టేస్లాకు కలిసొచ్చిన కరోనా కాలం.. గత ఏడాది కంటే భారీగా పెరిగిన లాభాలు..
ప్రపంచంలోని అత్యంత విలువైన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తన వార్షిక లాభాన్ని బుధవారం నివేదించింది. ఎలోన్ మస్క్ యజమాన్యంలోని ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టేస్లా నాల్గవ త్రైమాసికంలో షేర్లు పడిపోవడంతో తక్కువ ఆదాయాలను నమోదు చేశాయి.
టెస్లా కంపెనీ ఉత్పత్తి, డెలివరీలను కరోనా వైరస్ ప్రభావితం చేసినప్పటికీ, 2020 లో కంపెనీ 721 మిలియన్ డాలర్ల లాభాలను నివేదించింది. టెస్లా 2019 సంవత్సరంలో 862 మిలియన్ల నష్టాన్ని నివేదించింది. టెస్లా ఆదాయం 2020లో 28 శాతం పెరిగి 31.5 బిలియన్లకు చేరుకుంది.
2020 కంపెనీకి చాలా ముఖ్యమైన సంవత్సరం అని, అయితే 2021 మరింత ముఖ్యమైనదని టెస్లా తెలిపింది. టేస్లా కంపెనీ చైనా కర్మాగారంలో ఉత్పత్తిని కూడా పెంచనుంది, అలాగే జర్మనీ, టెక్సాస్ లో నిర్మించబోయే కొత్త ప్లాంట్లులో మొదటి ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశిచనుంది.
ఈ ఏడాదిలోని చివరి నాల్గవ త్రైమాసికంలో కంపెనీ 270 మిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేసింది, ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 157 శాతం ఎక్కువ. సేల్స్ లేదా లాభాలపై 2021 సూచనలను కంపెనీ అందించలేదు.
ఈ ఏడాది వాహనాల డెలివరీలలో సగటున 50 శాతం పెరుగుదల ఉంటుందని టెస్లా ఆశిస్తోంది. అలాగే, కంపెనీ 2021 లో మనం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.