MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • GST Effetcts: ఇకపై ఈ సరుకులన్నీ చవక చవక.. పేదలకు, మధ్యతరగతి వారికి పండగే

GST Effetcts: ఇకపై ఈ సరుకులన్నీ చవక చవక.. పేదలకు, మధ్యతరగతి వారికి పండగే

మోడీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.  నిత్యావసర వస్తువులు, సేవలపై జీఎస్టీని తొలగించింది.  దీంతో అనేక వస్తువులపై ఇకపై జీఎస్టీ ఉండదు. దీని వల్ల సామాన్య ప్రజలకు ఖర్చులు తగ్గుతాయి. పేదలు, మధ్యతరగతి వారి జీవితం మరింత సులువుగా మారుతుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 04 2025, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జీఎస్టీలో మార్పులు
Image Credit : google

జీఎస్టీలో మార్పులు

భారత ప్రజలకు మోడీ ప్రభుత్వం పెద్ద కానుకను ఇచ్చింది. దసరా, దీపావళి పండుగులకు ప్రజలు ఇక ఆనందంగా సిద్ధమైపోవచ్చు. ఎందుకంటే పేదలకు, మధ్యతరగతి వారికి అత్యవసరమైన నిత్యావసర వస్తువులు, సేవలపై జీఎస్టీని పూర్తిగా తొలగించింది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీని వల్ల పాలు, పనీర్, రొట్టె, చపాతీ, విద్యా సామాగ్రి, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై ఇకపై జీఎస్టీ ఉండదు. పేదల కూడా ఇకపై ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినవచ్చు. సంతోషంగా జీవించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మోడీ ప్రభుత్వం
Image Credit : PTI

మోడీ ప్రభుత్వం

జీఎస్టీ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జీఎస్టీ పన్ను శాతాల్లో ఎన్నో మార్పులు చేశారు. గతంలో 5 శాతం పన్ను విధించిన పాలు, పెరుగు, పనీర్ వంటి వాటిపై ఇకపై జీఎస్టీ ఉండదు. రొట్టె, చపాతీ వంటి భారతీయ ఆహార పదార్థాలు కూడా పన్ను మినహాయింపు పొందాయి. ఇంకా ఎన్నో ఆహారాలపై జీఎస్టీ ఉండదు. ఆహారంపై పన్ను తీసేయడం వల్ల ఎంతో మంది ఆహారానికి లోటు లేకుండా జీవించే అవకాశం ఉంది.

Related Articles

Related image1
జీఎస్టీ సంస్కరణలు: కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయా? ఎంత మేరకు?
35
నిత్యావసర వస్తువులకు నో పన్ను
Image Credit : Pixabay

నిత్యావసర వస్తువులకు నో పన్ను

మనదేశంలో చదువుకు ఎంతో విలువ ఉంది. అందుకే నోటు పుస్తకాలు, పెన్సిల్, ఎరేజర్, షార్పనర్ వంటి స్టేషనరీ వస్తువులపై కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు. వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా పన్నులేకుండా చేశారు.  మ్యాప్‌లు, చార్టులు, గ్లోబ్‌లు, మందులు వంటి వాటిని ఇకపై తక్కువ ధరకే లభిస్తాయి.

45
జీఎస్టీ రాయితీ
Image Credit : Pixabay

జీఎస్టీ రాయితీ

జీఎస్టీ కౌన్సిల్ ఈసారి ఎంతో పెద్ద నిర్ణయాలే తీసుకుందని చెప్పాలి. ఇప్పటివరకు ఉన్న 12%, 28% పన్ను స్లాబ్‌లను రద్దు చేసింది. ఇకపై వస్తువులు 5 శాతం లేదా 18 శాతం పన్ను స్లాబ్‌లలోనే ఉంటాయి. దీంతో మధ్యతరగతి ప్రజలకు కొన్ని వస్తువులు చవకగా లభించే అవకాశం పెరిగింది.

55
చిన్న వ్యాపారులకు ఊరట
Image Credit : SOCIAL MEDIA

చిన్న వ్యాపారులకు ఊరట

చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఈ జీఎస్టీ మార్పులు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి. జీఎస్టీ రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు ప్రక్రియలను సులభతరం చేస్తున్నారు. నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ మార్పులన్నీ పన్ను విధానాన్ని పారదర్శకంగా, న్యాయబద్ధంగా మార్చి, అభివృద్ధి వైపు నడిపించే ఒక పెద్ద ప్రణాళికలో భాగం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
జీఎస్టీ సంస్కరణలు: కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయా? ఎంత మేరకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved