ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎవ్వరూ దొంగించలేరు.. డ్యూయల్ బ్యాటరీతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
భారతీయ వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా పలు కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేశాయి. ఇప్పుడు మరో వాహన తయారీ సంస్థ ఈబైక్ గో(eBikeGo) సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈబైక్ గో బుధవారం భారతీయ మార్కెట్లో జిఐ1 అండ్ జి1ప్లస్ అనే రెండు వేరియంట్లలో రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
కంపెనీ జి1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .79,999 కాగా, జి1ప్లస్ వేరియంట్ ధర రూ .89,999. రెండు స్కూటర్ల ధరపై ఫేమ్ II సబ్సిడీ ఉంటుంది. అయితే రాష్ట్ర స్థాయి సబ్సిడీని అమలు చేసిన తర్వాత దీని ధరలు మరింత తగ్గుతాయి. ఆకర్షణీయమైన లుక్, బలమైన బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు ఈ స్కూటర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రూ. 499 రీఫండబుల్ మొత్తాన్ని చెల్లించి ఇ-స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రకారం ఒకవేళ బుకింగ్ రద్దు చేస్తే డబ్బు తిరిగి ఇవ్వనుంది.
బ్యాటరీ అండ్ రేంజ్
రగ్గడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 kWh రెండు బ్యాటరీలను పొందుతుంది, దాని రిప్లేస్ చేయవచ్చు. ఇంకా 4జితో అధునాతన IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సిస్టమ్‌తో వస్తుంది. బ్యాటరీని 3.5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు, పూర్తి ఛార్జ్‌లో దాదాపు 160 కి.మీల వరకు ప్రయాణించవచ్చు అని ఈబైక్ గో పేర్కొంది. ప్రత్యేక విషయం ఏమిటంటే రిమూవబుల్ బ్యాటరీని మార్చడానికి ఒక నిమిషం మాత్రమే పడుతుంది.
టాప్ స్పీడ్
ఈబైక్ గో రగ్గడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3kW మోటార్‌ను పొందుతుంది. దీని సహాయంతో ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 70 కి.మీ. ఈబైక్ గో ఫౌండేర్ అండ్ సిఈఓ ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ, "కఠినమైన అధ్యయనం, మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారతదేశంలో అత్యంత మన్నికైన, బలమైన ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్‌ని విడుదల చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 30 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది. అంతేకాకుండా యాంటీ తెఫ్ట్ ఫీచర్ కూడ ఉంది. ఈ స్కూటర్‌ను మొబైల్ యాప్ ద్వారా అన్‌లాక్ చేయవచ్చు అలాగే రిమోట్‌గా లాక్ చేయవచ్చు. దీని కోసం కంపెనీ ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. ఇందులో 12 రకాల సెన్సార్లు ఉన్నాయి. 4జి, బిఎల్‌ఈ, సిఏఎన్ బస్, జిపిఎస్/ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్, 42 ఇన్‌పుట్‌లు/అవుట్‌పుట్‌లు, సీరియల్ పోర్ట్‌లు, కంప్రెహెన్సివ్ మాడ్యులర్ సెన్సార్ సూట్‌తో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన 2W IoT సిస్టం అందించినట్లు కంపెనీ తెలిపింది.
7 సంవత్సరాల వారంటీ
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో రూపొందించి తయారు చేయబడింది. దేశంలో అన్ని రకాల కఠినమైన రోడ్డు పరిస్థితులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొంది. ఇ-స్కూటర్ పై ఏడు సంవత్సరాల వారంటీని కూడా ఇస్తోంది.
రగ్గడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వెడల్పు 850 ఎంఎం, మొత్తం బరువులో 120 కిలోలు. ఈ ఇ-స్కూటర్ వీల్‌బేస్ 1350 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 175 ఎంఎం. దీనికి రెండు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి, ఇందులో ఎకో అండ్ పవర్ మోడ్. కంపెనీ దీనికి అల్లాయ్ వీల్స్ ఇచ్చింది. ఇంకా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) తో డిస్క్ బ్రేక్‌లను ఉంటాయి. దీనితో పాటు కంపెనీ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్, ఛార్జర్‌పై 3 సంవత్సరాల లేదా 20,000 కి.మీ వారంటీని ఇస్తోంది.