కియా, స్కోడాకి పోటీగా హోండా లేటెస్ట్ క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీ.. మీకు తెలియని 15 ఫీచర్స్ ఇవే..

First Published Feb 18, 2021, 5:30 PM IST

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా చివరకి  జపాన్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడవ జనరేషన్   హోండా హెచ్ఆర్-వి క్రాస్ఓవర్ ఎస్‌యూవీని ఆవిషకరించింది. హోండా హెచ్‌ఆర్-వి ఎస్‌యూవీని జపాన్, చైనాలో వీగెల్ పేరుతో విక్రయిస్తున్నారు. దీనినిలో త్వరలో మార్కెట్లోకి  తీసుకురానున్నారు. నీ  ముందుగా దీనిని జపాన్‌లో ఆల్ న్యూ వీసెల్ గా ప్రవేశపెట్టారు. హెచ్‌ఆర్-విని భారతీయ మార్కెట్లో ఎప్పుడూ లాంచ్ చేస్తుందో సమాచారం లేనప్పటికి, దాని థర్డ్ జనరేషన్ మోడల్‌ను దేశంలో ప్రవేశపెట్టవచ్చు. 2021 హోండా హెచ్‌ఆర్-విలో బలమైన హైబ్రిడ్ సిస్టమ్ ఉంది. దీనితో పాటు, దాని డిజైన్, ఫీచర్స్ లో గణనీయమైన మార్పులు చేసింది. కొత్త హోండా హెచ్‌ఆర్-వి ఎస్‌యూవీకి సంబంధించిన 15 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.