కాస్ట్లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్..! ముంబైలో ఎక్కడి నుంచి వెళ్తుందో చూసారా...
ఎన్నో సూపర్ డూపర్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్ సభ ఎన్నికల రంగంలోకి దిగారు. బీజేపీలో చేరిన కంగనా ఇప్పుడు ప్రచారం బిజీలో పడింది. కాగా, కంగనా రనౌత్ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ కారును కొన్నది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కంగనాకి ఈ కారు 2వ బెంజ్ కారు.
లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన కంగనా రనౌత్ పలు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు కంగనా కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న కంగనా కొత్త కారు కొనుగోలు చేసి వార్తల్లోకెక్కింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం(Mandi Lok Sabha constituency) నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి కంగనా ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్నారు. బీజేపీతో కలిసి ప్రచారం చేస్తున్న సమయంలో కంగనా సరికొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ కారును కొనుగోలు చేసింది.
kangana New Benz car(
కంగనా రనౌత్ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ కారు ధర రూ.2.4 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కారు మేబ్యాక్ GLS ఎడిషన్.
ముంబైలో కంగనా రనౌత్ ఈ కొత్త కారులో కనిపించింది. ఆ సమయంలో కంగనా ఓ సెలూన్ నుండి తన కొత్త మేబ్యాక్ కారులో వెళ్ళింది.
కంగనా రనౌత్‌కి మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ కారు కొత్త కాదు. గతంలో కంగనా మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్680 కారును కొనుగోలు చేసింది. దీని ధర 3.6 కోట్ల రూపాయలు.
కంగనా తన పాత బెంజ్ మేబ్యాక్ S680 కారుని మార్చుకుని కొత్త మేబ్యాక్ GLS కారును కొనుగోలు చేసిందా అనే దానిపై ఇప్పుడు స్పష్టమైన సమాచారం లేదు.
కంగనా రనౌత్ దగ్గర ఇవి కాకూండా చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. BMW 7 సిరీస్, 730LD, Mercedes Benz GLE 350D SUV, Audi Q3 లగ్జరీ కార్లు ఉన్నాయి. షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన కంగనా ప్రస్తుతం ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది.