అమెరికన్, యూరోపియన్ స్టయిల్ లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌ఈ విడుదల.. కొత్త లుక్, డిజైన్ చూసారా..

First Published Mar 10, 2021, 5:19 PM IST

అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ ఫోర్డ్  పాపులర్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్  కొత్త ఎస్‌ఇ వేరియంట్‌ను బుధవారం ఇండియాలో  విడుదల చేసింది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్  ఎస్‌ఈలో  పెద్ద మార్పు ఏమిటంటే కారు వెనుక భాగంలో  అమర్చిన  స్టెప్ని వీల్ ను తొలగించింది. ఇప్పుడు ఈ స్థానంలో కారు టైర్  పంక్చర్ రిపేర్ కిట్ వస్తుంది, అవసరమైతే టైర్ తొలగించకుండానే పంక్చర్ చేయవచ్చు.