కార్ల షోరూమ్‌లు త్వరలోనే మూతపడనున్నాయా..? ఆటోమొబైల్ కంపెనీలు ఏం చేయబోతున్నాయి..
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ షాపింగ్ ధోరణి వేగంగా పెరిగింది. ఈరోజుల్లో చాలా మంది కార్లు వంటి ఖరీదైన వాటి కోసం కూడా ఆన్‌లైన్‌లో షాపింగ్(online shopping) చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఒక వ్యక్తి టెస్ట్ డ్రైవ్ లేకుండా కారు కొనేవాడు కాదు.
కానీ కొత్త ట్రెండ్ చూసి జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్(honda motor) కూడా కార్ల ఆన్‌లైన్ సేల్ సర్వీసును ప్రారంభించింది. దీంతో ఇప్పుడు కార్ డీలర్ల పాత్రపై సందేహాలు రేకెత్తించింది. ఇప్పటి వరకు కార్ల అమ్మకాలు డీలర్ల ద్వారా మాత్రమే జరుగుతున్నాయి.
హోండా ఈ నెల అక్టోబర్ 4న నచ్చిన మోడల్ కార్లను ఎంచుకునే సౌలభ్యం, ధర స్మార్ట్‌ఫోన్ ద్వారానే కొనుగోలు చేసే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. హోండా కంపెనీ కార్ల ఆన్‌లైన్ సేల్స్(online sales) ప్రారంభించిన మొదటి జపనీస్ కంపెనీగా అవతరించింది. కంపెనీ ప్రకటన ప్రకారం, ప్రస్తుతం ఈ సర్వీస్ టోక్యో నగరంలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ క్రమంగా ఈ సర్వీస్ జపాన్ లోని ఇతర నగరాల్లో కూడా విస్తరించవచ్చు.
డీలర్ల వద్దకు వెళ్లడానికి ఇష్టపడని కొత్త జనరేషన్ కొనుగోలుదారులకు ఈ సర్వీస్ సులభతరం చేస్తుందని హోండా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. "యంగ్ షాపర్స్ లో ఆన్‌లైన్ షాపింగ్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది" అని పరిశోధనా సంస్థ ఇటోచు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సీనియర్ ఫెలో సంషిరో ఫుకావో అన్నారు. చాలా మంది యువ కొనుగోలుదారులకు డీలర్ల వద్దకు వెళ్లి అక్కడ ధర కోసం బేరసారాలు చేయడం ఇష్టం లేదని చెప్పారు. ఈ కొత్త ఆలోచన కార్ల తయారీదారులకు ఒక సవాలు అని ఆయన అన్నారు. యువ కొనుగోలుదారులకు అతుకులు లేని డిజిటల్ సేవ()ను ఎలా అందించాలో వారు నిర్ణయించుకోవాలి.
నిస్సాన్, టాటా కూడా అదే మార్గంలో
నిక్కీ ఆసియా వెబ్‌సైట్ ప్రకారం మరికొన్ని కంపెనీలు కూడా హోండాను అనుసరించబోతున్నాయి. నిస్సాన్ మోటార్ ఈ శీతాకాలంలో కొత్త ఎస్‌యూవీని పరిచయం చేయబోతోంది, దీనిని జపాన్‌లో ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. టయోటా మోటార్ గత ఫిబ్రవరిలో మాత్రమే యూఎస్ లో అటువంటి సేవను ప్రారంభించింది. టెస్లా కంపెనీ అంతకు ముందు అమెరికాలో ఈ సర్వీస్ ప్రారంభించింది. ఈ కొత్త ధోరణిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు వారి డీలర్‌షిప్‌లను తగ్గించడం ప్రారంభించాయి.
యుఎస్ నగరమైన ఫీనిక్స్‌లో ఉన్న కన్సల్టెంట్ జేక్ సెలిగర్ ప్రకారం ఇంట్లో కూర్చుని ల్యాప్‌టాప్ నుండి కారు కొనడం సులభమైన ప్రక్రియ. కేవలం మీరు ఒక ఫారమ్ నింపితే కొన్ని వారాలలోనే కారు మీ ఇంటికి డెలివరీ అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆన్‌లైన్ కార్ల విక్రయాలలో టెస్లా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. టెస్లా సిఈఓ ఎలోన్ మాస్క్ 2019లోనే ఈ చొరవ తీసుకున్నాడు. అతను టెస్లా అన్ని షోరూమ్‌లను మూసివేసి ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయిస్తుందని చెప్పారు. నిజానికి గత ఏడాది డిసెంబర్‌లో ఆన్‌లైన్ విక్రయాలను ప్రారంభించింది.