జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. కేవలం 5 సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్..

First Published Feb 10, 2021, 2:05 PM IST

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, వివిధ ఆటోమొబైల్ తయారీదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాయి. భారతదేశంలోని చాలా విదేశీ ఆటోమోటివ్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్  తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును విడుదల చేయబోతోంది.