వావ్.. ఆశ్చర్యపరుస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్.. ఒక్క బటన్ తో కార్ కలర్ నచ్చినట్టు మార్చేయవచ్చు..
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)2022లో లగ్జరీ కార్ బ్రాండ్ బిఎండబల్యూ ( BMW)డ్రైవర్ ఆదేశాలకు అనుగుణంగా కారు ఎక్స్టార్నల్ షెడ్ ని మోడిఫై చేసే అద్భుతమైన ఫ్యూచర్ టెక్నాలజిని ప్రదర్శించింది. ఈ ఇంక్(Eink)తో కూడిన బిఎండబల్యూ ఐఎక్స్ ఫ్లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవి ప్రత్యేకంగా రూపొందించిన బాడీ ర్యాప్ కస్టమైజేడ్ కలిగి ఉంది.
నిని ఆక్టివేట్ చేసినప్పుడు ఎలెక్ట్రోఫోరేటిక్ టెక్నాలజి కారుని వివిధ రంగులకి మారుస్తుంది దీంతో కార్ బాడీ కావలసిన రంగులోకి మార్చుకోవచ్చు.
బిఎండబల్యూ గ్రూప్ ప్రస్తుతం ఈ ఇంక్(Eink)టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ముందుంది. బిఎండబల్యూ ఐఎక్స్ ఫ్లో విత్ ఈ ఇంక్ ప్రాజెక్ట్ హెడ్ స్టెల్లా క్లార్క్ మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్‌లు వారి పర్సనాలిటీ విభిన్న కోణాలను తెలియజేయడానికి లేదా మార్పు పట్ల వారి అభిరుచి తెలియజేయడానికి ఇంకా కారులో కూర్చున్న ప్రతిసారీ దీనిని రీడిఫైన్ చేయడానికి అనుమతిస్తుంది. సోషల్ మీడియాలో ఫ్యాషన్ లేదా స్టేటస్ అప్‌డేట్‌ల లాగానే ఉంటుంది అని చెప్పింది. ఇంకా కారు ప్రతిరోజు జీవితంలో ఎన్నో మనోభావాలు, పరిస్థితులకు ప్రతిబింబంలా అవుతుంది.
బిఎండబల్యూ ప్రకారం రంగులు మార్చే ఊసరవెల్లి లాంటి టెక్నాలజి వాహనం ఎయిర్ కండిషనింగ్‌కు అవసరమైన కూలింగ్ అండ్ వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది వాహనం విద్యుత్ వ్యవస్థ ఇంకా వాహనం ఇంధనం లేదా విద్యుత్ వినియోగానికి అవసరమైన శక్తిని తగ్గిస్తుంది. పూర్తి ఎలక్ట్రిక్ వాహనంలో వాతావరణానికి సరిపోయేలా రంగును అడ్జస్ట్ చేయడం వల్ల రేంజ్ విస్తరించవచ్చు. ఉదాహరణకు టెక్నాలజి డాష్‌బోర్డ్ లోపలి భాగంలో వేడెక్కకుండా రక్షించవచ్చు.
ఇంకా, ఈ ఇంక్(Eink)టెక్నాలజి ముఖ్యంగా ఎనర్జి ఎఫిసియంట్ అని పేర్కొనబడింది. మానిటర్లు లేదా ప్రొజెక్టర్ల లాగా కాకుండా కావలసిన రంగుని నిర్వహించడానికి ఎలెక్ట్రోఫోరేటిక్ టెక్నాలజికి ఎటువంటి శక్తి అవసరం లేదు. ఎలెక్ట్రోఫోరేటిక్ కలరింగ్ అనేది ఈ ఇంక్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది, ఇది eReader డిస్ ప్లేలలో అప్లికేషన్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ ఇంక్‌తో కూడిన BMW iX ఫ్లో కారు పై సర్ఫేస్ కోటింగ్ మనిషి జుట్టు మందంతో మిలియన్ల కొద్దీ మైక్రోక్యాప్సూల్‌లను కలిగి ఉంది. ప్రతి మైక్రోక్యాప్సూల్‌లో నెగటివ్ చార్జ్ చేయబడిన తెల్లని వర్ణద్రవ్యాలు, పాజిటివ్ చార్జ్ చేయబడిన బ్లాక్ వర్ణద్రవ్యాలు ఉంటాయి.