మహీంద్రా థార్ vs ఫోర్స్ గూర్ఖా : ఏది పవర్ ఫుల్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ, ఫీచర్లు, ధర, తేడాలు తెలుసుకోండి
ఫోర్స్ మోటార్స్ కొత్త జనరేషన్ గుర్ఖా ఎస్‌యూవీని విడుదల చేసిన సంగతి మీకు తెలిసిందే. సరికొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .13.59 లక్షలు. అయితే ఈ ఎస్‌యూవి ఒక స్ట్రాంగ్ ఆఫ్-రోడర్‌గా గుర్తింపు పొందింది.
కొత్త గూర్ఖా ఎస్‌యూవీ దేశీయ ఆటోమోబైల్ దిగ్గజం మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ థార్ వంటి ఆఫ్-రోడర్ ఎస్‌యూవీకి పోటీగా తీసుకొచ్చారు. మరోవైపు మహీంద్ర థార్ కూడా భారతీయ మార్కెట్‌లో ఒక పాపులర్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవిగా పేరు పొందింది.
ఫోర్స్ గుర్ఖా, మహీంద్రా థార్ రెండూ బడ్జెట్ లైఫ్ స్టయిల్ ఎస్‌యూవి విభాగంలోకి వస్తాయి. ఈ రెండు ఎస్‌యూవిలు కఠినమైన ఆఫ్-రోడింగ్ సామర్ధ్యన్ని కలిగి ఉంది. ఇంకా రూ. 20 లక్షల కంటే తక్కువ ధరకే లభిస్తాయి.
మహీంద్రా థార్ 2020 సంవత్సరం చివరిలో కొత్త జనరేషన్ అప్‌డేట్‌తో లాంచ్ చేశారు. మహీంద్ర కొత్త థార్ కొనుగోలుదారుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ ఎస్‌యూవి వెయిటింగ్ పీరియడ్ 12 నెలల మార్కును కంటే దాటింది. ఫీచర్లు, ధర, శక్తి పరంగా కొత్త మహీంద్రా థార్ అలాగే కొత్త జనరేషన్ ఫోర్స్ గుర్ఖా 2021 మధ్య ముఖ్యమైన తేడాలు గురించి మీకోసం...
థార్ vs ఫోర్స్ : సైజ్
కొత్త ఫోర్స్ గుర్ఖా 2021 ఎస్‌యూవి 4,116ఎంఎం పొడవు, 1,812 ఎంఎం వెడల్పు, 2,075 ఎంఎం ఎత్తు, 2,400 ఎంఎం వీల్‌బేస్ ఉంటుంది. మరోవైపు మహీంద్రా థార్ 3,985 ఎంఎం పొడవు, 1,855 ఎంఎం వెడల్పు, 1,920 ఎంఎం ఎత్తు, 2,450 ఎంఎం వీల్‌బేస్ పొందుతుంది. దీని అర్థం కొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవి మహీంద్రా థార్ కంటే పొడవుగా, ఎత్తు ఉంటుంది. అయితే మహీంద్రా ఎస్‌యూవి కొంచెం వెడల్పుగా ఉంటుంది ఇంకా కొంచెం పొడవైన వీల్‌బేస్‌తో వస్తుంది.
మరోవైపు మహీంద్రా థార్ కూడా ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఇంకా పాత మోడల్‌కి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త ఫ్రంట్ లుక్ ఈ ఎస్‌యూవిని చాలా ఆకర్షణీయంగా చేస్తాయి.
లుక్ అండ్ డిజైన్‌లో తేడా ఏమిటి
కొత్త ఫోర్స్ గూర్ఖా పాత మోడల్ కంటే మరింత ఆకర్షణీయంగా ఉండే కొత్త డిజైన్‌తో పరిచయం చేశారు. అయితే గూర్ఖా ఎస్‌యూవి ఒరిజినల్ సిల్హౌట్ అలాగే ఉంచారు. దీనికి ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్‌లతో గుండ్రటి ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లను ఇచ్చారు. ఫ్రంట్ ప్రొఫైల్ పెద్దగా ఇంకా అప్‌డేట్ చేసిన రేడియేటర్ గ్రిల్, బంపర్‌ను పొందుతుంది. క్లామ్‌షెల్ బోనెట్, హై-మౌంటెడ్ స్నోర్కెల్ అవుట్‌గోయింగ్ మోడల్‌ని పోలి ఉంటుంది.
థార్ vs ఫోర్స్ : క్యాబిన్, ఫీచర్స్ లో తేడా ఏంటి ?
2021 ఫోర్స్ గుర్ఖా క్యాబిన్, ఫీచర్‌లు కూడా అప్‌డేట్ చేశారు. సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ లభిస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇవి ఖచ్చితంగా క్యాబిన్ ఆకర్షణను పెంచుతాయి. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్ లో ఎన్నో ఫీచర్లను ఇచ్చారు. దీనిలో నాలుగు స్పీకర్‌లు, పవర్ విండోస్, డ్యూయల్ యుఎస్‌బి ఛార్జింగ్ పాయింట్స్, టిపిఎంఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి మరిన్ని ఫీచర్లను పొందుతుంది.
మరోవైపు, కొత్త మహీంద్రా థార్ గుర్ఖా , థార్ పాత వెర్షన్‌ల కంటే క్యాబిన్ లోపల మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనికి స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీతో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను పొందుతుంది. మహీంద్రా థార్ క్యాబిన్ లోపల స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియల్ టైమ్ అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ డిస్‌ప్లే, ఎలక్ట్రిక్ ఓఆర్‌విఎంలు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
థార్ vs ఫోర్స్ : ఇంజన్
కొత్త ఫోర్స్ గుర్ఖా బిఎస్6 ఎస్‌యూవిలో 2.6 లీటర్ డీజిల్ ఇంజిన్ ఇచ్చారు. ఈ ఇంజన్ 90బిహెచ్‌పి శక్తిని, 250ఎన్‌ఎం టార్క్‌ను 1400ఆర్‌పిఎం నుండి 2400ఆర్‌పిఎం మధ్య ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మెర్సిడెస్ జి-28 గేర్‌బాక్స్‌తో హైడ్రాలిక్ యాక్చుయేటెడ్ క్లచ్, కేబుల్ షిఫ్ట్‌తో జతచేశారు. ఈ ఇంజిన్ ఏడబల్యూడి (ఆల్-వీల్-డ్రైవ్) సిస్టమ్, ముందు ఇంకా బ్యాక్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌తో లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేసుతో వస్తుంది.
మరోవైపు మహీంద్రా థార్ పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో వస్తుంది. ఈ ఎస్‌యూవి 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది. రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ మాన్యువల్ అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తుంది. పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్, 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
మహీంద్రా థార్ ఖచ్చితంగా ఫోర్స్ గూర్ఖా కంటే శక్తివంతమైనది ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ దాని ఆకర్షణను మరింత పెంచుతుంది. రెండు ఎస్‌యూవిలు 4x4 టెక్నాలజీతో వస్తాయి. అయితే, థార్ వాటర్ వెడ్డింగ్ సామర్థ్యం ఫోర్స్ గుర్ఖా కంటే తక్కువగా ఉంది.
థార్ vs ఫోర్స్ ధరలో తేడా ఏమిటి
మహీంద్రా థార్ పెట్రోల్ , డీజిల్ వెర్షన్ లో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ధర రూ .12.78 లక్షల నుండి రూ .14.88 లక్షల మధ్య ఉంది. మరోవైపు, డీజిల్ థార్ రూ .12.98 లక్షల ధర వద్ద అందుబాటులో ఉంది, టాప్-ఎండ్ వేరియంట్‌కు రూ .15.08 లక్షల వరకు ఉంది. కొత్త ఫోర్స్ గుర్ఖా డీజిల్ ఇంజిన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, దీని ధర రూ .13.59 లక్షలు.