దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్.. అరగంటలో 50% ఛార్జ్.. ఫీచర్స్, ధర ఇవే..
కస్టమైజ్డ్ వెహికల్స్ అండ్ సౌండ్ ఇంజినీరింగ్ తయారీలో ప్రత్యేకత కలిగిన ఇన్-హౌస్ స్టార్టప్ ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ మొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ సైబోర్గ్ (cyborg)తో భారతదేశంలో ద్విచక్ర వాహనాల ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. సైబోర్గ్ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల బ్రాండ్, ఈ బైక్ పూర్తిగా కొత్త బైక్ అనుభవాన్ని అందిస్తుంది.
సైబోర్గ్ యోడా ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇంకా బ్యాటరీ ఎక్స్ ఛేంజ్ సౌకర్యంతో వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ బైక్ టెస్టింగ్ భారతదేశంలోని అత్యంత క్లిష్టమైన భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో జరిగింది.
మొదటి 'మేడ్ ఇన్ ఇండియా' ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్
కంపెనీ ప్రకారం, ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ సైబోర్గ్ (cyborg) పేరుతో మూడు ఉత్పత్తులను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బైక్ మొదటి ఫ్లాగ్‌షిప్ ప్రొడక్షన్ యోడా బైక్ తో ప్రారంభమవుతుంది, అలాగే క్రూయిజర్ తరహా మోడల్‌గా ఉంటుంది. నిర్దిష్ట సెగ్మెంట్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ యోడా బైక్ ని రూపొందించారు. యోడా బైక్ అనేది బ్యాటరీ ఎక్స్ ఛేంజ్ తో కంపెనీ మొట్టమొదటి అండ్ భారతదేశపు మొట్టమొదటి 'మేడ్ ఇన్ ఇండియా' ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. ఈ బైక్ క్రూయిజర్, రెగ్యులర్ అండ్ స్పోర్ట్స్ సెగ్మెంట్లతో ఉంటాయి.
ప్రతి కి.మీకి ఫాస్ట్ ఛార్జింగ్
సైబోర్గ్ మార్కెట్ కొనుగోలుదారుల అవసరాలను తీర్చడానికి మరో రెండు ఉత్పత్తులను కూడా విడుదల చేస్తుంది. మంచి శ్రేణి, శక్తివంతమైన మోటారు, సరసమైన ధరతో వీటిని అందిస్తుంది. బ్యాటరీ మార్పిడి స్టేషన్లతో పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్(SOS) కోసం కూడా భాగస్వాములుగా ఉన్నారు. దీనితో పాటు సైబోర్గ్ ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషన్‌ను కూడా నిర్మిస్తోంది. ఇవి ఫాస్ట్ ఛార్జింగ్‌ని అందించే కాంపాక్ట్ హోమ్ ఛార్జ్ సాకెట్. ఇక్కడ బ్యాటరీని 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. సర్వీస్ ఛార్జ్ అండ్ సప్లయి, సేవల కోసం ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా వారి ఖాతాలో డబ్బు జమ చేయబడుతుంది.
ఫీచర్లు
సైబోర్గ్ యోదా బైక్ కి ఎల్‌ఈడి టైల్‌లైట్లు, టర్న్ ఇండికేటర్‌లు, కీలెస్ ఇగ్నిషన్, యాంటీ-థెఫ్ట్ అలారం, పిల్లర్ బ్యాక్‌రెస్ట్, సైడ్ పానియర్ బాక్స్, అడ్జస్ట్ సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది. కంపెనీ ఇంకా హార్డ్‌వేర్ వివరాలను వెల్లడించలేదు. అయితే బైక్ ఫోటోలను బట్టి ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్విన్ స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్‌లను పొందుతుందని తెలిసింది.
కంపెనీ సైబోర్గ్ యోడ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ ఒక థ్రిల్లింగ్ అనుభవం అందిస్తుంది అని చెప్పారు. ఈ బ్రాండ్ భారతదేశంలో సురక్షితమైన బైక్ లను తయారు చేయడంపై దృష్టి పెడుతుంది ఇంకా బ్యాటరీ టెక్నాలజి, తయారీ ప్రక్రియలను మెరుగుపరచడానికి కొత్త మార్గాలను నిరంతరం అన్వేషిస్తుంది. అదనంగా, గురుగ్రామ్‌లోని మానేసర్‌లోని కంపెనీ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ బైక్ ల తయారీ, అసెంబ్లీ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రారంభ దశలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ 40,000 యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. బ్రాండ్ బ్యాటరీ ఇంకా బైక్ వివరాలను షేర్ చేయలేదు. అయితే ఈ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 120 కి.మీల దూరం ప్రయాణించగలదని చెప్తున్నారు.
కంపెనీ అంచనాలు
కంపెనీ వ్యవస్థాపకుడు రాఘవ్ కల్రా మాట్లాడుతూ, “మా కొత్త బ్రాండ్ సైబర్గ్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర బైక్ విభాగంలోకి మా ప్రవేశాన్ని ప్రకటిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. వాహనాలను తయారు చేయడం ఇంకా అభివృద్ధి చేయడం సైబోర్గ్ ఎలక్ట్రిక్ బైక్ తయారీకి మొదటి అడుగు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌లను తీర్చడానికి పర్యావరణ అనుకూలతను అమలు చేయడానికి అలాగే మెరుగైన పరిష్కారాలను అందించడంలో మాకు సహాయపడుతుంది. మేము మా తయారీలో కస్టమర్ సంతృప్తిని కేంద్రంగా ఉంచాము."అని అన్నారు.