కార్ల తయారీ కష్టమన్న ఎలోన్ మస్క్ ట్వీట్ కి ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే ?
భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలోన్ మస్క్ కంపెనీ మన దేశీయ కార్లతో సరిపోవని అనుకోని ఉండొచ్చు, కానీ కార్ల తయారీ విషయంలో కనీసం ఒక విషయంలో అయినా ఈ ఇద్దరు వ్యాపార దిగ్గజాలు అంగారించారు - అదేంటంటే కార్ల ఉత్పత్తి కష్టం అని.
మంగళవారం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ కార్ల ఉత్పత్తిపై ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు, కార్ల ఉత్పత్తి కష్టం అని పాజిటివ్ క్యాష్ ప్రవాహంతో ఉత్పత్తి మరింత కష్టమని ఎలోన్ మస్క్ ట్వీట్ కి ఆనంద్ మహీంద్ర అంగీకరించారు. ఇప్పటికీ దశాబ్దాల కష్టం, శ్రమ తర్వాత ఇది వారి జీవన విధానంగా మారింది ఆని కూడా ఉన్నారు.
ఎలోన్ మస్క్ ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ సిఇఒ జేమ్స్ డైసన్ కంపెనీ డైసన్ ఎలక్ట్రిక్ కారు తయారీ ప్రయత్నం ఫైల్ గురించి కొత్త పుస్తకంలో పంచుకున్నప్పుడు ఇదంతా ప్రారంభమైంది. "కార్ల ఉత్పత్తి కష్టం. పాజిటివ్ క్యాష్ ప్రవాహంతో ఉత్పత్తి చాలా కష్టం," అంటూ ఎలోన్ మస్క్ ట్వీట్ చేస్తూ షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్రా టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ట్వీట్ ని ఏకీభవిస్తు, కార్ల తయారీదారులకు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ ముందుకు సాగుతున్నారని చెప్పారు. "మేము దీనిని దశాబ్దాలుగా చేస్తున్నాము. ఇప్పటికీ శ్రమించడం, కష్టపడటం ఇది అంతా మా జీవన విధానం ..." అంటూ పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్ 4,900 'లైక్‌లు', ఎన్నో కామెంట్లను సంపాదించింది.
ఆనంద్ మహీంద్రా చేసిన రిప్లయికి ఎలోన్ మస్క్ ఇంకా స్పందించాల్సి ఉండగా, కొత్త కార్ల కంపెనీలు రీప్లేస్‌మెంట్ చేసే పార్ట్శ్ అధిక లాభంతో విక్రయించే బెనిఫిట్ కలిగి లేవని ఆయన హైలైట్ చేసారు. కొత్త తయారీ సంస్థలు కూడా సర్వీస్, సేల్స్ మౌలిక సదుపాయాలను కలిగి లేవని అన్నారు.
"పెద్ద కార్ల తయారీదారులు కార్లను తక్కువ నుండి జీరో ట్రు మార్జిన్ వరకు విక్రయిస్తారు. వీరి లాభాలలో ఎక్కువ భాగం రీప్లేస్‌మెంట్ పార్ట్‌ల విక్రయంలో ఉంటుంది, అని ఎలోన్ మస్క్ తన ట్వీట్‌లో రాశాడు. గత వారం మహీంద్రా అండ్ మహీంద్రా ఆగస్టులో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 17 శాతం పెరుగుదల నమోదు చేసింది.