కార్ అండ్ బైక్ అవార్డ్స్ 2021: కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గెల్చుకున్న కియా సోనెట్..

First Published Mar 20, 2021, 11:39 AM IST

కియా మోటర్స్ కార్పొరేషన్ కి చెందిన కియా సోనెట్‌కు ప్రతిష్టాత్మక 2021 సిఎన్‌బి కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ నుండి వచ్చిన పాపులర్ మోడల్  ఈ ఏడాది 2021 సిఎన్‌బి సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం కియా సోనెట్ హ్యుందాయ్ ఐ20, మహీంద్రా థార్, హోండా సిటీ, వోక్స్వ్యాగన్ టి-ఆర్‌ఓసి, వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆల్ స్పేస్, బిఎమ్‌డబ్ల్యూ 220డి వాటికి గట్టి పోటీగా నిలిచింది.