జావా నుండి 500 సిసి అడ్వెంచర్-టూరింగ్ బైక్.. దీని స్పెషల్ ఫీచర్స్ తెలుసా..?
ద్విచక్ర వాహన తయారీ సంస్థ జావా బ్యాడ్జింగ్ స్క్రాంబ్లర్ కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి, దీంతో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ బైక్ బ్రిస్టల్ వెలోస్ 500కి రీబాడ్డ్ వెర్షన్. బ్రిస్టల్ ఫిలిప్పీన్స్ ఆధారిత ఆటోమొబైల్ కంపెనీ.
ఈ కంపెనీ సిజెక్ రిపబ్లిక్ ఆధారిత జావా కంపెనీతో భాగస్వామ్యాన్ని చేసుకుంది. భారతదేశంలోని జావా బైక్స్ క్లాసిక్ లెజెండ్స్‌తో ఈ బైక్‌కు సంబంధం లేదు. ఇప్పుడు సిజెక్ ఆధారిత జావా కంపెనీ మరొక బైక్ పరిచయం చేసింది, అదే బ్రిస్టల్ వెలోస్ 500 అడ్వెంచర్ బైక్. దీనిని స్క్రాంబ్లర్ వెర్షన్‌ను ఆర్‌విఆర్ 500 అని కూడా పిలుస్తారు.
ఇంజిన్ అండ్ పవర్
ఈ బైక్ కి స్క్రాంబ్లర్ లాగానే 471 సీసీ పారలెల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్‌పిఎం వద్ద 47 బిహెచ్‌పి శక్తిని, 6,500 ఆర్‌పిఎం వద్ద 43 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్
సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఈ బైక్‌కి ముందు భాగంలో అప్ సైడ్ డౌన్ ఫోర్కులు ఇచ్చారు. బైక్ వెనుక భాగంలో మోనో-షాక్ ఉంటుంది. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో ట్విన్ డిస్క్, వెనుక టైర్ కి సింగిల్ డిస్క్ ఉన్నాయి. ఈ బైక్ సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. బైక్ ఇతర ఫిచార్స్ గురించి మాట్లాడితే ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బి సాకెట్ అందించారు.
అడ్వెంచర్ అక్విప్మెంట్స్
ఈ బైక్ అధికారిక ఫోటోలలో మీరు పూర్తిగా చూడవచ్చు, ఏంటంటే కొత్త జావా ఆర్‌విఎం 500 అడ్వెంచర్ అక్విప్మెంట్స్ అండ్ ఫీచర్లను పొందుతుంది. ఈ బైక్ కి 18-అంగుళాల ఫ్రంట్ అండ్ 16-అంగుళాల బ్యాక్ స్పోక్ వీల్స్ లభిస్తాయి, ఇవి మెట్జ్లర్ నుండి డ్యూయల్-స్పోర్ట్ టైర్లు. అయితే భారతీయ మార్కెట్లో లాంచ్ పై ఎలాంటి సమాచారం లేదు.