ఆల్ టైమ్ ఫేమస్ ఎలక్ట్రిక్ లుక్ లో జిఎంసి హమ్మర్ వచ్చేసింది.. ఏప్రిల్ 3నుండి బుకింగ్స్ ఓపెన్..
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జిఎంసి హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 3న అందుబాటులోకి రానుంది. హమ్మర్ ప్రముఖులకు, సేలేబ్రిటీలకు మొదటి ఆప్షన్ గా ఉంటుంది. కానీ దాని ఇంజన్ ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ లుక్ లో హమ్మర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్నారు. ఈ శక్తివంతమైన వాహనం పర్యావరణానికి మేలు చేస్తుందని భావిస్తున్నారు.
బుకింగ్ ప్రారంభం
ఏప్రిల్ 3న హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ బుకింగులు కూడా అదే రోజు నుంచి ప్రారంభిస్తామని జీఎంసీ ప్రకటించింది. యుఎస్ కార్ మార్కెట్లో ఎస్‌యూవీలు, పికప్ ట్రక్కులకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో బ్యాటరీతో నడిచే వ్యక్తిగత వాహనాల కోసం చూస్తున్న వారికి హమ్మర్ ఎస్‌యూవీ ఇవి మంచి ఆప్షన్ అవుతుంది.
డిజైన్ అండ్ లుక్
హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వెనుక భాగంలో ఫ్లాట్-బెడ్ కార్గోతో రూపొందించారు. వెనుక డోర్ వద్ద ఫుల్ సైజ్ స్పేర్ విల్ ఉంటుంది. ఈ ఎస్‌యూవీ లీకైన ఫోటోలు చూస్తే హమ్మర్ ఎస్‌యూవీ ఇవి హమ్మర్ పికప్ లాగానే సి-పిల్లర్ ఉంటుందని, అయితే పొడవైన పైకప్పు, పెద్ద బాడీవర్క్‌తో వస్తుందని తెలుస్తుంది.
బ్యాటరీ అండ్ మైలేజ్
హమ్మర్ ఎస్‌యూవీలు, పికప్‌లు రెండూ ఒకే ప్లాట్‌ఫాంపై నిర్మించారు. కాబట్టి రెండిటి ఒకే శక్తి ఉంటుందని భావిస్తున్నారు. హమ్మర్ ఈవి పికప్ 1,000 హెచ్‌పి శక్తినిస్తుంది, ఇది కేవలం 3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొంది. ఈ వాహనంలోని బ్యాటరీ 560 కిలోమీటర్లకు పైగా ప్రయానిస్తుందని సంస్థ పేర్కొంది.
ప్రవేశించలేని మార్గాల్లో ప్రయాణించగలదు
హమ్మర్ ఈవి నీరు, ఎడారి, మట్టి , అసమాన రహదారుల మధ్యలో కూడా ప్రయాణించే సామర్థ్యాలను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ ఎస్‌యూవీ గురుత్వాకర్షణ కేంద్రం చాలా కింద ఉంటుంది.
ఇవి కాకుండా దీనికి అండర్బాడీ కెమెరా, క్రాబ్ మోడ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి, తద్వారా దీనిని డైగొనల్ గా కూడా ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేకమైన ఫీచర్స్ వల్ల ఈ ఎస్‌యూవీ మరోసారి బయట ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడేవారికి చాలా అద్భుతమైన వాహనంగా మారుతుంది.
హమ్మర్ పిక్-అప్ ఈవి టెస్లా నుండి రాబోయే టెస్లా సైబర్ట్రక్‌తో పోటీపడుతుంది. అలాగే హమ్మర్ ఎస్‌యూవీ వెర్షన్ ఎస్‌యూవీ విభాగంలోని వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది.