MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • బి‌ఎం‌డబల్యూ మొదటి ఎలక్ట్రిక్ కార్.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో దీని గొప్ప ఫీచర్లు, ధర తెలుసుకోండి

బి‌ఎం‌డబల్యూ మొదటి ఎలక్ట్రిక్ కార్.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో దీని గొప్ప ఫీచర్లు, ధర తెలుసుకోండి

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బి‌ఎం‌డబల్యూ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌విని భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. భారత మార్కెట్లో BMW మొదటి ఎలక్ట్రిక్ SUV iX ధరను రూ. 1.16 కోట్లుగా నిర్ణయించింది. BMW iX ఎలక్ట్రిక్ SUV భారతదేశంలో పూర్తిగా నిర్మించబడిన యూనిట్ (CBU)లో విక్రయించనుంది. 

3 Min read
Ashok Kumar | Asianet News
Published : Dec 14 2021, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఆకర్షణీయమైన రూపాన్ని, అత్యంత ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు Euro NCAP క్రాష్ టెస్ట్‌లోని అన్ని టెస్ట్ విభాగాల్లో అత్యధికంగా  5-స్టార్ రేటింగ్‌ను పొందింది. అలాగే అత్యంత సురక్షితమైన కారుగా మారింది. 

బి‌ఎం‌డబల్యూ ఐ‌ఎక్స్ తో భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి విభాగంలోకి ప్రవేశించబోతోంది. బి‌ఎం‌డబల్యూ ఐ‌ఎక్స్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు. అలాగే ఈ కారు భారతదేశంలోని మెర్సిడెస్-బెంజ్  ఈ‌క్యూ‌సి (Mercedes-Benz EQC), ఆడి ఈ-ట్రాన్ (Audi e-tron), పోర్షే టాయ్కన్(Porsche Taycan) వంటి కార్లతో పోటీపడుతుంది. 

29

రెండు వేరియంట్‌లు
బి‌ఎం‌డబల్యూ ఐ‌ఎక్స్ ఆల్-న్యూ అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది అలాగే సైజ్ పరంగా బి‌ఎం‌డబల్యూ ఎక్స్5కి దాదాపు సమానంగా ఉంటుంది. ఈ కారు బి‌ఎం‌డబల్యూ  5వ జనరేషన్ ఆల్-ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది, ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బి‌ఎం‌డబల్యూ ఐ‌ఎక్స్ రెండు వేరియంట్‌లలో వస్తుంది - ఒకటి xDrive 40 అండ్ రెండవది xDrive 50. 

39

డ్రైవింగ్ రేంజ్
BMW iX xDrive 40 వేరియంట్ 71 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే (WLTP సైకిల్) గరిష్టంగా 414 కి.మీ ప్రయాణిస్తుంది. డ్యూయల్ మోటార్లు 322 బిహెచ్‌పి, 630 ఎన్ఎమ్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. xDrive 50 వేరియంట్ 105.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది ఇంకా గరిష్టంగా 611 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఈ వేరియంట్ 516 BHP శక్తిని, 765 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది అలాగే 4.6 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకోగలదు.

49

బ్యాటరీ అండ్ ఛార్జింగ్
బి‌ఎం‌డబల్యూ ఐ‌ఎక్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ ఆప్షన్ లభిస్తుంది, అంటే డి‌సి ఫాస్ట్ ఛార్జింగ్‌ని 195kW వరకు అనుమతిస్తుంది. దీనితో xDrive 50 వేరియంట్ బ్యాటరీని కేవలం 35 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే iX xDrive 40 DC ఛార్జర్‌ని ఉపయోగించి 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 31 నిమిషాలు పడుతుంది. 

59

 లూక్స్ అండ్ స్టయిల్ 
డిజైన్ గురించి మాట్లాడుతూ బి‌ఎం‌డబల్యూ  ఐ‌ఎక్స్ ఫ్రంట్ లుక్ ఆకర్షణీయమైన స్టైలింగ్‌తో సులభంగా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంకా బ్లాక్ థీమ్‌తో బి‌ఎం‌డబల్యూ పెద్ద ఫ్రంట్ గ్రిల్‌ను పొందుతుంది, డ్యుయల్-బీమ్‌ల కనిపించే స్లిమ్ ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు, ఎస్‌యూ‌వి ఆల్-ఎలక్ట్రిక్ ఫీచర్లను సూచించే ముందు బంపర్ బ్లూ యాక్సెంట్‌లను పొందుతుంది. బోనెట్ కూడా ఆకర్షణీయమైన లుక్‌తో వస్తుంది.

ఎస్‌యూ‌వి  సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే బి‌ఎం‌డబల్యూ ఐ‌ఎక్స్  స్పోర్టీ అల్లాయ్ వీల్స్, బ్లూ యాక్సెంట్‌లతో బ్లాక్ సైడ్ బాడీ క్లాడింగ్, బ్లాక్ గ్లాస్ ఏరియా, బ్యాక్ ప్రొఫైల్‌లో స్లిమ్ ఎల్‌ఈ‌డి టైల్‌లైట్‌లు, స్పోర్టీ రూఫ్ స్పాయిలర్, బ్లూ యాక్సెంట్‌లతో కూడిన బ్లాక్ బంపర్ఇంకా ఎస్‌యూ‌వి  స్లోపింగ్ రూఫ్‌లైన్ దాని స్టైలింగ్‌కు మరింత లుక్  జోడిస్తుంది. 

 

69

ఇంటీరియర్ అండ్ ఫీచర్లు
బి‌ఎం‌డబల్యూ ఐ‌ఎక్స్  ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ కారణంగా X7 కంటే ఎక్కువ ఇంటర్నల్ స్పేస్ ఇస్తుంది. కొత్త మైక్రోఫైబర్ క్లాత్‌తో సహా సీట్ల కోసం రియూజబుల్ ప్లాస్టిక్‌ను కూడా ఉపయోగించారు.

 పెద్ద డిస్‌ప్లే
దీని ఇంటీరియర్‌ల నిజమైన హైలైట్, దీని స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌గా పనిచేసే పెద్ద కర్వ్ డిస్‌ప్లే సింగిల్-పీస్ కర్వ్డ్ గ్లాస్‌లో 12.3-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉన్నాయి రెండూ డ్రైవర్ వైపు ఉన్నాయి. ఇంకా రీడిజైన్ చేయబడిన హెడ్-అప్ డిస్ప్లేను కూడా పొందుతుంది.

79

సెంట్రల్ కన్సోల్ 
ఈ కారు ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి దీనికి సెంట్రల్ కన్సోల్ లేదు. డ్రైవ్ సెలెక్ట్ కోసం కంట్రోల్ అండ్ బి‌ఎం‌డబల్యూ  iDrive రోటరీ కంట్రోల్ ఆర్మ్‌రెస్ట్ ముందు భాగంలో సెట్ చేసి ఉంటాయి. ఇతర కంట్రోల్ డోర్ ట్రిమ్‌ల పైన సెట్ చేసి ఉంటాయుయి. ఈ కారు 650 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది.

5-స్టార్ సేఫ్టీ రేటింగ్ 
BMW iX అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఫ్లాగ్‌ సృష్టించింది. ఈ టెస్ట్ డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ల మధ్య కొత్త ఇంటరాక్టివ్ ఎయిర్‌బ్యాగ్  ప్రభావాన్ని రుజువు చేశాయి, సైడ్ ఢీకొన్న సందర్భంలో గాయల నుండి అదనపు రక్షణను అందిస్తుంది. BMW IX వెనుక భాగంలో ఉన్న చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌కు ముందువైపు అలాగే సైడ్ కొలిషన్ రెండింటికీ అత్యధిక స్కోర్ పొందింది. 

89

ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్
BMW iX బ్రేక్ ఇంటర్‌వెన్షన్‌తో ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్‌ ఉంది, అంటే పాదచారులను లేదా సైక్లిస్ట్‌లను అలాగే వాహనాలను గుర్తించగలదు. అదనంగా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఇప్పుడు టర్నింగ్ సమయాల్లో కూడా ప్రతిస్పందిస్తుంది. ఇంకా పాదచారులకు ప్రమాదాన్ని తగ్గించడానికి, ఎడమవైపు తిరిగేటప్పుడు ఎదురుగా వచ్చే ట్రాఫిక్‌తో ఢీకొనే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

99

కొత్త ప్రమాణాలను సెట్ చేయడం 
BMW వాహన భద్రత హెడ్ డొమినిక్ షుస్టర్ మాట్లాడుతూ, "BMW IX స్థిరత్వంలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది ఇంకా Euro NCAPలో టాప్ 5-స్టార్ రేటింగ్ వాహనంగా  నొక్కి చెబుతుంది.  ఇంకా BMW ix కొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌తో టెస్ట్ షెడ్యూల్‌లలో ఇంకా ప్రతిరోజూ డ్రైవింగ్‌లో అత్యధిక స్కోర్‌ను సాధించింది, అంతేకాకుండా చాలా రకాల పరిస్థితులలో ప్రమాదాల నుండి రక్షిస్తుంది ఇంకా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది." అని అన్నారు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved