మొబైల్ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ కార్.. పోర్స్చే లుక్ తో అద్భుతమైన ఫీచర్లు.. బుకింగ్‌లు ఓపెన్..
చైనీస్ మల్టీనేషనల్ టెక్నాలజి కార్పోరేషన్ హువావై (Huawei)ఒకప్పుడు ఫ్లాగ్‌షిప్ ఫోన్ ద్వారా స్మార్ట్‌ఫోన్(smartphone) మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. కానీ యూఎస్ ఆంక్షల కారణంగా దాని చిప్ సరఫరా నిలిపివేయబడింది దీంతో కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు 2021లో స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిని 60 శాతం తగ్గించిన తర్వాత హువావై ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ(electric vehicle industry)లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.
చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ తాజాగా రెండవ ఎలక్ట్రిక్ కారు ఏఐఓటి ఎం5 (AIOT M5) హైబ్రిడ్ ఎస్‌యూవిని చైనాలో విడుదల చేసింది. ఈ కారు విద్యుత్ ఇంకా ఇంధనంతో నడుస్తుంది. ఈ కారులో హువావై అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను హార్మోని ఓఎస్ (HarmonyOS) అని పిలుస్తారు. ఈ సిస్టమ్ హువావై కోసం అండ్రాయిడ్ అండ్ విండోస్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ సిస్టమ్ స్మార్ట్ కార్లతో పాటు వివిధ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) డివైజెస్ అండ్ గాడ్జెట్‌లకు కనెక్ట్ చేయగలదు.
అద్భుతమైన కస్టమర్ ఫీడ్‌బ్యాక్
మొదటి ఐదు రోజుల్లోనే ఈ కారుకు 6,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. ఏఐఓటి (AIOT) మొట్టమొదటి లగ్జరీ స్మార్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవి ఎం5ని హువావై అండ్ మరొక చైనీస్ బ్రాండ్ సేరేస్ (seres) అభివృద్ధి చేసింది.
వేరియంట్ అండ్ పవర్
ఏఐఓటి ఎం5 వేరియంట్ పవర్ కోసం ఒకటి లేదా రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లపై ఆధారపడుతుంది. 204 hp గరిష్ట శక్తితో బ్యాక్ విల్ డ్రైవ్ వెర్షన్, 224 hp పవర్ అవుట్‌పుట్‌తో 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. 4-వీల్ డ్రైవ్ మొత్తం 428 hp పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
రేంజ్ అండ్ స్పీడ్
హువావై Aito M5 కూడా 125 hp శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. అయితే 40 kWh బ్యాటరీ ప్యాక్‌ని రీఛార్జ్ చేయడానికి జనరేటర్‌గా మాత్రమే పనిచేస్తుంది. ఎస్‌యూవి మొత్తం డ్రైవింగ్ రేంజ్ 1,195 కి.మీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎస్‌యూవి కేవలం 4.4 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదని కూడా పేర్కొంది.
అద్భుతమైన ఇంటీరియర్
అయిటో ఎం5(Aito M5) లోపలి భాగం చాలా విశాలంగా ఉంటుంది. ఇంకా 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది, ఇది హువావై ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. డిస్ ప్లే ఇంటర్‌ఫేస్ హార్మొనీ ఓఎస్ సిస్టమ్‌పై నడుస్తుంది. దీనికి స్ప్లిట్-స్క్రీన్ ఇంకా 3డి ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ ఉంది. అదనంగా హువావై వాచ్ లేదా ఆటోమేటిక్ హువావై ఐడి లాగిన్‌లోని ఎన్‌ఎఫ్‌సి చిప్‌ని ఉపయోగించి కారును అన్‌లాక్ చేయవచ్చు.
భద్రతా ఫీచర్లు
దీనికి 10.4-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, ఇది డిజిటల్ డిస్‌ప్లేతో వస్తుంది. సేఫ్టీ ఫీచర్‌గా కంపెనీ విండ్‌షీల్డ్ ఎడమ పిల్లర్‌పై ఎల్లప్పుడూ డ్రైవర్ అప్రమత్తతను గమనించడానికి కెమెరాను అందించింది.
పోర్స్చే మకాన్ స్ఫూర్తితో
హువావై అయిటో ఎం5 ఎస్‌యూవి పొడవు 4.77 మీటర్లు, వీల్‌బేస్ 2.88 మీటర్లు. ఎస్‌యూవి డిజైన్ పోర్షే మకాన్ నుండి ప్రేరణ పొందింది, ఎందుకంటే రెండింటి మధ్య ఒకేరకమైన చాలా పోలికలు ఉన్నాయి. ముందు నుండి ఎస్‌యూవి పెద్ద, విస్తృత హెడ్‌లైట్‌లతో వస్తుంది. దీని అల్లాయ్ వీల్స్ కోసం పెద్ద వీల్ ఆర్చ్‌లు ఇచ్చారు. ఇంకా బ్యాక్ లైట్ క్లస్టర్ టెయిల్ గేట్ మొత్తం విస్తరించి ఉంటుంది.
కలర్ ఆప్షన్స్
హువావై ఆరు ఎక్స్ స్టీరియర్ కలర్ ఆప్షన్స్ తో ఈ ఎస్‌యూవిని అందిస్తోంది. ఇందులో సిరామిక్ వైట్, పైన్ ఫ్రాస్ట్ గ్రీన్, ఐస్ క్రిస్టల్ గ్రే, గిల్ట్ బ్లాక్, మిహై బ్లూ, అజూర్ బ్లూ వంటి కలర్స్ ఉన్నాయి.