ఎక్కువ మైలేజ్, మంచి బ్రేకింగ్ కోసం టైర్లకు కొత్త నిబంధనలు.. వారు తప్పనిసరి పాటించాలి..
ఏదైనా కొత్త వాహనం కొనే ముందు ఎక్కువగా టైర్ల బ్రాండ్, మన్నిక చూస్తాము. అయితే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు టైర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తాజాగా టైర్లకు కొత్తగా తప్పనిసరి నిబంధనలను ప్రతిపాదిస్తూ భారత ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
రోలింగ్ రెసిస్టన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ కోసం ఒక నిర్దిష్ట బెంచ్ మార్కును చేరేల భారతదేశంలో విక్రయించే టైర్లకు కొత్త నిబంధనలకు అవసరం. వాహనదారుల భద్రతా అంశాలను మెరుగుపరచడంలో లక్ష్యంగా పెట్టుకొని యూరప్ వంటి మార్కెట్లలో 2016 నుండి ఇలాంటి నిబంధనలు అమలులో ఉన్నాయి. దేశీయ టైర్ తయారీదారులు, దిగుమతిదారులు కార్లు, బస్సులు, భారీ వాహనాల కోసం ప్రతిపాదిత నిబంధనలను తప్పనిసరి పాటించాలి.
రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టిహెచ్) ముసాయిదా నోటిఫికేషన్‌లో టైర్లకు ఈ ఏడాది అక్టోబర్ నుండి వర్తించే కొత్త టైర్ నిబంధనలను ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న కొత్త టైర్ మోడల్స్ అక్టోబర్ 2022 నుండి ఈ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. టైర్ల కోసం "స్టార్ రేటింగ్" వ్యవస్థను తీసుకువచ్చే దిశలో ఈ చర్య మొదటి దశ. ఇటీవల సియాట్ తన స్వంత టైర్ లేబుల్ వ్యవస్థను సెక్యురాడ్రైవ్ శ్రేణితో భారతదేశంలో ప్రవేశపెట్టింది.
భారతదేశం ఒక ఉత్పత్తి కేంద్రంగా ఉంది, అలాగే దేశీయ టైర్ తయారీదారులు తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. కాబట్టి, భద్రతా నిబంధనలను పాటించడం వారికి సమస్య కాకూడదు. ప్రస్తుతం, భారతదేశంలో విక్రయించే టైర్లు టైర్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం తప్పనిసరి బిఐఎస్ బెంచ్ మార్క్ నాణ్యతను పొందుతాయి.
యుఎస్, యూరప్, జపాన్ ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లలో అమలు చేసిన చట్టాలకు భారతదేశంలో విక్రయించే టైర్లను ఒక అడుగు ముందుకు తీసుకురావడానికి కొత్త నిబంధనలు సహాయపడతాయి.