సిఈఎస్ 2022: ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అత్యంత వినూత్నమైన టెక్నాలజి & ఆటోమొబైల్ ఉత్పత్తులు ఇవే..
రంగులు మార్చే కారు, అత్యంత ఇంధన సామర్ధ్యంగల ఎలక్ట్రిక్ వాహనం నుండి అతిపెద్ద ఓఎల్‌ఈడి, సినిమా చూపించే గ్లాసెస్ వరకు... ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ షో అయిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)-2022 లాస్ వెగాస్‌లో ప్రారంభమైంది.
ఇందులో ఫ్యూచర్ టీవీలు, రోబోలు, కార్ల నుండి ప్రతి టెక్నాలజి ఉత్పత్తి వరకు ఆశ్చర్యకరమైనవి. జనవరి 5-7 వరకు నిర్వహించనున్న సిఈఎస్ లో ఈసారి 2,200 కంటే ఎక్కువ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈ ఫ్యూచర్ గ్యాడ్జెట్స్ లో కొన్నింటికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి...
అత్యధిక మైలేజ్ ఎలక్ట్రిక్-కార్
మెర్సిడెస్ బెంజ్ కాన్సెప్ట్ కారు ఈక్యూఎక్స్ (EQX) అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ కారు అని పేర్కొన్నారు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000 కి.మీ ప్రయాణిస్తుంది. దీనిని జపనీస్ ఫోర్-డోర్ కూపే అని పిలుస్తారు. ఈ కారును కంపెనీ ఫార్ములా 1, ఫార్ములా ఈ(E) విభాగానికి చెందిన నిపుణులచే తయారు చేయబడింది. కారు కాంపాక్ట్ సైజ్ సౌర శక్తి టెక్నాలజి ఆధారంగా ఉంటుంది, 100 kWh కంటే తక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఇంధనంగా ఉంటుంది.
బటన్ నొక్కిన వెంటనే కారు రంగు మారుతుంది
బిఎమ్‌డబ్ల్యూ (BMW)సంస్థ ఒక బటన్ నొక్కడం ద్వారా రంగు మార్చే కారును పరిచయం చేసింది. ఈ డిజిటల్ పేపర్ ఆధారిత ఈ-లింక్ టెక్నాలజి Kindle లేదా Kobo వంటి ఇ-రీడర్‌లలో ఉపయోగించబడుతుంది. ఐఎక్స్ ఇ-కార్‌లోని వినూత్న పెయింట్ స్కీమ్ కలర్ ఛేంజ్ ఆప్షన్ అని తెలిపింది. ఈ కారు ప్రారంభ దశలో ఉంది అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో లేదు. ఈ షో సమయంలో తెలుపు రంగులో ఉన్న కారు ఒక బటన్‌ను నొక్కిన వెంటనే బూడిద రంగులోకి మారుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఓఎల్‌ఈడి టివి
ఎల్‌జి సిఈఎస్ లో 97 అంగుళాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఓఎల్‌ఈడి టివిని ఆవిష్కరించింది. సన్నని, తేలికపాటి స్క్రీన్ టీవీలు మెరుగైన పిక్చర్ క్వాలిటీ, ఎక్కువ బ్రైట్ నెస్ అందిస్తాయి. దీనిలో ప్రతి పిక్సెల్ స్వంత లైట్ సోర్స్ కలిగి ఉంటుంది, తద్వారా ఇతర కాంతి అవసరం లేదు. డిమాండ్‌కు అనుగుణంగా 11 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
జెయింట్ కాఫీ టేబుల్ గేమ్ టాబ్లెట్
ఆర్కేడ్-1 అప్స్ రెట్రో గేమ్స్ క్యాబినెట్స్ నుండి వర్చువల్ పిన్‌బాల్ టేబుల్‌ల వరకు అన్నింటినీ సంవత్సరాలుగా పరిచయం చేస్తూ వస్తుంది. ఈసారి సిఈఎస్ లో గేమ్స్ వైపు దృష్టి సారించే పెద్ద ఉత్పత్తిని ప్రారంభించింది, అదే ఇన్ఫినిట్ గేమ్ టేబుల్ అని పిలువబడే ఒక పెద్ద కాఫీ టాబ్లెట్. ఇది టచ్‌స్క్రీన్ టేబుల్‌టాప్ దీని ధర 700 డాలర్లు. అయితే ఆరుగురు ఒకేసారి డినిపై క్లాసిక్ బోర్డ్ గేమ్‌లను ఆడవచ్చు.
జాన్ డీరే డ్రైవర్‌లెస్ ట్రాక్టర్
జాన్ డీర్ ఈ షోలో ఆటోమేటిక్ ట్రాక్టర్‌ను పరిచయం చేశారు. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న ఈ ట్రాక్టర్ స్టీరింగ్ జీపీఎస్‌తో పనిచేస్తుంది. పొలంలో దున్నడం నుంచి ఇతర పనులు దానంతట అదే చేసుకుంటుంది. దీనికి 6 స్టీరియో కెమెరాలు ఇంకా ఇతర సెన్సార్లు అమర్చబడి ఉంటాయి, తద్వారా రైతు దానిని మొబైల్‌లో రియల్ టైమ్ లో పర్యవేక్షించవచ్చు. దీనిలోని ఏఐ ట్రాక్టర్ ముందు వచ్చే అడ్డంకి లేదా ఇతర వాటిపై నిఘా ఉంచుతుంది. ఏదైనా పొరపాటు లేదా ప్రమాదం ఇంకా తప్పు జరిగితే వెంటనే యజమానికి తెలియజేస్తుంది.
కాన్సెప్ట్ ఈవితో
సోనీ ఈ-కార్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది అంతేకాకుండా అధికారికంగా ఈ-కార్ మార్కెట్లోకి ప్రవేశించబోతున్నట్లు ప్రకటించింది. కొత్త ఎస్‌యూవి ప్రోటోటైప్ ఇ-వెహికల్‌తో కంపెనీ అడుగు పెట్టింది. అయితే దీని గురించి కంపెనీ పెద్దగా సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ కారు సోనీ మొదటి ఎలక్ట్రిక్ వాహనం, దీనిని విజన్-ఎస్ అని పిలుస్తారు. కానీ ఇంకా పబ్లిక్ రోడ్‌లో ట్రయల్ చేయబడుతోంది.