త్వరలోనే హ్యుందాయ్ అతిచిన్న, చౌకైన ఎస్‌యూవీ.. దీని ఫీచర్స్, ధర, స్టయిల్ చూసారా..?
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ త్వరలోనే కొత్త ఎఎక్స్ 1 మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, సంస్థ ఇప్పుడు రానున్న సబ్ -4 సిటర్ల ఎస్‌యూవీ పేరుని కాస్పర్‌గా పేర్కొంది. సంస్థ ఇటీవల ఈ పేరును ట్రేడ్ మార్క్ కూడా చేసింది.
నివేదిక ప్రకారం హ్యుందాయ్ ఈ చిన్న ఎస్‌యూవీని 2021 సెప్టెంబర్‌లో కొరియాలో లాంచ్ చేయబోతుంది. హ్యుందాయ్ నుండి వస్తున్న ఈ మైక్రో ఎస్‌యూవీ సైజ్ చిన్నగా ఉంటుంది ఇంకా దీని ధర కూడా బడ్జెట్ లో ఉండనుంది.
ఈ మైక్రో ఎస్‌యూవీని హ్యుందాయ్ కె1 కాంపాక్ట్ కార్ ప్లాట్‌ఫామ్‌పై డిజైన్ చేసింది. హ్యుందాయ్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్ సాంట్రో, గ్రాండ్ ఐ10నియోస్ లలో కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుంది. పొజిషనింగ్ విషయానికొస్తే హ్యుందాయ్ కాస్పర్ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా ఉంటుంది. ప్రస్తుత సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ వెన్యూ తరువాత హ్యుందాయ్ అతిచిన్న ఎస్‌యూవీ కాస్పర్ అవుతుంది.
కంపెనీ నుండి రాబోయే కారును మొదట దేశీయ మార్కెట్లో విక్రయించనుంది, ఆ తరువాత భారతదేశంతో సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించనుంది. హ్యుందాయ్ కాస్పర్ ఎస్‌యూవీని భారతదేశంతో పాటు ఇతర మార్కెట్లలో వేరే పేరుతో లాంచ్ చేయవచ్చు. దీని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. ఇటీవల హ్యుందాయ్ ఏఎక్స్1 మైక్రో ఎస్‌యూవి టీజర్‌ను విడుదల చేసింది.
చిన్న ఎస్‌యూవీ మోడళ్లకు భారతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల ఈ కారు కూడా భారత మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందవచ్చు. కాస్పర్ హ్యుందాయ్ అతిచిన్న ఎస్‌యూవీ ఇంకా దీని సైజ్ 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హ్యుందాయ్ కాస్పర్ ఎస్‌యూవీ సైజ్ గురించి మాట్లాడితే ఈ కారు పొడవు 3,595 ఎంఎం, వెడల్పు 1,595 ఎంఎం, ఎత్తు 1,575 ఎంఎం ఉంటుంది. నివేదిక ప్రకారం ఈ గణాంకాలు సరైనవి అయితే హ్యుందాయ్ కాస్పర్ ప్రస్తుత సాంట్రో హ్యాచ్‌బ్యాక్ కంటే కొంచెం చిన్నదిగా, సన్నగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో కాస్పర్ 1.0-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్ ఇంజిన్‌తో విడుదల కానుంది. ఈ ఇంజిన్ గరిష్ట శక్తిని 76 పిఎస్, పీక్ టార్క్ 95 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.
నివేదిక ప్రకారం, హ్యుందాయ్ కాస్పర్ భారతదేశంలో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ తో రానుంది. దీనిలో 1.1-లీటర్ ఇంకా 1.2-లీటర్ ఇంజన్లు ఉంటాయి. 1.1-లీటర్ ఇంజన్ గరిష్ట శక్తి 69 పిఎస్, 99 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ సాంట్రోలో ఉపయోగించిన ఇంజిన్ కూడా ఇదే. 1.2-లీటర్ ఇంజన్ గరిష్ట శక్తి 83 పిఎస్, 114 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లకు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ అందించవచ్చు. కాస్పర్ గ్వాంగ్జు గ్లోబల్ మోటార్స్ లో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ 2021 సంవత్సరంలో 12,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. 2022లో ఉత్పత్తి 70,000 యూనిట్లకు పెరుగుతుందని కంపెనీ తెలిపింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ .5.15 లక్షల నుండి 6.50 లక్షల వరకు ఉంటుంది.