పివి సింధుకు ఆ గిఫ్ట్ ఇవ్వాలంటు ట్విట్టర్ లో ట్వీట్.. స్పందించిన ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
టోక్యో ఒలింపిక్ 2020లో రెండవ ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి.సింధుకి ఇది ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పవచ్చు. చైనాకు చెందిన హీ బింగ్జియావోను ఓడించి భారత షట్లర్ కాంస్యం గెలుచుకోవడంతో ప్రతి భారతీయుడు గర్వంగా భావించారు.
ఆమె విజయం తరువాత ప్రజలు ఆమె ఒలింపిక్స్ లో చేసిన అద్భుతమైన ప్రదర్శనకి సోషల్ మీడియాలో అభినందించడం ప్రారంభించారు . అయితే పివి సింధు చారిత్రాత్మక ప్రదర్శనకి మహీంద్రా థార్‌తో సత్కరించాలని కోరుకుంటు ఒక ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు.ట్విట్టర్ యూజరైనా వాడేవాలే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇంకా పివి సింధులను ట్వీట్‌లో ట్యాగ్ చేశారు కూడా.
61 ఏళ్ల వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పివి.సింధు గ్యారేజీలో ఇప్పటికే ఒక మహీంద్రా థార్ ఉందని యూజర్‌కి సమాధానమిస్తూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా 2016 నాటి పివి సింధు, సాక్షి మాలిక్ మహీంద్రా థార్‌పై ప్రయాణిస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ఆమె గ్యారేజ్ లో ఇప్పటికే ఒక మహీంద్రా థార్ ఉంది" అని ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా రిప్లయ్ ఇచ్చారు.
పివి సింధు, సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్ 2016లో పతకాలు గెలిచిన తర్వాత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో కంపెనీ ఈ యువ అచివర్స్ కి సరికొత్త కస్టమైజేడ్ ఎస్‌యూవీని బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. పివి సింధు రియో ఒలింపిక్స్‌లో రజత పతకం, రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలుచుకున్నారు.
మరో ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా పివి సింధు కనబరిచిన ఆట తీరును అభినందిస్తు ప్రశంసించారు. "మానసిక బలం కోసం ఒలింపిక్స్ ఉంటే అందులో పివి.సింధు టాప్ లో ఉంటుంది. నిరుత్సాహపరిచే ఓటమి కంటే ఇంకా పైకి ఎదగడానికి ఎంత రెసిలియెన్స్, కమిట్మెంట్ అవసరమో ఆలోచించండి & మీరు ఇప్పటికీ మా గోల్డెన్ గర్ల్ @Pvsindhu1” అని ట్వీట్ చేశారు.