Hyundai:హ్యుందాయ్ గ్రాండ్ i10 సరికొత్త ఎడిషన్.. లేటెస్ట్ టెక్నాలజి, అప్ డెటెడ్ ఫీచర్స్ తో అదిరిపోయే లుక్..
సౌత్ కొరియన్ మల్టీనేషనల్ అటోమోటివ్ తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్ (grand i10 Nios corporate edition)ని లాంచ్ చేసింది. గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ స్పెషల్ ఎడిషన్ మాన్యువల్ ఇంకా ఏఎంటి గేర్‌బాక్స్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్ ద్వారా టెక్నాలజీ మెరుగుదలలతో స్పోర్టి అండ్ ఆకర్షణీయంగా కనిపించేల కారును అందించడానికి కంపెనీ ప్రయత్నించిందని వాహన తయారీ సంస్థ పేర్కొంది.
ధర ఎంత అంటే
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్ ధర రూ. 6,28,900 నుండి రూ. 6,97,700 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ కారు 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే గ్రాండ్ i10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ ఎన్నో టెక్నాలజి అప్ డేట్స్ తో వస్తుందని సంస్థ పేర్కొంది.
లూక్స్ అండ్ డిజైన్
దీనిని మాగ్నా ట్రిమ్ ఆధారంగా రూపొందించారు ఇంకా ఎన్నో ఎక్స్టీరియర్ అండ్ ఇంటర్నల్ అప్ డేట్స్ పొందుతుంది. కొత్త గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్‌లో గ్లోసీ బ్లాక్ రేడియేటర్ గ్రిల్, 15-అంగుళాల గన్‌మెటల్ స్టైల్ వీల్స్, రూఫ్ రెయిల్స్, రియర్ క్రోమ్ గార్నిషింగ్, కార్పొరేట్ ఎంబ్లమ్, బ్లాక్ పెయింటెడ్ ORVMలు వంటి ఎన్నో ఎక్స్టీరియర్ మార్పులు ఉన్నాయని హ్యుందాయ్ తెలిపింది.
క్యాబిన్ లోపల కొత్త ఫీచర్ల గురించి మాట్లాడుతూ ఇందులో కూడా చాలా అప్‌డేట్‌లు చేయబడ్డాయి. స్మార్ట్‌ఫోన్ మిర్రరింగ్ ద్వారా నావిగేషన్‌తో 6.75-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బయటి అద్దాలపై LED టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ORVM వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందుతుంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ ఎడిషన్ లాంచ్ సందర్భంగా తరుణ్ గార్గ్, డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) మాట్లాడుతూ సంస్థ భారతదేశంలోని ప్రోగ్రెసివ్ అండ్ నవయుగ కస్టమర్లకు గ్రాండ్ i10 నియోస్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసినట్లు తెలిపారు. "ఈ కారు ప్రారంభించినప్పటి నుండి గొప్ప సేల్స్ చూసిన తర్వాత, కొత్త-యుగం కొనుగోలుదారుల ఆనందాన్ని ఇంకా విలువను మెరుగుపరచడానికి గ్రాండ్ i10 నియోస్‌లో స్పోర్టీ అండ్ హైటెక్ ఫోకస్డ్ కార్పొరేట్ ఎడిషన్‌ను పరిచయం చేయడం మాకు సంతోషంగా ఉంది. కార్పొరేట్ ఎడిషన్ స్పోర్టి, ఫీచర్ లోడ్ చేయబడిన అలాగే హ్యాచ్‌బ్యాక్ కోసం వెతుకుతున్న కస్టమర్లకు అనుగుణంగా ఉంటుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము."అని అన్నారు.