బంపర్ ఆఫర్: కొత్త కారు కొనుగోలు పై రూ .2.56 లక్షల వరకు డిస్కౌంట్.. కొద్దిరోజులే అవకాశం..
దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలపై గొప్ప తగ్గింపులను తీసుకొచ్చింది. ఒక వైపు ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలను పెంచుతుండగా మహీంద్రా కంపెనీ మాత్రం అమ్మకాలను పెంచుకోవడానికి, వినియోగదారులను ఆకర్షించడానికి ఆగస్టు నెలలో ఎంచుకున్న మోడళ్లపై చాలా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది.
కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, దేశీయ సంస్థ ఎస్‌యూవీ కార్లపై రూ .2.56 లక్షల వరకు భారీ తగ్గింపులను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, అదనపు ఆఫర్లు వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సంస్థ ఈ ఆఫర్ ఆగస్టు 31 వరకు వర్తిస్తుందని తెలిపింది. మహీంద్రా హాట్ సెల్లింగ్ ఎస్‌యూవి థార్, ఇటీవల లాంచ్ చేసిన ఎక్స్‌యూవి700 పై ఎలాంటి డిస్కౌంట్ అందించడం లేదు. మీరు మహీంద్రా కొత్త కారు కొనాలనుకుంటే ఈ నెలలో మీరు రూ .2.56 లక్షల వరకు ఆదా చేయవచ్చు. మహీంద్రా ఏ మోడళ్లపై ఎలాంటి ఆఫర్ అందిస్తున్నదో తెలుసుకోండి...
మహీంద్రా ఎక్స్‌యూవి500
ఆగస్టు నెలలో మహీంద్రా ఎక్స్‌యూవి500 ఎస్‌యూవిని కొనుగోలుపై మొత్తం రూ .2.56 లక్షల ఆదా చేయవచ్చు. కంపెనీ ఆఫర్ కింద రూ .1.79 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ .50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 6,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తుంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవి500 ఎక్స్-షోరూమ్ ధర రూ .17 లక్షల నుండి రూ .23.77 లక్షల వరకు ఉంటుంది.
మహీంద్రా బొలెరో
మహీంద్రాలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవి బొలెరోపై రూ .23,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఆగస్టు నెలకు ఆఫర్ కింద కంపెనీ ఈ ఎస్‌యూవి పై రూ .3,500 వరకు నగదు బెనెఫిట్స్, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. దీనితో పాటు రూ .6,500 విలువైన ఇతర ఆఫర్లు ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.62 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బొలెరో స్థానంలో కంపెనీ ఇటీవల మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీని విడుదల చేసింది.
మహీంద్రా స్కార్పియో
మహీంద్రా ప్రముఖ ఎస్‌యూవి స్కార్పియోపై ఆగస్టు నెలలో మొత్తం రూ .36,042 వరకు ఆఫర్ చేస్తుంది. కంపెనీ రూ .15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .4,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ .17,042 వరకు అదనపు బెనెఫిట్స్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో ఎక్స్-షోరూమ్ ధర రూ .12.59 లక్షల నుండి రూ .17.39 లక్షల వరకు ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవి300
మహీంద్రా ప్రముఖ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవి ఎక్స్‌యూవి300పై మొత్తంగా రూ .44,720 తగ్గింపుతో విక్రయిస్తోంది. ఆఫర్ కింద ఆగస్టు నెలలో ఎక్స్‌యూవి300 పై రూ. 10,720 నగదు తగ్గింపు, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .4,500 కార్పొరేట్ బోనస్‌తో అందిస్తుంది. అంతేకాకుండా ఈ నెలలో ఎక్స్‌యూవి300 కారును కొనుగోలు చేస్తే రూ. 5,000 విలువైన అదనపు బెనెఫిట్స్ కూడా ఉంటాయి. ఎక్స్‌యూవి300 ఎక్స్-షోరూమ్ ధర రూ .7.96 లక్షల నుండి రూ .13.33 లక్షల వరకు ఉంటుంది.
మహీంద్రా కేయూవి100 ఎన్‌ఎక్స్‌టి
మహీంద్రా ఎంట్రీ లెవల్ ఎస్‌యూవి కేయూవి100పై రూ .38,055 క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతే కాకుండా, రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .3,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఇస్తుంది. మొత్తంమీద ఈ నెలలో ఈ ఎస్‌యూవిని కొనుగోలు చేస్తే రూ. 61,055 ఆదా అవుతుంది. కేయూవి100 ఎన్‌ఎక్స్‌టి ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.10 లక్షల నుండి రూ .7.76 లక్షల వరకు ఉంటుంది.
మహీంద్రా ఆల్టూరాస్ జి 4
మహీంద్రా ఆగస్టు నెలలో ఆల్టూరాస్ జి 4 పై రూ. 81,500 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఆల్టూరాస్ జి 4 పై రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ .20,000 వరకు అదనపు బెనెఫిట్స్ అందుబాటులో ఉంటాయి. మహీంద్రా ఆల్టూరాస్ ధర రూ .28.77 లక్షల నుండి రూ .31.77 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.
మహీంద్రా మరాజో
మహీంద్రా మరాజో ఎంపివిపై ఆగస్టు నెలలో రూ. 40,200 వరకు బెనెఫిట్స్ కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఆఫర్ కింద ఈ కారుపై ఆగస్టు నెలలో రూ .20,000 వరకు నగదు తగ్గింపు, రూ .15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .5,200 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తుంది. మరాజో ఎక్స్-షోరూమ్ ధర రూ .12.30 లక్షల నుండి రూ .14.43 లక్షల వరకు ఉంటుంది.
గమనిక: వాహనాలపై లభించే డిస్కౌంట్లు నగరం నుండి నగరానికి మారవచ్చు. ఈ ఆఫర్లను డీలర్లు మాత్రమే ఇస్తున్నారు. తాజా ఆఫర్ల గురించి మరిన్ని వివరాల కోసం మీ నగరంలోని సమీప డీలర్‌షిప్‌ని సందర్శించండి.