కియాకి పోటీగా పవర్ ఫుల్ డిజైన్, బెస్ట్ ఫీచర్స్ తో హ్యుందాయ్ కొత్త కార్ ఫస్ట్ లుక్..
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ కార్లు వాటి అధినిక ఫీచర్స్ తో పాటు వాటి స్టయిల్, డిజైన్ కారణంగా ప్రత్యేక గుర్తింపును పొందాయి. ఏ విభాగానికి చెందిన కారు అయినా ప్రత్యేకమైన పాపులరిటీ పొందాయి.
త్వరలో లాంచ్ కానున్న ఈ కారు ఎంపివి (మల్టీ పర్పస్ వెహికల్) విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మోడల్ లేదు. దీని స్టయిల్, డిజైన్ మీ దృష్టిని ఆకర్షించగలదు. హ్యుందాయ్ తాజాగా ఈ విభాగంలో రాబోయే ఎంపివి హ్యుందాయ్ స్టార్యా మొదటి టీజర్ ఫోటోలని విడుదల చేసింది. ఈ విభాగంలో ఈ కారు విభిన్న స్టైలింగ్, మరెన్నో ఫీచర్స్ తో వస్తున్నట్లు సూచించింది.
లూక్స్ అండ్ డిజైన్
ఈ కొత్త కారు టీజర్ ఫోటోలలో కారు ముందు, వెనుక నుండి ఎలా ఉంటుందో చూపిస్తుంది. దీని బోనెట్ ముందు భాగంలో స్క్వైర్ ఆకారంలో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ ఉన్నాయి. కారు వెనుక భాగం పెద్ద ఎల్‌ఈడీ టైలాంప్‌తో ట్రెడిషనల్ ఎమ్‌పివిలా కనిపిస్తుంది. అంతేకాకుండా పెద్ద పనరోమిక్ విండోస్ ఈ కారులో చూడవచ్చు.
ఫీచర్స్
కొత్త స్టారియా ఎంపివిలో లైట్ షెడ్ తో డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అందించినట్లు కారు ఇంటిరియర్ ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది. మధ్య వరుసలో ప్రయాణీకులకు కెప్టెన్ సీట్లు కూడా ఉంటాయి. ఇవి కాకుండా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డాష్‌బోర్డ్ సింపుల్ డిజైన్ తో అందించారు. కారులో పెద్ద వేర్టికల్ ఏసి వెంట్స్ ఏర్పాటు చేశారు. ఈ 7 సీట్ల ఎమ్‌పివి గురించి ఇంకా పూర్తి సమాచారం లేనప్పటికి ఈ కారు హ్యుందాయ్ స్టారెక్స్ కంటే పెద్దదిగా ఉండే అవకాశం ఉంది.
ఈ మోడల్ ప్రత్యేకంగా దక్షిణాసియా మార్కెట్ల కోసం రూపొందించారు. ప్రత్యేకత ఏమిటంటే దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ ఇటీవల భారతదేశంలో స్టార్రియా పేరును ట్రేడ్ మార్క్ చేసింది. అయితే కార్ల తయారీ సంస్థ భారతదేశంలో లాంచ్ పై అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ ఎంపివిని మొదట ఫిలిప్పీన్స్‌లో విడుదల చేయనున్నారు. ఈ కారు రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ఒక నివేదిక ప్రకారం స్టార్రియా ఎంపివి కారు న్యూ జనరేషన్ హ్యుందాయ్ స్టారెక్స్ కావచ్చు. కంపెనీ ఈ కారును ఆసియా మార్కెట్లలో విక్రయిస్తుంది.
ప్రస్తుతం ఎంపిక చేసిన మార్కెట్లలో హ్యుందాయ్ స్టార్రియాను పరిచయం చేస్తుంది. కానీ భారతదేశంలో లాంచ్ గురించి వెల్లడించలేదు. ఈ కారు పెద్ద కుటుంబాలు ఉన్న వారిని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ఈ కారు కియా కార్నివాల్ వంటి పెద్ద కార్లతో పోటీ పడవచ్చు. కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారత మార్కెట్ కోసంఒక కాంపాక్ట్ ఎంపివిని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ దీనిని భారతీయ మార్కెట్లో లాంచ్ చేస్తేఇది మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా మరాజో, రాబోయే కియా కాంపాక్ట్ ఎంపివిలతో పోటీపడుతుంది.