ఆనంద్ మహీంద్రాకి ట్విట్టర్ యూజర్ ఊహించని ప్రశ్న.. చిన్న స్మైల్ తో ఏమని రిప్లయ్ ఇచ్చాడో తెలుసా..
భారతదేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా(anand mahindra) సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటన్న సంగతి మీకు తెలిసిందే. అయితే తాజాగా ఆనంద్ మహీంద్రాని ఒక ట్విట్టర్ (twitter)యూజర్ ఊహించని ప్రశ్న అడిగి ఆశ్చర్యపరిచాడు. అదేంటంటే మీరు మీ సొంత కంపెనీ తయారు చేయని కార్లను నడుపుతున్నారా..? అంటూ ఆనంద్ మహీంద్రాను ట్విట్టర్ లో ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా తమిళనాడులో ఉన్న 70 హెయిర్‌పిన్ బెండ్‌లతో ఉన్న భారతదేశంలోని అత్యంత సాహసోపేతమైన పర్వత రహదారులలో ఒకటిగా ఉన్న ఉత్కంఠభరితమైన ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ. "నేను ఈ రహదారిని ఎవరు నిర్మించారో కనుక్కోవాలనుకుంటున్నాను అలాగే నన్ను దానిపైకి తీసుకెళ్లడానికి నా థార్ కారును మాత్రమే నమ్ముతాను!" అంటూ మహీంద్రా & మహీంద్రా ఆఫ్-రోడ్ ఎస్‌యూవి గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేశాడు.
అక్షత్ సోనీ అనే ట్విటర్ యూజర్ మీరు మహీంద్రా కార్లు కాకుండా వేరే కార్లు నడిపారా అని అడిగగా దీనికి ఆనంద్ మహీంద్రా చమత్కారమైన శైలిలో బదులిచ్చారు. "మీ ఉద్దేశ్యం మహీంద్రా కాకుండా వేరే కార్లు ఉన్నాయా ?? నాకు తెలియదు." అంటూ రిట్వీట్ చేశారు. దీనితో పాటు స్మైలీ ఫేస్ ఎమోజితో "జస్ట్ కిడ్డింగ్" అంటూ బదులిచ్చాడు.
ఈ ట్వీట్ కి 9,000 పైగా 'లైక్‌లు' వచ్చాయి. "డేరింగ్ మౌంటెన్ రోడ్" ఫోటోని నార్వేజియన్ దౌత్యవేత్త ఎరిక్ సోల్హీమ్ పోస్ట్ చేసారు. ట్విట్టర్‌లో ఈ ఫోటో ఎక్కువగా షేర్ చేయబడింది. ఈ రహదారికి దగ్గరగా నివసిస్తున్నట్లు తెలిపిన మరో ట్విట్టర్ యూజర్ ఆనంద్ మహీంద్రాకు తన థార్‌లో "లిఫ్ట్" ఇస్తానని చెప్పారు. దీనికి ఆనంద్ మహీంద్రా డీల్ ఒకే అంటే స్పందించారు.
ఆనంద్ మహీంద్రా చమత్కారమైన సమాధానాలతో ఫాలోవర్స్ ని రంజింపజేయడం ఇదేం మొదటిసారి కాదు. 2019లో ఆనంద్ మహీంద్రా విలాసవంతమైన ఎలక్ట్రిక్ "హైపర్‌కార్" బాటిస్టా వీడియోను షేర్ చేసినప్పుడు కూడా ఒక ట్విట్టర్ యూజర్ దాని మైలేజీ గురించి సరదాగా అడిగారు . దీనికి ఆనంద్ మహీంద్రా నుండి ఉల్లాసమైన రిప్లయ్ ఇచ్చాడు.