MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • EV Insurance : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు EV ఇన్సూరెన్స్ గురించి అసలు నిజాలు తెలియాల్సిందే

EV Insurance : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు EV ఇన్సూరెన్స్ గురించి అసలు నిజాలు తెలియాల్సిందే

సాధారణ వాహనాలు ఇన్సూరెన్స్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణాలేంటో తెలుసుకొండి, వివిధ కంపెనీల ప్లాన్లను పోల్చి చూశాకే నిర్ణయం తీసుకొండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 22 2026, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియాలో EV వాహనాలకు యమ క్రేజ్
Image Credit : Gemini ai

ఇండియాలో EV వాహనాలకు యమ క్రేజ్

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు ఈవి వాహనాలకు షిప్ట్ అవుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణ హితం కావడం కూడా EVల వాడకం పెరగడానికి మరో కారణం. అయితే కొత్త EV కారు కొనాలనుకునే వారిని ఇన్సూరెన్స్ ప్రీమియం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈవి కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉండటానికి కారణాలివే..
Image Credit : Cardekho

ఈవి కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉండటానికి కారణాలివే..

EV వాహనాల్లో అసలు ఖర్చు బ్యాటరీదే

ఎలక్ట్రిక్ కారులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీనే. కొన్ని మోడళ్లలో కారు మొత్తం ధరలో 30 నుంచి 50 శాతం బ్యాటరీదే ఉంటుంది. ప్రమాదాలు, వరదలు, మంటలు, షార్ట్ సర్క్యూట్ వంటి కారణాలతో బ్యాటరీ దెబ్బతింటే దాన్ని బాగుచేయించడానికి లేదా మార్చడానికి లక్షల్లో ఖర్చవుతుంది. ఈ రిస్క్‌ను దృష్టిలో పెట్టుకునే ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయి.

EV కారు రిపేర్ ఖర్చులు కూడా ఎక్కువే

ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, సెన్సర్లు, కంట్రోల్ యూనిట్లు, సాఫ్ట్‌వేర్ ఉంటాయి. వీటి రిపేర్లకు ప్రత్యేక శిక్షణ పొందిన టెక్నీషియన్లు, ప్రత్యేక సర్వీస్ సెంటర్లు అవసరం. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి సౌకర్యాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే రిపేర్ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగడానికి ఒక కారణం.

35
బ్యాటరీ ప్రొటెక్షన్ కవర్ తప్పనిసరిగా చూసుకోండి
Image Credit : TATA MOTORS

బ్యాటరీ ప్రొటెక్షన్ కవర్ తప్పనిసరిగా చూసుకోండి

ఎలక్ట్రిక్ కారు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు 'బ్యాటరీ ప్రొటెక్షన్ కవర్' యాడ్-ఆన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రమాదం, వరదలు, మంటలు, షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర ఎలక్ట్రికల్ సమస్యల వల్ల బ్యాటరీ పాడైతే ఈ కవర్ ఆర్థికంగా ఆదుకుంటుంది. భవిష్యత్తులో బ్యాటరీ ప్రాబ్లమ్స్ వల్ల లక్షల్లో అయ్యే ఊహించని ఖర్చుల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.

45
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా ముఖ్యమే
Image Credit : AFP

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా ముఖ్యమే

దూర ప్రయాణాల్లో ఉన్నప్పుడు కారు బ్యాటరీ అయిపోవచ్చు, దగ్గర్లో ఛార్జింగ్ స్టేషన్ లేకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఇబ్బందిపడకుండా 'రోడ్‌సైడ్ అసిస్టెన్స్' చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా టోయింగ్ సర్వీస్, అత్యవసర సహాయం, దగ్గర్లోని ఛార్జింగ్ స్టేషన్ లేదా సర్వీస్ సెంటర్‌కు వాహనాన్ని తరలించడం వంటి సేవలు పొందవచ్చు.

55
ప్రీమియం తక్కువని పాలసీ తీసుకోవద్దు
Image Credit : stockPhoto

ప్రీమియం తక్కువని పాలసీ తీసుకోవద్దు

చాలామంది తక్కువ ప్రీమియం చూసి ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకుంటారు. కానీ తర్వాత అవసరమైన కవరేజీలు పాలసీలో లేవని తెలుసుని బాధపడుతుంటారు. అందుకే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ధర మాత్రమే కాకుండా లభించే కవరేజీని కూడా వివరంగా చెక్ చేసుకోవాలి. బ్యాటరీ ప్రొటెక్షన్, జీరో డిప్రిసియేషన్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఎలక్ట్రికల్ పార్ట్స్ కవరేజ్, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించే పాలసీని ఎంచుకోవడం ఉత్తమం.

కొత్త ఎలక్ట్రిక్ కారు కొనే ముందు, వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలను పోల్చి చూడటం మంచిది. కవరేజ్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రికార్డ్, యాడ్-ఆన్ ప్రయోజనాలు, ప్రీమియం వంటివి అంచనా వేసిన తర్వాతే సరైన పాలసీని ఎంచుకోవాలి. ఇది భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Budget Cars: పండగ సేల్... చాలా తక్కువ ధరకే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్న టాప్ 5 కార్లు
Recommended image2
Car Offers : అక్టోబర్ లో ఈ కారు కొంటే.. ఏకంగా రూ.2.34 లక్షలు సేవ్
Recommended image3
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Related Stories
Recommended image1
Maruti EV: టాటాకు మారుతి టెన్షన్... మార్కెట్లోకి సుజికి బుజ్జి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే మైలేజ్ మీ ఇష్టం
Recommended image2
Best 7 Seater EV : ఫుల్ ఛార్జ్ చేస్తే 679 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. బెస్ట్ 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved