేట్‌ల సదుపాయాన్ని కూడా పొందుతారు, తద్వారా కస్టమర్‌లు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ల కోసం తరచుగా సర్వీస్ సెంటర్‌లను సందర్శించాల్సిన అవసరం లేదు.
ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లు
క్యాబిన్ సరౌండ్ 64 కలర్ యాంబియంట్ మూడ్ లైటింగ్
6-ఎయిర్‌బ్యాగ్‌లు, ESC+VSM+HAC+DBC+ABS+BAS, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, TPMS, బ్యాక్ పార్కింగ్ సెన్సార్‌లతో సహా 10 హై-సేఫ్టీ ప్యాకేజీలు అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్ గా ఉంటాయి.
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
మల్టీ డ్రైవ్ మోడ్‌లు (స్పోర్ట్, ఎకో, నార్మల్) యాంబియంట్ మూడ్ లైటింగ్‌కి లింక్ చేయబడ్డాయి.
రెండవ వరుస సీటు వన్ టచ్ ఈజీ ఎలక్ట్రిక్ టంబుల్ ఉంటుంది అంటే చిటికెలో మడవవచ్చు.
అలాగే ఈ సెగ్మెంట్లో తొలిసారిగా స్కైలైట్ సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఇతర ఫీచర్లు
ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
2వ, 3వ వరుసల కోసం పైకప్పుపై ఏసి వెంట్‌లు
R-16 – 40.62, 16 అంగుళాల డ్యూయల్ టోన్ క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్
స్టార్ మ్యాప్ ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్
కూలింగ్ ఫంక్షన్‌తో స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జర్
ఇంజిన్ స్పెసిఫికేషన్స్
కియా కారెన్స్ మూడు పవర్‌ట్రైన్ ఆప్షన్స్ లో లభిస్తుంది -స్మార్ట్ స్ట్రిమ్ 1.5 పెట్రోల్, స్మార్ట్ స్ట్రిమ్ 1.4 T-GDi పెట్రోల్, 1.5 CRDi VGT డీజిల్. అంతేకాకుండా, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 7-స్పీడ్ DCT, 6-స్పీడ్ AT అనే మూడు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ నుండి ఎంచుకోవడానికి ఆప్షన్స్ కూడా పొందుతారు. కారెన్స్ ప్రీమియం నుండి లగ్జరీ ట్రిమ్‌లలో 7-సీటర్ ఆప్షన్ అందించబడుతుంది, అయితే లగ్జరీ ప్లస్ ట్రిమ్ 6 అండ్ 7 సీట్ల ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.
కారెన్స్ స్మార్ట్ స్ట్రిమ్ G 1.5 పెట్రోల్ ఇంజన్ 6300 rpm వద్ద 115 PS శక్తిని, 4500 rpm వద్ద 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
స్మార్ట్ స్ట్రిమ్ 1.4 T-GDi పెట్రోల్ ఇంజన్ 6000 rpm వద్ద 140 PS శక్తిని, 1500-3200 rpm వద్ద 242 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1.5 CRDi VGT డీజిల్ ఇంజన్ 4000 rpm వద్ద 115 PS శక్తిని, 1500-2750 rpm వద్ద 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సైజ్ అండ్ కలర్స్
కియా కార్లు దాని సెగ్మెంట్‌లో పొడవైన వీల్‌బేస్‌తో వస్తాయి, దానితో పాటు ఈ సెగ్మెంట్ నుండి ఇప్పటికే ఉన్న వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది. కియా కారెన్స్ 2780 mm వీల్‌బేస్‌ను పొందుతుంది, అంటే మూడవ వరుస ప్రయాణీకులకు కూడా సౌకర్యవంతమైన డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుంది. కియా కారెన్స్ పొడవు 4540 mm, ఎత్తు 1800 mm, వెడల్పు 2780 mm.
కియా లైనప్‌లో మూడు కొత్త రంగులు జోడించి కారెన్స్ 8 రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇంపీరియల్ బ్లూ (కొత్త రంగు), మాస్ బ్రౌన్ (కొత్త రంగు), షైన్ సిల్వర్ (కొత్త రంగు), ఇంటెన్స్ రెడ్, అరోరా బ్లాక్ పెర్ల్, గ్రావిటీ గ్రే, గ్లేసియర్ వైట్ పెర్ల్ అండ్ క్లియర్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటాయి.