లగ్జరీ హోమ్ లాంటి ప్రిన్స్ మహేష్ బాబు కాస్ట్లీ వానిటీ వ్యాన్.. దీనిలో సౌకర్యాలు, ధర తెలిస్తే షాకవ్వాల్సిందే
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపు సంపాదించుకున్నాడు. మహేష్ తన కెరీర్‌లో ఇప్పటివరకు అరుదైన చిత్రాలతో పాటు బ్లాక్ బుస్టర్ సినామాలను అందించాడు.
మహేష్ బాబు భార్య నటి నమ్రతా శిరోద్కర్ హిందీ చిత్రాల తర్వాత ప్రధాన పాత్రలో తెలుగు చిత్రం 'వంశీ'లో తొలిసారి మహేష్ బాబుతో నటించింది. మహేష్ బాబు సౌత్ ఇండస్ట్రిలో అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్ స్టార్లలో ఒకరు. అయితే అతనికి సొంత లగ్జరీ వానిటీ వ్యాన్ కూడా ఉంది. ఈ వ్యాన్ ఖరీదు, ధరకి సంబంధించిన ప్రత్యేక విషయాలు ఎప్పటివరకు మీరు చూసి ఉండరు..
మహేష్ బాబు వానిటీ వ్యాన్ ప్రతిఒక్క సౌకర్యాలతో నిండి ఉంటుంది. ఇందులో బాత్రూమ్, టీవీ, స్టైలిష్ సిట్టింగ్ ఏరియా, కిచెన్ అనేక ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు లగ్జరీ వ్యాన్ ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఈ వ్యాన్ ఇతర వానిటీ వ్యాన్లతో పోలిస్తే సూపర్ ఫాన్సీగా కనిపిస్తుంది. దీనిని చూస్తే మహేష్ బాబుకి తన జీవితాన్ని కింగ్ సైజ్ లాగా జీవించడం ఇష్టమని తెలుస్తుంది.
మహేష్ బాబు వానిటీ వ్యాన్ విలువ సుమారు రూ .6.02 కోట్లు. అతను 2013లో వచ్చిన 'సీతమ్మ వకిట్లో సిరిమలే చెట్టు' చిత్రం సందర్భంగా ఈ వ్యాన్ కొన్నాడు. మహేష్ బాబు తన ఇంటి కంటే ఎక్కువ సమయం గడిపేది ఈ వానిటీ వ్యాన్ లోనే. మహేష్ బాబు షూటింగ్ సమయంలో ఎక్కువగా ఇందులోనే రిలాక్స్ అవుతుంటారు.
మహేష్ బాబు ఈ వానిటీ వ్యాన్లో రెండు బెడ్ రూములు ఉన్నాయి. ఫోటోలో చూసినట్లు ఇది మహేష్ వ్యక్తిగత బెడ్ రూమ్. దానిలో ఉన్న టీవీ సెట్ కూడా సాధారణమైనది కాదు. ఇది శాటిలైట్ టెలివిజన్, దీని ద్వారా ఇంటర్నెట్‌ను ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు. ఏ దేశ ఛానెల్‌లైన ఇక్కడ చూడవచ్చు. మహేష్ బాబు ప్రత్యేక కోరిక మేరకు ఈ టెలివిజన్ అమర్చారు.
మీరు ఈ వానిటీ వ్యాన్ లో ప్రయాణన్ని ఒక విలాసవంతమైన ఇంటితో పోల్చవచ్చు. దీనితో పాటు మీరు మహేష్ బాబు మేకప్ కుర్చీని కూడా ఫోటోలో చూడవచ్చు. వానిటీ వ్యాన్ లోని ఈ భాగాన్ని గ్రీన్ రూమ్ అని పిలుస్తారు.మహేష్ బాబు తనకు నచ్చిన విధంగా దీనిని రూపొందించారు. వానిటీ వ్యాన్ ని 'కారవాన్' అని కూడా పిలుస్తారు. మహేష్ బాబు వానిటీ వ్యాన్ లో తన కొడుకుతో ఉన్న ఫోటోలో కూడా ఇందుకో చూడవచ్చు.