ఖరీదైన కార్లు, 3.5 కోట్ల వాచీ ధరించిన ఈ ఫుట్ బాల్ ప్లేయర్ లగ్జరీ లైఫ్, సంపద గురించి తెలిస్తే షాకవుతారు..
ఫుట్‌బాల్ అయినా క్రికెట్ అయినా క్రీడల్లో చాలా డబ్బు సంపాదించవచ్చని చెబుతుంటారు. మీకు కూడా స్పొర్ట్స్ లో టాలెంట్ ఉంటే అందులో మీరు మీ ప్రతిభను కనబరిస్తే లక్షాధికారి కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక ఫుట్‌బాల్ గురించి మాట్లాడితే క్రిస్టియానో రొనాల్డో మీకు తెలిసే ఉంటుంది.
క్రిస్టియానో రొనాల్డో ఒక గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ అంతేకాదు విలాసవంతమైన లైఫ్ స్టాయిల్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గత సంవత్సరంలో అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'లా వోయిచర్ నోయిర్' కారును కొనుగోలు చేశాడు, దీని విలువ సుమారు 75 కోట్లు. ఈ కారు స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ బుగట్టికి చెందినది. ఇది ఇప్పటివరకు ఉన్న అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారు. ఇంత కార్చు చేసి కారును కొన్న ఈ పాపులర్ ప్లేయర్ సంపద, అతని జీవన విధానం గురించి తెలుసుకుందాం ...
క్రిస్టియానో రొనాల్డోకి చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. 2019 సంవత్సరంలో అతను బుగట్టి షిరోన్‌ను సుమారు 21 కోట్ల రూపాయలకు కొన్నాడు. ఇవే కాకుండా మెర్సిడెస్ సి క్లాస్ స్పోర్ట్ కూపే, ఆస్టన్ మార్టిన్, లంబోర్ఘిని అవెంటడార్ ఎల్పి 700-4, మెక్లారెన్ ఎంపి 4 12సి, బెంట్లీ కాంటినెంటల్ జిటిసి స్పీడ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఫెరారీ 599 జిటిఓ వంటి కాస్ట్లీ కార్లు కూడా ఉన్నాయి.
రొనాల్డోకి ఖరీదైన కార్లు మాత్రమే కాదు ఖరీదైన వాచీలు ధరించడం కూడా చాలా ఇష్టం. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన 14వ అంతర్జాతీయ క్రీడా సదస్సులో ఆయన రోలెక్స్ జిఎంటి మాస్టర్ ఐస్ మోడల్ వాచ్ ధరించి కనిపించారు, దీని విలువ రూ .3.5 కోట్లు. అసలు విషయం ఏంటంటే ఈ వాచీ వజ్రాలతో నిండి ఉంది.
క్రిస్టియానో రొనాల్డోకి విలాసవంతమైన ఇల్లులు కూడా ఉన్నాయి. స్పెయిన్ దేశంలో ఆయనకు అద్భుతమైన ఇల్లు ఉంది, దీని విలువ సుమారు 10 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఇటలీలోని టురిన్ నగరంలో కూడా ఒక లగ్జరీ ఇల్లు ఉంది, అతను 2018 సంవత్సరంలో దీనిని కొనుగోలు చేశాడు. పోర్చుగల్‌లో ఆయనకు 57 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. ఈ ఇంటి నుండి బయటికి చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
రొనాల్డోకు సొంత ప్రైవేట్ జెట్ కూడా ఉంది, అతను సుమారు 150 కోట్ల రూపాయలకు దీనిని కొనుగోలు చేశాడు. అతను సాధారణంగా ఐరోపాలో ప్రయాణించడానికి ఈ ప్రైవేట్ జెట్‌ను ఉపయోగిస్తాడు. ఈ ప్రైవేట్ జెట్ లో సోఫాలు, గదులు, టెలిఫోన్లు, ఫ్యాక్స్ మెషిన్లు, ఫ్రిజ్‌లు, అలమారాలు, పూర్తి డిజైనర్ బట్టలు మొదలైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
రొనాల్డోకి షిప్ కూడా ఉంది. 88 అడుగుల పొడవున్న ఈ షిప్ లో బెడ్ రూం నుండి బాత్రూమ్ వరకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ షిప్ ని 2019లో సుమారు 54 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు.
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన ఫుట్ బాల్ ఆటగాళ్ళలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే అతనికి ఇంకా వివాహం కాలేదు. అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు(ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు). ఈ కుమార్తెలలో ఒకరి తల్లి అతని భాగస్వామి జార్జినా రోడ్రిగెజ్.