ఇన్నోవా, క్రిస్ట కార్లకు పోటీగా హోండా కొత్త 7 సిటర్ ఎస్‌యూవి.. ఈ కారు ప్రత్యేకతలు ఇవే..
జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ కొత్త కారును భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారతదేశంలో ఎలివేట్ అనే పేరును ట్రేడ్ మార్క్ కోసం కంపెనీ ఇటీవల దరఖాస్తు చేసుకుంది.
భారత మార్కెట్లో హోండా 7 సీట్ల ఎస్‌యూవీ ఇదేనని నివేదిక పేర్కొంది. మొదట దీనిని ఇండోనేషియాలో హోండా ఎన్7ఎక్స్ కాన్సెప్ట్‌గా పరిచయం చేసింది. నివేదిక ప్రకారం, హోండా ఈ ఎస్‌యూవీని బిఆర్-వి నెక్స్ట్ జనరేషన్ పేరుతో ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే, దీని గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. భారతదేశంలో బీఆర్-వి ఎస్‌యూవీని హోండా నిలిపివేసింది. అందువల్ల కంపెనీ భారత మార్కెట్లో కొత్త ఎస్‌యూవీను తీసుకురావచ్చు, అలాగే ఈ ఎస్‌యూవి బిఆర్-వి స్థానంలో ఉంటుంది.
నివేదిక ప్రకారం, హోండా కొత్త ఎస్‌యూవీ పేటెంట్ ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోటోలు చూస్తే కొత్త 7-సీట్ల ఎస్‌యూవీ లుక్ ఖచ్చితంగా ఎన్ 7 ఎక్స్ కాన్సెప్ట్‌తో సమానంగా ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్‌ను ఆగస్టు 2021లో ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఈ ఎస్‌యూవీని 2021 చివరి నాటికి మార్కెట్లో అమ్మకానికి తీసురావొచ్చు. ప్రస్తుతం, భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు పై స్పష్టత లేదు. కానీ దీనిని 2022 సంవత్సరంలో భారత మార్కెట్లో లాంచ్ చేయవచ్చు.
ఇంటర్నెట్‌లో లీక్ అయిన ఫోటోల ప్రకారం, హోండా ఎన్ 7 ఎక్స్ ప్రొడక్షన్ వెర్షన్‌లో లభించవచ్చు. సంస్థ కొత్త సిటీ సెడాన్ కారులో కూడా ఈ వ్యవస్థను అందిస్తుంది. డ్రైవర్ బ్లైండ్ స్పాట్‌లను తగ్గించడానికి హోండా లేన్ వాచ్ సిస్టమ్ కారు ఎడమ వైపు పర్యవేక్షిస్తుంది. దీనివల్ల డ్రైవర్ కారును నడపడం చాలా సులభం చేస్తుంది, అది కూడా సురక్షితమైన పద్ధతిలో ఉంటుంది.
హోండా కొత్త 7-సీట్ల ఎస్‌యూవీకి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ హోండా సిటీ సెడాన్‌లో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 121 బిహెచ్‌పి శక్తిని, 145 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ అండ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందిస్తున్నారు. ఒక విధంగా 7 సీట్ల ఎస్‌యూవీ సిటీ సెడాన్ లాగానే ఉంటుంది. ఈ కొత్త ఎస్‌యూవీ అత్యంత విలాసవంతమైన బాడీ స్టైల్‌ను కలిగి ఉంటుందని, అన్ని రకాల రోడ్ కండిషన్స్‌పై డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని హోండా పేర్కొంది.
ఇండోనేషియాలోని విభాగంలో టొయోటా అవన్జా, డైహత్సు జెనియా, మిత్సుబిషి ఎక్స్‌పాండర్, ఇతర కార్లతో హోండా ఎలివేట్ పోటీ పడనుంది. అయితే, భారతదేశంలో ఎన్ 7 ఎక్స్ కాన్సెప్ట్ బేస్డ్ ఎస్‌యూవీని విడుదల చేయడం గురించి హోండా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ భారతీయ మార్కెట్లో లాంచ్ అయితే హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారి, ఎంజి హెక్టర్ ప్లస్ వంటి కార్లతో పోటీ పడనుంది. ప్రస్తుతం, హోండా ఇండియన్ మార్కెట్లో 5 మోడళ్లను విక్రయిస్తుంది, ఇందులో హోండా సిటీ, అమేజ్, జాజ్ అండ్ డబ్ల్యుఆర్వి ఉన్నాయి. అలాగే కంపెనీ ఈ సంవత్సరం హోండా సిటీ సెడాన్ హైబ్రిడ్ వెర్షన్‌ను విడుదల చేయబోతోంది.