అమ్మకాల్లో హ్యుందాయ్ అరుదైన ఘనత.. 10 లక్షలు దాటిన ఎస్‌యూవీ అమ్మకాలు
న్యూ ఢీల్లీ: భారతదేశంలో తయారు చేసిన 10 లక్షల ఎస్‌యూవీలను విక్రయించినట్లు దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ ప్రకటించింది.
సోమవారం దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా చేసింది. ఈ 10 లక్షల ఎస్‌యూవీల్లో ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసిన ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) 2015లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా ఉత్పత్తిని ఇండియాలో ప్రారంభించింది, అలాగే ఈ విభాగంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా వృద్ధిని వేగవంతం చేసిందని కంపెనీ పేర్కొంది.
2005లో విడుదలైన క్రెటా ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో 5.9 లక్షల అమ్మకాలు, విదేశీ మార్కెట్లో 2.2 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ పేర్కొంది. అలాగే 2019లో విడులైన కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ మొత్తం అమ్మకాలు 1.8 లక్షలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఘనతపై హెచ్‌ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ & సర్వీస్) తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, "విప్లవాత్మక టెక్నాలజిని ప్రవేశపెట్టడంలో ముందున్నవారిలో మేము కొత్త మైలురాయిని సాధించామని, దాదాపు రెండున్నర దశాబ్దాలుగా భారత్‌లోనే ఎస్‌యూవీలను తయారీ చేస్తున్నమని" అన్నారు.
దేశీయ, ఎగుమతి మార్కెట్లలో 10 లక్షలకు పైగా ఎస్‌యూవీ అమ్మకాలతో "మేక్-ఇన్-ఇండియా" వాగ్దానాన్ని మేము భారతదేశంలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా పునరుద్ఘాటించాము అని గుర్తుచేశారు.
టక్సన్, శాంటా ఎఫ్‌ఇ, టెర్రాకాన్ వంటి కార్ల ద్వారా కంపెనీ ఎస్‌యువి లీడర్ వైపు దూసుకెళ్తుందని, ఇప్పుడు మేము క్రెటా, వెన్యూ వంటి ఉత్పత్తి ప్రారంభించడంతో ఈ విభాగంలో మంచి వృద్ధిని సాధించాము అని తెలిపారు.