MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Driving Tips : రోడ్డుపై దూసుకెళుతున్నప్పుడు బైక్ లేదా కారు బ్రేకులు సడన్ గా ఫెయిలైతే.. ఏం చేయాలో తెలుసా?

Driving Tips : రోడ్డుపై దూసుకెళుతున్నప్పుడు బైక్ లేదా కారు బ్రేకులు సడన్ గా ఫెయిలైతే.. ఏం చేయాలో తెలుసా?

కారు లేదా బైక్‌పై వెళ్తున్నప్పుడు సడన్‌గా బ్రేకులు ఫెయిల్ అయితే ఏం చేయాాలి? అస్సలు భయపడకుండా, టెన్షన్ లో తప్పులు చేయకుండా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో, వాహనాన్ని సేఫ్‌గా ఎలా ఆపాలో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 19 2026, 09:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డ్రైవింగ్ టిప్స్
Image Credit : Gemini AI

డ్రైవింగ్ టిప్స్

హైవే మీద స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు ఒక్కోసారి వాహనం బ్రేకులు సడన్ గా ఫెయిల్ అవుతుంటాాయి… ఇలాంటి సమయంలో చాలామంది డ్రైవర్లు టెన్షన్‌లో తప్పులు చేస్తుంటారు. ఇలా టెన్షల్ చేసే చిన్నచిన్న తప్పులే ప్రమాద తీవ్రతనె మరింత పెంచుతాయి… కారులోని వారు ఎక్కువగా గాయపడుతుంటారు. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా జరుగుతుంది. అయితే అది కారు అయినా, బైక్ అయినా సరే.. బ్రేక్ ఫెయిల్ అయితే కొన్ని తప్పులు చేయకుండా సింపుల్ డ్రైవింగ్ టిప్స్ పాటిస్తే సేఫ్ గా బైటపడవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇంజిన్ ఆఫ్ చేయవద్దు
Image Credit : Gemini AI

ఇంజిన్ ఆఫ్ చేయవద్దు

బ్రేక్ ఫెయిల్ అవ్వగానే చాలామంది చేసే మొదటి తప్పు ఇంజిన్ ఆఫ్ చేయడం. కీని వెంటనే తిప్పేసి వాహనంనుండి తీసేస్తే కారు ఆగుతుందని అనుకుంటారు… కానీ ఇదే పెద్ద ప్రమాదాలకు కారణం అవుతుంది. ఇలా ఇంజిన్ ఆఫ్ చేస్తే స్టీరింగ్ వెంటనే లాక్ అయిపోతుంది… దీనివల్ల వాహనం మీ కంట్రోల్ తప్పుతుంది. దీంతో బండి రోడ్డు మీద పల్టీలు కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంజిన్ ఆఫ్ చేయవద్దు.

హ్యాండ్ బ్రేక్ వాడొచ్చా..?

60 కి.మీ కంటే ఎక్కువ స్పీడ్‌లో వాహనం ఉన్నప్పుడు హ్యాండ్ బ్రేక్ లాగితే వెనుక టైర్లు లాక్ అయిపోతాయి. అప్పుడు కూడా బండి కంట్రోల్ తప్పి పెద్ద ప్రమాదం జరుగుతుంది. కాబట్టి బ్రేక్ ఫెయిల్ అయితే హ్యాండ్ బ్రేక్ వేసి వాహనాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయవద్దు. మరి వాహనాన్ని ఎలా ఆపాలి?

34
బ్రేక్ ఫెయిల్ అయితే ఏం చేయాలి?
Image Credit : Gemini AI

బ్రేక్ ఫెయిల్ అయితే ఏం చేయాలి?

స్టెప్ 1

బ్రేక్ పెడల్‌ను పలుమార్లు గట్టిగా నొక్కండి… ఇది చివరగా చేసే ప్రయత్నం. బ్రేక్ పెడల్‌ను వదలకుండా 4, 5 సార్లు గట్టిగా పంప్ చేస్తే బ్రేకులు కొద్దిగా పనిచేసే ఛాన్స్ ఉంది.

స్టెప్ 2

ఇంజిన్ బ్రేకింగ్ వాడండి… బండి స్పీడ్ తగ్గించడానికి ఇది బెస్ట్ ఆప్షన్. కారు 5వ గేర్‌లో ఉంటే వెంటనే 4వ గేర్‌కు మార్చండి. ఆ తర్వాత నెమ్మదిగా 3, 2, 1 గేర్లకు డౌన్ చేయండి. గేర్లు తగ్గేకొద్దీ బండి స్పీడ్ కంట్రోల్ అవుతుంది.

స్టెప్ 3

బ్రేక్ ఫెయిల్ అయినట్లు గమనించగానే హజార్డ్ లైట్స్ (ఇండికేటర్లు) ఆన్ చేయండి…హారన్ గట్టిగా కొట్టండి. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదం గురించి సిగ్నల్ వెళ్తుంది…వాళ్లు మీకు దారి ఇస్తారు. వెనక వచ్చేవారు కూడా అలర్ట్ అవతారు.

స్టెప్ 4

బండి స్పీడ్ 30 కి.మీ కంటే తక్కువకు వచ్చాకే హ్యాండ్ బ్రేక్ వాడండి. ఇంజిన్ బ్రేకింగ్ ద్వారా స్పీడ్ 30 కి.మీకి తగ్గాక, నెమ్మదిగా హ్యాండ్ బ్రేక్ లాగితే కారు ఆగిపోతుంది.

స్టెప్ 5

ఒకవేళ పక్కన లోయలు, ప్రమాదకరమైన ప్రాంతాలు ఉండి బండి ఆగకపోతే.. టైర్లను నెమ్మదిగా రోడ్డు పక్కన ఉండే మట్టి, ఇసుక, కంకర లేదా చిన్న పొదల వైపు తిప్పండి. ఆ రాపిడికి బండి స్పీడ్ వెంటనే తగ్గిపోతుంది.

44
బైక్ బ్రేక్ ఫెయిల్ అయితే ఏం చేయాలి?
Image Credit : Gemini AI

బైక్ బ్రేక్ ఫెయిల్ అయితే ఏం చేయాలి?

  • ముందుగా యాక్సిలరేటర్ వదిలేయండి.
  • కారులో లాగానే బైక్ గేర్లను కూడా ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ రండి.
  • గేర్ మార్చేటప్పుడు మాత్రమే క్లచ్ పట్టుకోండి.
  • గేర్ మార్చగానే క్లచ్ వదిలేయండి.
  • అప్పుడే బైక్ స్పీడ్ కంట్రోల్ అయ్యి ఆగుతుంది.

ప్రయాణం మొదలుపెట్టే ముందే బ్రేక్ ఆయిల్, బ్రేక్ ప్యాడ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dasara Offers : దసరా పండగరోజు బైక్ కొంటున్నారా? లక్ష లోపు ధరలో 80 కి.మీ మైలేజ్ ఇచ్చే 5 సూపర్ బైక్స్ ఇవే
Recommended image2
ఏ కారు టైర్లలో ఎంత గాలి ఉండాలి? సరైన ప్రెషర్ ఏంటో తెలుసా.?
Recommended image3
Worlds Most Expensive Luxury Bus: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బస్సు ఇదే.. ధర తెలిస్తే షాకే !
Related Stories
Recommended image1
Self Driving Car : స్టీరింగే కాదు క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ లేని కారు .. మరి డ్రైవింగ్ ఎలాాగో తెలుసా?
Recommended image2
Driving Rules: మనదేశంలో హైవేపై డ్రైవ్ చేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఇవిగో...ఇవి మీకు ఎవరూ చెప్పి ఉండరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved