బంపర్ ఫ్రీడం ఆఫర్: చౌకైన 7 సీట్ల కారును మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం..
భారతీయ కార్ల మార్కెట్లో ఎస్‌యూవి కార్లకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది, ఇంకా తక్కువ ధరలోనే లభ్యమవుతున్నాయి. ఈ కార్లలో ఎక్కువ స్థలం కూడా లభిస్తుంది. మీ కుటుంబం పెద్దది అయితే, మీరు 7-సీట్ల వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే మీకో మంచి అవకాశం.
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ ప్రముఖ 7 సీట్ల ఎంపివి కార్ ట్రైబర్ మీద ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. మెరుగైన మైలేజీతో ఈ బడ్జెట్ కారును ఆగస్టు నెలలో బంపర్ డిస్కౌంట్‌తో అందిస్తుంది. రెనాల్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త రెనాల్ట్ ట్రైబర్ వివిధ రాష్ట్రాల్లో వివిధ ఆఫర్లతో అమ్మకానికి అందుబాటులో ఉంది. రెనాల్ట్ ట్రైబర్ పాత ఇంకా కొత్త మోడళ్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఆఫర్ కింద ఆగష్టు నెలలో రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలు చేస్తే అత్యధికంగా సేవింగ్స్ చేయవచ్చు.
కంపెనీ ఆఫర్‌లో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ. 10,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి. కంపెనీ ఆఫర్ సెలెక్టెడ్ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త 2021 మోడల్ ట్రైబర్ పై రూ .60,000 తగ్గింపును పొంవచ్చు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి.
కంపెనీ రెనాల్ట్ ట్రైబర్ మోడల్ 2020 పై రూ .60,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. వీటిలో రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 ఫ్రీడమ్ ఆఫర్ ఉన్నాయి. కొత్త 2021 మోడల్ ట్రైబర్‌పై రూ. 50,000 వరకు సేవింగ్స్ చేయవచ్చు. ఇందులో రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బెనెఫిట్స్, రూ. 5,000 ఫ్రీడమ్ ఆఫర్ ఉన్నాయి.
ఇటీవల రెనాల్ట్ (రెనో) ప్రముఖ ఎంపివి ట్రైబర్‌ని భారతీయ మార్కెట్లో కొత్త లుక్ లో విడుదల చేసింది. దీనిలో లేటెస్ట్ అప్‌డేట్‌లతో ఇంకా పాత మోడల్ కంటే మరింత మెరుగ్గా ఉంటుంది.
కొత్త 2021 రెనాల్ట్ ట్రైబర్ ఎంపివిని మొత్తం నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టరు. ఇందులో RXE, RXL, RXT, RXZ వేరియంట్‌లు ఉన్నాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ ఎంపివి కారు సైజ్ చిన్నగా ఉంటుంది. ఇంకా కారు లోపల చాలా స్థలం లభిస్తుంది.
రెనో ప్రకారం పాత మోడల్‌తో పోలిస్తే కొత్త ట్రైబర్ ఎంపివి లుక్స్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ పరంగా మరింత మెరుగ్గా మారింది. ఇప్పుడు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ ఫీచర్లు కూడా లభిస్తాయి, దీని సహాయంతో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్‌లో మాట్లాడవచ్చు. దీనితో పాటు డ్రైవర్ సీటు ఎత్తు అడ్జస్ట్ చేసే ఫీచర్ కూడా ఉంది. అలాగే ఈ ఎంపివి ఇప్పుడు డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్స్, ఎల్‌ఈడి టర్న్ ఇండికేటర్స్, కొత్త బాడీ కలర్ సెడార్ బ్రౌన్ పొందుతుంది.
కొత్త 2021 రెనాల్ట్ ట్రైబర్‌లో కంపెనీ 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ 70 బిహెచ్‌పి పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
ఇప్పుడు ఈ 7-సీటర్ ఎంపివి రెనాల్ట్ ట్రైబర్ కారులో మూడవ వరుస సీట్లను ఫోల్డ్ చేయవచ్చు. మూడవ వరుస సీట్లు ముడుచుకున్నప్పుడు, కారు లోపల 625 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఈ విభాగంలో కారులో లభించే అత్యధిక బూట్ స్పేస్ ఇది. అంతేకాకుండా కారులో మూడవ వరుస సీట్లను వేరు చేసే సౌకర్యం కూడా ఉంది. కారు టాప్-స్పెక్ మోడల్‌లో కంపెనీ 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, 4 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక ఫీచర్లను పొందుతుంది.
కొత్త 2021 రెనాల్ట్ ట్రైబర్ ఎంపివి కారు బేస్ వేరియంట్ RXE ధర రూ. 5.50 లక్షలు, టాప్ మోడల్ RZX AMT వేరియంట్‌కి రూ .7.95 లక్షల వరకు ఉంది. దీని బేస్ మోడల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.
ఈ ట్రైబర్ కారు భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ కారు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ను సులభంగా పాస్ చేసింది. గ్లోబల్ NCAP 'సేఫ్ కార్స్ ఫర్ ఇండియా' ప్రచారంలో నిర్వహించిన తాజా టెస్ట్ లో ట్రైబర్ ఎంపివి 5 స్టార్స్ రేటింగ్ లో 4 స్టార్ రేటింగ్ సాధించింది. గ్లోబల్ ఎన్‌సిఎపి టెస్ట్ లో పాత రెనాల్ట్ మోడల్ కంటే ట్రైబర్ గణనీయమైన మెరుగుదలను చూపించింది. ఈ సేఫ్టీ క్రాష్ టెస్ట్ ఫలితాల ప్రకారం టైబర్ ఎంపివి డ్రైవర్, కో-డ్రైవర్ ఇద్దరి తలను చాలా వరకు రక్షిస్తుంది.
అడల్ట్ రక్షణ పరంగా ఈ ఎంపివికి 4 స్టార్ రేటింగ్ లభించింది. పిల్లల రక్షణఎల్‌ఓ 3 స్టార్ రేటింగ్‌ను పొందింది. టెస్ట్ సమయంలో తీసుకున్న మోడల్‌కు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, స్పీడ్ అలర్ట్, పార్కింగ్ సెన్సార్లు మొదలైన స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో మహీంద్రా మరాజో తర్వాత 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెండవ ఎంపివి ఇది.