సచిన్ టెండూల్కర్ గ్యారేజీలోకి మరోకొత్త కారు.. ఈ ఎక్స్ క్లుసివ్ కస్టమైజ్ కార్ ధర, సౌకర్యాలు తెలుసా..
బిఎమ్‌డబ్ల్యూ కార్లకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా తాజాగా లేటెస్ట్ 7 సిరీస్ కారును సొంతం చేసుకున్నాడు.తన పాత 7 సిరీస్ కార్ లాగానే సచిన్ ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 750ఎల్‌ఐ విత్ ఎం స్పోర్ట్ ని బిఎమ్‌డబ్ల్యూ ఇండివిజువల్ ఎక్స్ క్లుసివ్ కస్టమైజ్ తన అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు.
ఈ సంవత్సరంలో సచిన్ కొనుగోలు చేసిన రెండవ కొత్త బిఎండబల్యూ కారు ఇది, అతను ఇటీవల కస్టమైజ్ బిఎండబల్యూ ఐ8ని కూడా తన గ్యారేజీలో చేర్చారు.
బిఎమ్‌డబ్ల్యూ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త-జెన్ 7 సిరీస్‌ను లాంచ్ చేసింది. అంతకుముందు దీనిని 2016 ఆటో ఎక్స్‌పోలో దీనిని ఆవిష్కరించారు. అయితే ఈ కొత్త కారును సచిన్ స్వయంగా పరిచయం చేశారు. కొత్త జనరేషన్ మోడల్ మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం యాక్టివ్ ఏరో ఫంక్షన్‌తో వస్తుంది. ఇంకా ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, లేజర్ లైట్ హెడ్‌ల్యాంప్‌లను అందించారు. ఎం స్పోర్ట్ ప్యాకేజీతో పాటు ఈ కారుకి కొత్త స్పోర్టి ఫ్రంట్ బంపర్‌ను పొందుతుంది.
ఇతర కస్టమైజేషన్ ఫీచర్లతో పాటు బిఎమ్‌డబ్ల్యూ ఇండివిజువల్ లెటరింగ్‌తో కూడిన ఫోర్జెడ్ 20-అంగుళాల వి-స్పోక్ డిజైన్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.
క్యాబిన్ లోపల కస్టమైజేషన్ పై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే హెడ్‌రెస్ట్‌పై సచిన్ లోగోతో కస్టమ్ వైట్ లెదర్ ఇంటీరియర్‌తో వస్తుంది. టచ్ స్క్రీన్ డిస్ ప్లే, రిమోట్ కంట్రోల్ పార్కింగ్ ఆసిస్టన్స్, గెశ్చర్ కంట్రోల్ తో పాటు కొత్త డిజిటల్ అండ్ కస్టమైజబుల్ ఐడ్రైవ్ 5.0 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఈ కారు పొందుతుంది. కారు కంట్రోల్స్ తో 7 అంగుళాల తొలగించగల టాబ్లెట్, యాంబియంట్ ఎయిర్ ఫ్రెషనర్, ఇంటిగ్రేటెడ్ స్పీకర్‌తో హిటెడ్ డోర్ ప్యానెల్స్‌తో పాటు హిటెడ్ ఆర్మ్‌రెస్ట్ ఇంకా మరిన్ని ఫీచర్స్ ఈ కారులో లభిస్తాయి.
ఎం స్పోర్ట్ ప్యాకేజీతో బిఎమ్‌డబ్ల్యూ 750ఎల్‌ఐ 4.4-లీటర్ ట్విన్‌పవర్ టర్బో వి8 ఇంజిన్‌తో వస్తుంది, ఇది గరిష్టంగా 450 బిహెచ్‌పి శక్తిని, 650 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అభివృద్ధి చేస్తుంది. 8-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్ గా ఇచ్చారు, ఈ కారును గంటకు 0-100 కి.మీ వేగాన్ని కేవలం 4.7 సెకన్లలో అందుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కి.మీ.